Indian Railways: రైలులో ఒక కోచ్ బుక్ చేసుకోండిలా.! ఎంత ఖర్చవుతుందో తెలుసా.?
మీరూ తరచూ రైలులో ప్రయాణం చేస్తుంటారా.? అయితే ఈ విషయాన్ని తెలుసుకోండి. సాధారణంగా మనం రైల్వే కౌంటర్ల దగ్గర గానీ, ఐఆర్‌సీటీసీలో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు..
మీరూ తరచూ రైలులో ప్రయాణం చేస్తుంటారా.? అయితే ఈ విషయాన్ని తెలుసుకోండి. సాధారణంగా మనం రైల్వే కౌంటర్ల దగ్గర గానీ, ఐఆర్‌సీటీసీలో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు.. మనకు వేర్వేరు బోగీల్లో బెర్తులు కన్ఫర్మ్ అవుతుంటాయి. అలా కాకుండా ఒకే బోగీలో అందరూ కలిసి ప్రయాణించాలంటే.? లేదా బృందంగా కలిసి ఏదైనా టూర్ వెళ్లినప్పుడు ఓ కోచ్ మొత్తాన్ని మనం బుక్ చేసుకోవాలంటే.? ఇలా సౌకర్యాలను ఇండియన్ రైల్వేస్ అందిస్తోంది. ఒకే కుటుంబానికి చెందినవారు లేదా ఓ విద్యాసంస్థకు చెందిన స్టూడెంట్స్.. ఇలా ఒక టూర్ వెళ్తున్నప్పుడు.. రైలులో ఒక బోగీని తమ కోసం బుక్ చేసుకోవచ్చు. ఒక కోచ్ మాత్రమే కాదు.. అవసరముంటే మనం మొత్తం రైలును కూడా బుక్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా.?
ఈ తరహ బుకింగ్‌ను ఫుల్ టారిఫ్ రేట్(FTR) బుకింగ్ అంటారు. ఎఫ్‌టీఆర్ సేవల కింద, ప్రయాణీకులు ఒక కోచ్‌ను లేదా మొత్తం ట్రైన్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి మీరు ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ని క్రియేట్ చేయాలి. అందుకోసం ముందుగా https://www.ftr.irctc.co.in/ftr/ సైట్‌ని సందర్శించాలి.
ఈ సైట్‌లోకి మీరు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మొత్తం రైలును బుక్ చేయాలనుకుంటున్నారా? లేదా ఏ బోగీని బుక్ చేసుకోవాలనుకుంటున్నారో.? అనే ఎంపికను ఎంటర్ చేయాలి. ఆపై అవసరమైన వివరాలను అందించండి. చివరిగా పేమెంట్‌ను పూర్తి చేస్తే.. మీ బుకింగ్ కంప్లీట్ అవుతుంది.
మీరు ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 కమ్ 3 టైర్, ఏసీ చైర్ కార్, స్లీపర్ వంటి కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, మీరు ఒక కోచ్‌ని బుక్ చేయాలనుకుంటే 50 వేల వరకు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి. మీరు ప్రయాణించే ప్రాంతం, దూరాన్ని బట్టి ఈ మొత్తం మారవచ్చు. అలాగే మీరు మొత్తం రైలును బుక్ చేయడానికి ప్లాన్ చేస్తే, మీరు మొత్తం రూ. 9 లక్షలు ఖర్చు చేయాలి. కాగా, టూర్ ప్లాన్ చేసుకునేవారు ప్రయాణానికి 30 రోజుల నుంచి 6 నెలల ముందుగానే కోచ్ లేదా రైలును బుక్ చేసుకోవాలి.