Indian Railways: మరో కీలక మైలురాయిని చేరుకున్న భారత రైల్వేలు.. వందే భారత్ కోచ్‌ల ఉత్పత్తిలో రికార్డు
సామాన్యుడిని తక్కువ ధరలో గమ్యానికి చేర్చే ప్రజా రవాణా సాధనంగా రైలు ప్రయాణం ఉంటుంది. అయితే మారుతున్న టెక్నాలజీ ప్రకారం వేగంగా గమ్యస్థానానికి చేర్చేలా ఇటీవల రిలీజ్ చేసిన వందే భారత్ రైలుతో రైల్వే శాఖ కీలక మైలురాయిని చేరుకుంది. కోచ్‌ల ఉత్పత్తిలో రికార్డులను సృష్టించింది.

భారత రైల్వే శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరంలో వందే భారత్ కోచ్‌ల ఉత్పత్తిని వేగవంతం చేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ రైలు దేశంలో రైలు ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఇది రెండు గమ్యస్థానాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా దేశంలో రైలు రవాణాను కూడా మెరుగుపరిచింది.ప్రస్తుతం వందే భారత్ రైలు కోచ్‌లను చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) ఉత్పత్తి చేసి తయారు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐసీఎఫ్ వందే భారత్ రైళ్ల ఉత్పత్తిని భారీగా పెంచింది . భారత రైల్వే ఉత్పత్తి యూనిట్ ఐసిఎఫ్ చెన్నై, వందే భారత్ రైలు తయారీలో కొత్త రికార్డును సృష్టించడం ద్వారా 2025 ఆర్థిక సంవత్సరంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది.
ఇటీవల ఐసీఎఫ్, చెన్నై దేశంలోని 82వ వందే భారత్ చైర్ కార్ రేక్ తయారీని పూర్తి చేసి అమర్చింది. ఈ కొత్త రైలు త్వరలో పట్టాలపైకి రానుంది. ఈ విజయంపై సీనియర్ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ కాలంలో ఐసీఎఫ్ వందే భారత్ చైర్ కార్ వెర్షన్‌కు సంబంధించిన 82వ రేక్‌ను విడుదల చేసిందని చెప్పారు. మార్చి 31, 2025 నాటికి మరో మూడు రేక్‌లను తయారు చేయాలని ఐసీఎఫ్ లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐసీఎఫ్ మూడు రకాల కోచ్‌లతో వందే భారత్ ట్రైన్‌సెట్‌లను ఉత్పత్తి చేస్తోంది. అయితే 2024 ఆర్థిక సంవత్సరం వరకు ఐసీఎఫ్ 16 కార్ కోచ్‌లను మాత్రమే ఉత్పత్తి చేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 136 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో 8 సర్వీసులు సెంట్రల్ రైల్వే (సీఆర్), సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్‌సీఆర్) లకు చెందినవి. అలాగే ఆరు సర్వీసులు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్), ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఈసీఆర్), తూర్పు రైల్వే (ఈఆర్) లకు చెందినవి. రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లునార్త్ సెంట్రల్ రైల్వే (ఎన్‌సీఆర్)కు కూడా సేవలను నిర్వహిస్తారు. నార్త్ ఈస్టర్న్ రైల్వే (ఎన్‌ఈఆర్), నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్), సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్‌ఈసీఆర్), వెస్ట్ సెంట్రల్ రైల్వే (డబ్ల్యూసీఆర్) ఒక్కొక్కటి 4 సర్వీసులను నడుపుతున్నాయి. పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) , వాయువ్య రైల్వే (ఎన్‌డబ్ల్యూఆర్) ఎనిమిది సర్వీసులను నడుపుతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఉత్తర రైల్వే (ఎన్‌ఆర్) గరిష్టంగా నడిపిస్తుంది. ఏకంగా 22 సర్వీసులను నడిపిస్తుంది. అలాగే దక్షిణ రైల్వే 20 సర్వీసులు, ఆగ్నేయ రైల్వే (ఎస్‌సీఆర్) 16 సర్వీసులు, సౌత్ వెస్ట్రన్ రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్) 10 సర్వీసులు నడిపుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








