GDP: ఆర్థిక వ్యవస్థను టార్కెట్ చేస్తున్న వర్షాలు.. పడితే పండగే.. లేకుంటే దండగే..!

GDP: భారత ఆర్థిక వ్యవస్థ గత ఏడాది 6.6 శాతం సంకోచం నుంచి 2021-22లో 8.7 శాతనికి మెరుగుపడింది. అయితే ఈ సూచీల సంఖ్యలు ఆర్థిక వ్యవస్థలోని మందగమనాన్ని కప్పిపుచ్చుతున్నాయి.

GDP: ఆర్థిక వ్యవస్థను టార్కెట్ చేస్తున్న వర్షాలు.. పడితే పండగే.. లేకుంటే దండగే..!
Rains
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Jun 01, 2022 | 10:34 AM

GDP: భారత ఆర్థిక వ్యవస్థ గత ఏడాది 6.6 శాతం సంకోచం నుంచి 2021-22లో 8.7 శాతనికి మెరుగుపడింది. అయితే ఈ సూచీల సంఖ్యలు ఆర్థిక వ్యవస్థలోని మందగమనాన్ని కప్పిపుచ్చుతున్నాయి. మే 31న నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వెలువరించిన వార్షిక జాతీయ ఆదాయం 2021-22 తాత్కాలిక అంచనాలను గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుస్తాయి. అవేంటంటే.. భారతదేశ వాస్తవ GDP (ద్రవ్యోల్బణం-సర్దుబాటు చేసిన) 2021-22 నాల్గవ త్రైమాసికంలో గత ఏడాదిలో ఉన్న 2.5 శాతం నుంచి 4.1 శాతానకి పెరిగింది. వృద్ధి నెమ్మదిగా ఉండటానికి ప్రధానంగా ఏడాది ప్రారంభంలో ఒమిక్రాన్ వేవ్ లాక్ డౌన్ కారణమని తెలుస్తోంది. అయితే అనేక రంగాలపై ఈ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కాలంలో తయారీ రంగం కూడా తీవ్రంగా ప్రభావితమైందని గణాంకాలు చెబుతున్నాయి.

నిర్మాణ రంగం గణనీయంగా మందగించినట్లు కనిపిస్తోంది. త్రైమాసికంలో 2 శాతం మాత్రమే వృద్ధి చెందింది. Omicron వేవ్-ప్రేరిత లాక్‌డౌన్ నిర్మాణ కార్యకలాపాలను ఒక కొలిక్కి తెచ్చి ఉండవచ్చు. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆర్థిక కార్యకలాపాలను పెంచుతాయి. నిర్మాణాలు పెరగటం వల్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుంది. ఈ విభాగం GDPలో దాదాపు 10 శాతం వాటాను కలిగి ఉంది. దేశంలో దాదాపు 5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తూ ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పించే అతిపెద్ద రంగంగా రియల్టీ కీలకంగా ఉంది.

ద్రవ్యోల్బణం స్థాయిల్లో పెరుగుదల, ఆదాయ వృద్ధిపై అంచనాలు తగ్గించడంతోపాటు, వినియోగదారుల విశ్వాసాన్ని తగ్గించడం, ఉత్పత్తులు, సేవల అమ్మకాలను తగ్గటం జరుగుతోంది. ఈ మందగమనం పెరుగుతున్న నిత్యావసరాలు, ఆకాంక్షలు.. ప్రస్తుతం ప్రజల జీవన వ్యయాలను పెంచుతున్నాయి. మరోపక్క అధిక ఇన్‌పుట్ ఖర్చులు, పడిపోతున్న సరఫరాలు, రూపాయి క్షీణించడం వల్ల వ్యయప్రయాసలకోర్చి దిగుమతులు చేసుకోవటం కష్టతరంగా మారుతోంది. దీని వల్ల అన్ని వస్తువుల రేట్లు అమాంతం పెరుగుతున్నాయి. ప్రజల జేబులకు ఆహారం, ఇంధనం మాత్రమే కాక పెరుగుతున్న ఇతర ఖర్చలు అధిక భారాన్ని మోపుతున్నాయి. దీని వల్ల వారి గృహ బడ్జెట్ అమాంతం పెరుగుతోంది.

మంచి వ్యవసాయోత్పత్తి కోసం వర్షాలు సమృద్ధిగా కురువడమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమానంగా విస్తరించాలి. ఈ ఏడాది తేమతో కూడిన గాలులు ఎటువైపు వీస్తున్నాయో ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి, నీటిపారుదల, త్రాగునీటికి అవసరమైన 81 రిజర్వాయర్లను నింపడానికి రుతుపవనాలు కీలకంగా మారనున్నాయి. అంతేకాకుండా.. భారతదేశ వ్యవసాయ ఉత్పత్తిలో దాదాపు సగం ఖరీఫ్ పంటలైన వరి, చక్కెర, పత్తి, తృణధాన్యాల నుంచి వేసవిలో నాట్లు వేస్తారు. దేశంలో విస్తారమైన వర్షాలు.. కురిస్తే టెలివిజన్లు, కార్లు, బంగారం వంటి అనేక వస్తువులపై గ్రామీణ ప్రజలు వ్యయాన్ని పెంచుతారు. రూరల్ డిమాండ్ పుంజుకోవటం ఆర్థిక వ్యవస్థ వెేగంగా ముందుకెళ్లేందుకు ఉపకరిస్తుందని నిపుణలు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!