Indian Railways: మీరు రైలులో ప్రయాణిస్తున్నారా..? ఈ నియమాలు తప్పకుండా తెలుసుకోండి

మీరు చాలా సార్లు రైలులో ప్రయాణించే ఉంటారు. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని నియమాలను తెలుసుకోవడం ముఖ్యం. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అలాగే నియమాలు కూడా రూపొందిస్తుంటుంది. అలాంటి నియమాలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు..

Indian Railways: మీరు రైలులో ప్రయాణిస్తున్నారా..? ఈ నియమాలు తప్పకుండా తెలుసుకోండి
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Mar 31, 2023 | 5:22 PM

మీరు చాలా సార్లు రైలులో ప్రయాణించే ఉంటారు. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని నియమాలను తెలుసుకోవడం ముఖ్యం. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అలాగే నియమాలు కూడా రూపొందిస్తుంటుంది. అలాంటి నియమాలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. భారతీయ రైల్వే ప్రపంచంలోని పొడవైన రైలు మార్గాలలో ఒకటి. భారతదేశంలోని చాలా నగరాలు రైల్వేల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. 177 ఏళ్ల భారతీయ రైల్వేలు 68 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. నివేదిక ప్రకారం, భారతీయ రైల్వేలో ప్రతిరోజూ 2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైల్వేశాఖ కొన్ని నిబంధనలను రూపొందించింది. ఎందుకంటే ఇది మీ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. రైల్వేకు సంబంధించిన ఈ నియమాలు ఏమిటో తెలుసుకుందాం. మీరు ప్రయాణ సమయంలో మీ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటే, మీరు అదే రైలులో మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. దీని కోసం మీరు టీటీఈని సంప్రదించవచ్చు. లేదా ఐఆర్‌సీటీసీ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు.

  1. మిడిల్ బెర్త్ గడువు: మీరు మిడిల్ బెర్త్ బుక్ చేసుకున్నట్లయితే, దానికి కాలపరిమితి కూడా ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మిడిల్ బెర్త్‌ను తిరస్కరించకూడదు.
  2. రైలు మిస్‌ అయితే సీటు సురక్షితంగా ఉంటుందా?: మీరు మీ రైలును మిస్ అయినట్లయితే, మీరు వేరే స్టేషన్ నుంచి ఆ రైలును చేరుకోవాలంటే మీ సీటు కేవలం 2 స్టేషన్లు లేదా 1 గంట పాటు వేరొకరి పేరు మీద కేటాయించరు. ఆ తర్వాత టీటీఈ మరొకరికి కేటాయించవ్చు.
  3. ఇవి కూడా చదవండి
  4. రాత్రిపూట ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు: రైల్వే నిబంధనల ప్రకారం.. రాత్రి 10 గంటల తర్వాత టీటీఈ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు. దీంతో పాటు 10 గంటలకు రైలు లైట్లు కూడా ఆపివేయవచ్చు.
  5. రైళ్లలో లగేజీ నియమాలు: ఏసీ బోగీలో 70 కిలోలు, స్లీపర్ కోచ్‌లో 40 కిలోలు, సెకండ్ క్లాస్ బోగీలో 35 కిలోలు తీసుకెళ్లవచ్చు. ఏసీలో 150 కిలోలు, స్లీపర్‌లో 80 కిలోలు, సెకండ్ క్లాస్ బోగీలో 70 కిలోల లగేజీని అదనపు ఛార్జీతో తీసుకెళ్లాలనే నిబంధన ఉంది.
  6. వేచి ఉండే టిక్కెట్‌పై ప్రయాణ నియమం: మీరు కౌంటర్ నుంచి వెయిటింగ్ టికెట్ తీసుకొని ప్రయాణిస్తే, మీరు రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణించవచ్చు. కానీ మీరు ఈ-టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ప్రయాణించినట్లయితే అది అనుమతించబడదు.
  7. చైన్ లాగితే జరిమానా: రైల్వే బోగీకి బిగించిన చైన్ లాగితే జరిమానాతో పాటు జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సందర్భంలో చైన్ లాగడం అత్యవసర సమయంలో మాత్రమే అనుమతి ఉంటుంది.
  8. ఆహారంపై నియమాలు: స్నాక్స్, ఆహారం, ఇతర ఆహార ఉత్పత్తులపై రైల్వే నిబంధనలను రూపొందించింది. రైలులో విక్రయించే ఆహార పదార్థాలపై అధిక ఛార్జీలు వసూలు చేయకూడదు. వీటితోపాటు ఆహారంలో నాణ్యత కూడా ఉండాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి