Tejas Express: తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులోని సీట్ల ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన రైల్వే మంత్రి.. ఎందుకంటే..
తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో కొన్ని మార్పులను చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు ఈ రైలుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు..
తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన సీట్ల ఫోటోలతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. రైలు లోపలి భాగం వాలు సీట్లను చూపిస్తూ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలను మంత్రి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా యూజర్లు స్పందిస్తున్నారు. భారతదేశంలో ప్రవేశపెట్టిన తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటి సెమీ-హైస్పీడ్ ఎయిర్ కండిషన్డ్ రైలు. ఇది ఆటో మేటిక్ డోర్‌లతో కూడిన ఆధునిక ఆన్‌బోర్డు సౌకర్యాలను కూడా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ రైలులో సీట్లను అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు.
This is Tejas Express. pic.twitter.com/VutmOqi1OA
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 25, 2023
కాగా, ఫిబ్రవరి 26 నుంచి చెన్నై-మధురై మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు తాంబరం స్టేషన్‌లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ప్రకటించింది. తేజస్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం.22671) చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. ఇది మధురైకి మధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తేజస్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం.22672) మధురై నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ప్రస్తుతం ఈ రెండు రైళ్లు తిరుచ్చి, దిండిగల్ రైల్వే స్టేషన్‌లలో ఆగుతున్నాయి. అయితే ఈ చెన్నై-మధురై-చెన్నై తేజస్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు ట్రయల్ బేసిస్‌లో ఫిబ్రవరి 26 నుంచి ఆరు నెలల పాటు తాంబరం రైల్వే స్టేషన్‌లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే కమీషన్స్ జాయింట్ డైరెక్టర్ ప్రకటించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి