Indian Railways: రైలు హరన్స్ మోగించడంలో అర్థాలు ఏంటో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Indian Railways: సాధారణంగా స్టేషన్‌లలో రైలు హారన్ మోగించడం మీరు చూసే ఉంటారు. అయితే కొన్ని సార్లు ఒక్కసారి కాకుండా రెండు, మూడు సార్లు హరన్స్ మోగిస్తుంటారు రైలు డ్రైవర్. ఇన్ని సార్లు హరన్ మోగించడంలో అర్థం ఏంటో మీకు తెలుసా? స్టేషన్‌కు..

Indian Railways: ఇండియన్ రైల్వే.. ఇది దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే రైల్వేలో ఏ అంశం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. సాధారణంగా స్టేషన్‌లలో రైలు హారన్ మోగించడం మీరు చూసే ఉంటారు. అయితే కొన్ని సార్లు ఒక్కసారి కాకుండా రెండు, మూడు సార్లు హరన్స్ మోగిస్తుంటారు రైలు డ్రైవర్. ఇన్ని సార్లు హరన్ మోగించడంలో అర్థం ఏంటో మీకు తెలుసా? స్టేషన్‌కు చేరేముందు కానీ, క్రాసింగ్‌ల వద్ద కానీ రైలు డ్రైవర్ హరన్ మోగిస్తుంటాడు. అన్ని రైళ్ల హరన్లు ఒకేలా వినిపించినా.. వాటిలో రకరకాల అర్థాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. వాటి గురించి తెలుసుకుందాం..
స్టేషన్‌లో ఉన్న రైలు ఒక చిన్నహరన్ ఇచ్చిందంటే రైలు స్టేషన్ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉందని అర్థం. అంటే రైలు ప్లాట్ ఫామ్‌పైకి వచ్చిన తర్వాత వెళ్లే ముందు ఈ హరన్‌ను మోగిస్తారు. ఈ హరన్ అనేది రైలు కిచెన్‌లో ఉన్న మోటార్ మ్యాన్ గార్డుకు సిగ్నల్ ఇవ్వడానికి ఒక షాట్ హరన్ ఇస్తాడు రైలు డ్రైవర్. దీంతో గార్డు అంత చెక్ చేసి ట్రైన్ కదలడానికి సిగ్నల్ ఇస్తాడు. ఇక మూడు సార్లు షాట్ హరన్స్ ఇస్తుంటారు. ఇలా ఇచ్చాడంటే అది మోటారు మ్యాన్ అదుపు తప్పిందని అర్థం. దీంతో వార్డు వ్యాక్యుమ్ బ్రేక్ ను లాగుతాడు. దాంతో ట్రైన్ ఆగిపోతుంది.
ఇది కూడా చదవండి: కేవలం రూ.1 లక్ష పెట్టుబడి 52 లక్షలుగా మారింది.. అదృష్టం అంటే ఇదేనేమో..!
అలాగే నాలుగుసార్లు షాట్ హరన్ ఇచ్చారంటే రైలులో ఏదో టెక్నికల్ సమస్య ఉందని, రైలు స్టేషన్ నుంచి వెళ్లదని అర్థం. ఇందుకే ఈ సాంకేతిక సమస్యుంటే ఇలాంటి హరన్స్ ఇస్తారు. ఇక రెండు లాంగ్ హరన్‌లు, రెండు షాట్ హరన్‌లు ఇచ్చాడంటే ఆ ట్రైన్‌ను మోటార్ మ్యాన్ కంట్రోల్ నుంచి గార్డు కంట్రోల్ లోకి తీసుకుంటున్నట్లు అర్థం. ఇక వరుసగా హరన్ మోగుతుంటే ఆస్టేషన్‌లో రైలు ఆగదని అర్థం. అలాగే రైలు రెండు సార్లు ఆగి, రెండుసార్లు హరన్ మోగిస్తే అది రైల్వే క్రాసింగ్ దాటుతుందని అర్థం. ఇక రెండు షాట్ హరన్, ఒక లాంగ్ హరన్ మోగిస్తే ఎవరో చైన్ లాగినట్లు అర్థం. ఇక ఏదైనా రైలుకు ప్రమాదం జరిగినట్లయితే ఆరు సార్లు షాట్ హరన్స్ మోగిస్తారు. చూశారుగా.. రైలు హరన్స్ మోగించడంలో ఇన్ని అర్థాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
Post Office Scheme: మీరు నెలకు రూ.2000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
Indian Railways: రైలులో జనరల్ బోగీలు ముందు, వెనుక ఎందుకు ఉంటాయి? మధ్యలో ఎందుకు ఉండవు?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




