AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger: కేవలం రూ.1 లక్ష పెట్టుబడి 52 లక్షలుగా మారింది.. అదృష్టం అంటే ఇదేనేమో..!

Multibagger: విజయ్ కేడియా ఈ రెండు స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం చాలా మంది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. రెండూ బలమైన లాభాలు, ఆర్డర్ బుక్‌లతో ఉన్నాయి. కానీ రిస్క్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్టాక్‌లలో ఒకటి గత ఐదు సంవత్సరాలలో పెట్టుబడిదారుల..

Multibagger: కేవలం రూ.1 లక్ష పెట్టుబడి 52 లక్షలుగా మారింది.. అదృష్టం అంటే ఇదేనేమో..!
Multibagger
Subhash Goud
|

Updated on: Jan 20, 2026 | 4:48 PM

Share

Multibagger: ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా తన పోర్ట్‌ఫోలియోలో రెండు కొత్త స్టాక్‌లను యాడ్ చేసుకున్నారు. 2025 డిసెంబర్ త్రైమాసిక ఫైలింగ్‌ల ప్రకారం.. ఆయన పోర్ట్‌ఫోలియో విలువ రూ.1,133 కోట్లకు పైగా ఉంది. మొత్తం 17 స్టాక్‌లు ఉన్నాయి. పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్, అద్వైత్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ లిమిటెడ్ లో కేడియా కొత్తగా షేర్లు కొనుగోలు చేశారు. ఈ రెండు కంపెనీలకు గత 5 సంవత్సరాల్లో లాభాలు బాగా పెరిగాయి. ప్రస్తుతం రెండూ చాలా తక్కువ ధర వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

ముఖ్యంగా ఈ స్టాక్‌లలో ఒకటి గత ఐదు సంవత్సరాలలో పెట్టుబడిదారుల రూ.1 లక్షను రూ.52 లక్షలుగా మార్చడం ద్వారా సంచలనం సృష్టించింది. విజయ్ కేడియా తన స్మైల్ పెట్టుబడి వ్యూహానికి ప్రసిద్ధి చెందారు. ఈ ప్లాన్‌ కింద అతను పరిమాణంలో చిన్నవి. ప్రతిష్టాత్మకమైనవి. అలాగే అనుభవజ్ఞులైన నిర్వహణతో నడిచేవి. గణనీయమైన మార్కెట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నవి. బలమైన లాభాలను ఆర్జిస్తున్న కంపెనీలలో పెట్టుబడి పెడతారు. డిసెంబర్ త్రైమాసికంలో అతను వాటాలను కొనుగోలు చేసిన రెండు కంపెనీలు ఈ ఫ్రేమ్‌లో సరిపోతాయి. ఇవి పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, అద్వైత్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ లిమిటెడ్.

Success Story: ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కేవలం రూ.3 వేల పెట్టుబడితో వ్యాపారం.. నేడు రూ.6 లక్షల సంపాదన

పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ 1949లో స్థాపించారు. డ్యామ్‌లు, బ్రిడ్జ్‌లు, టన్నెల్స్, రోడ్లు, ఇరిగేషన్, వాటర్ సప్లై, అర్బన్ ఇన్‌ఫ్రా వంటి హెవీ సివిల్ ఇంజినీరింగ్ పనులు చేస్తుంది. ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.2,960 కోట్లుగా ఉంది. 2023 మార్చి నుంచి 2024 జూన్ వరకు కేడియాకు ఇందులో వాటా ఉంది. తర్వాత స్టేక్ 1 శాతం కంటే తక్కువకు తగ్గింది. ఇప్పుడు మళ్లీ 2025 డిసెంబర్ లో 1.01 శాతా వాటా (రూ.30 కోట్ల విలువ) కొనుగోలు చేశారు. గతంలో రూ.15 వద్ద కొని రూ.60 వద్ద అమ్మి 4 రెట్లు లాభం పొందారు. ఇప్పుడు మళ్లీ కొనడం ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

Sunday: ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!

ఆర్థికపరంగా చూస్తే FY20 నుంచి FY25 వరకు ఆదాయం 14 శాతం CAGRతో పెరిగింది. రూ. 2,617 కోట్ల నుంచి రూ.5,093 కోట్లకు చేరింది. FY26 తొలి ఆరు నెలల్లో రూ.2,441 కోట్లుగా ఉంది. EBITDA 32 శాతం CAGRతో పెరిగింది. నికర లాభం 87 శాతం CAGRతో టర్న్‌అరౌండ్ చూపించింది. FY26 తొలి అర్ధభాగంలో రూ.154 కోట్ల లాభం నమోదు చేసింది. షేర్ ధర 2021లో రూ. 11 ఉండగా, ఇప్పుడు రూ.30 వద్ద ఉంది. అల్ టైమ్ హై రూ. 717 నుంచి 96 శాతం డిస్కౌంట్‌లో ఉంది. 52 వారాల గరిష్ట స్థాయి రూ.52 నుంచి 42 శాతం తక్కువగా ఉంది.

ఇక అద్వైత్ ఎనర్జీ ట్రాన్సిషన్స్ లిమిటెడ్ 2009లో స్థాపించారు. పవర్ ట్రాన్స్‌మిషన్, సబ్‌స్టేషన్స్, టెలికాం ఇన్‌ఫ్రాలో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తుంది. 2023 నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, సోలార్‌లోకి విస్తరించింది. మార్కెట్ క్యాప్ రూ.1,486 కోట్లు. కేడియా గారు తన కంపెనీ ద్వారా 1.1 శాతం స్టేక్ (రూ.17 కోట్ల విలువ) కొన్నారు. ఆర్థికపరంగా చూస్తే ఆదాయం 55 శాతం CAGR తో పెరిగింది. FY20 రూ. 45 కోట్ల నుంచి FY25 రూ. 399 కోట్లకు చేరింది. FY26 తొలి 6 నెలల్లో రూ. 275 కోట్లుగా ఉంది. EBITDA 67 శాతం CAGRతో, నికర లాభం 131 శాతం CAGRతో పెరిగాయి. FY26 తొలి అర్ధబాగంలో రూ.20 కోట్ల లాభం నమోదు చేసింది.

Sunday: ఆదివారం సెలవు రద్దు.. ఆ రోజు తెరిచే ఉంటుంది? కీలక నిర్ణయం..!

షేర్ ధర 2021లో రూ. 26 నుంచి ఇప్పుడు రూ. 1,359 కి చేరింది. ఏకంగా 5,127 శాతం ర్యాలీ చేసింది. ఐదేళ్ల కాలంలో 1 లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి ఉంటే, ఇప్పుడు రూ. 52 లక్షలు అయ్యేవి. అయితే విజయ్ కేడియా ఈ రెండు స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం చాలా మంది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. రెండూ బలమైన లాభాలు, ఆర్డర్ బుక్‌లతో ఉన్నాయి. కానీ రిస్క్‌లు కూడా ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అదృష్టం అంటే ఇదేనేమో.. 1 లక్ష రూపాయలు ఇప్పుడు రూ 52 లక్షలు
అదృష్టం అంటే ఇదేనేమో.. 1 లక్ష రూపాయలు ఇప్పుడు రూ 52 లక్షలు
కాంట్రవర్శీకి రెహమాన్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టేసినట్టేనా ??
కాంట్రవర్శీకి రెహమాన్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టేసినట్టేనా ??
ట్రిపుల్‌ ఆర్‌ హీరోలతో గురూజీ.. ప్లానింగ్‌ పెద్దదే
ట్రిపుల్‌ ఆర్‌ హీరోలతో గురూజీ.. ప్లానింగ్‌ పెద్దదే
తమ్ముడిని మించిన అన్న.. అదరహో అనిపిస్తున్న వరప్రసాద్ రికార్డులు
తమ్ముడిని మించిన అన్న.. అదరహో అనిపిస్తున్న వరప్రసాద్ రికార్డులు
చలాన్ వసూళ్లపై ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక అదేశాలు!
చలాన్ వసూళ్లపై ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక అదేశాలు!
శ్రీలీల భారీ ప్లానింగ్‌.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా
శ్రీలీల భారీ ప్లానింగ్‌.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా
కటౌట్‌తో పనేంటి ?? కంటెంట్ ఉంటే చాలు.. హిట్టు పక్కా
కటౌట్‌తో పనేంటి ?? కంటెంట్ ఉంటే చాలు.. హిట్టు పక్కా
వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్‌ నెక్స్ట్ సినిమా
వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్‌ నెక్స్ట్ సినిమా
ఈ హీరోయిన్ గోల్డ్ స్మగ్లర్.. ఆమె తండ్రేమో ఏకంగా అమ్మాయిలతో అలా..
ఈ హీరోయిన్ గోల్డ్ స్మగ్లర్.. ఆమె తండ్రేమో ఏకంగా అమ్మాయిలతో అలా..
వంద కోట్ల క్లబ్ లో.. సత్తా చాటుతున్న సీనియర్ హీరోలు
వంద కోట్ల క్లబ్ లో.. సత్తా చాటుతున్న సీనియర్ హీరోలు