AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి తక్కువ టైమ్‌లో రూ.5 కోట్లు పొందాలంటే.. SIPలో ప్రతి నెలా ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి? ఎందులో చేయాలంటే?

SIP ద్వారా 15 ఏళ్లలో రూ.5 కోట్లు సంపాదించడం సాధ్యమే. సరైన మ్యూచువల్ ఫండ్స్ ఎంపిక, పోర్ట్‌ఫోలియో వైవిధ్యం, దీర్ఘకాలిక ప్రణాళికతో సంపదను సృష్టించవచ్చు. ఉదాహరణకు, పరాగ్ పారిఖ్ ఫ్లెక్సిక్యాప్, మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్, నిప్పాన్ ఇండియా మల్టీక్యాప్ వంటి ఫండ్‌లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

అతి తక్కువ టైమ్‌లో రూ.5 కోట్లు పొందాలంటే.. SIPలో ప్రతి నెలా ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి? ఎందులో చేయాలంటే?
Indian Currency 7
SN Pasha
|

Updated on: Jan 20, 2026 | 11:34 PM

Share

ఈ మధ్య కాలంలో పెట్టుబడి మాట వస్తే చాలు ఎక్కువ మంది SIP గురించే మాట్లాడుతున్నారు. ఉద్యోగం చేసుకునే వారికి ఈ సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ వరంగా మారింది. అందుకే ఐటీ ఉద్యోగులు కూడా SIPలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి నెలా నిర్ధిష్టమైన పెట్టుబడితో ఓ 15 ఏళ్ల తర్వాత రూ.5 కోట్ల నిధి పొందాలని చూస్తున్నారు. మరి అంత పెద్ద అమౌంట్‌ మనకు రావాలంటే ఎలా ఇన్వెస్ట్‌ చేయాలో? నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నెలవారీ పెద్ద SIPతో 15 సంవత్సరాలలో రూ.5 కోట్ల కార్పస్‌ను నిర్మించడం సాధ్యమే అనిపించవచ్చు, కానీ వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించడం, సరైన పోర్ట్‌ఫోలియో కేటాయింపు చాలా ముఖ్యమైనవి. దీర్ఘకాలంలో పెద్ద సంపదను సృష్టించాలనుకునే పెట్టుబడిదారులు సరైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి, సరైన నిధులను ఎంచుకోవాలి, నష్టాలను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు రాబోయే 15 సంవత్సరాలలో రూ.5 కోట్ల కార్పస్‌ను నిర్మించాలని ఓ యువతి టార్గెట్‌గా పెట్టుకుంది అనుకుంటే.. ఆమె పెట్టుబడి పోర్ట్‌ఫోలియో విలువ రూ.3 లక్షలు.

ఆమె ప్రస్తుత పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో మూడు మ్యూచువల్ ఫండ్‌లు ఉన్నాయి. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సిక్యాప్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్, క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. ఆమె పోర్ట్‌ఫోలియో మొత్తం విలువ దాదాపు రూ.3 లక్షలు, ఆమె నెలకు రూ.40,000 SIP చేస్తోంది. ఈ మూడు ఫండ్‌లు వేర్వేరు మార్కెట్ క్యాప్ శ్రేణులను కవర్ చేస్తాయి, ఇది పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యాన్ని అందిస్తుంది. ఆ యువతి ఎంచుకున్న ఫ్లెక్సిక్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్‌లు పర్ఫెక్ట్. అయితే క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్‌ను మూసివేసి, బదులుగా నిప్పాన్ ఇండియా మల్టీక్యాప్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే బాగుంటుంది. మీరు కూడా 15 ఏళ్లలో రూ.5 కోట్ల నిధి పొందాలంటే.. పైన చెప్పిన ఉదాహరణ ప్రకారం ప్రతి నెలా రూ.40 వేలు పైన పేర్కొన్న పోర్ట్‌ఫోలియోల్లో పెట్టుబడి పెడితే మీ టార్గెట్‌ను రీచ్‌ కావొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి