AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Train Mileage: రైలు ఒక కిలోమీటర్ వెళ్లాంటే ఎంత డీజిల్‌ అవసరమో తెలుసా? లోకో పైలట్‌ చెప్పింది ఇదే!

Train Mileage: రైలు వేగంలో ఉండగాయాక్సిలరేటర్‌ను, బ్రేక్‌లను తరచూ వాడాల్సి ఉంటుంది. దీంతో ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు ప్రతిస్టేషన్‌లో ఆగకుండా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అందుకే ఎక్కువ మైలేజ్‌ ఇస్తాయి. బోగీల సంఖ్య మైలేజీని..

Train Mileage: రైలు ఒక కిలోమీటర్ వెళ్లాంటే ఎంత డీజిల్‌ అవసరమో తెలుసా? లోకో పైలట్‌ చెప్పింది ఇదే!
Subhash Goud
|

Updated on: Sep 15, 2025 | 12:24 PM

Share

Train Mileage: మనమందరం మైలేజీని బట్టి కొత్త వాహనాలను ఎంచుకుంటాం. కారు అయినా, బైక్ అయినా ముందుగా ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసుకుంటాము. మనం తరచుగా ప్రయాణించే బస్సు, విమానం, రైలు ఇలా అన్నింటికి రకరకాల మైలేజీ ఉంటుంది. మీలో చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. మరి రైలు ఎంత మైలేజీ ఎంత ఇస్తుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? రైళ్ల గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఓ వీడియోలో రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు రైలు మైలేజీ ఎంత ఇస్తుందని లోకో పైలట్‌ను అడుగుతాడు. ఆ పైలట్‌ సురదాగా ఒక కిలోమీటర్ వెళ్లాలంటే 8 లీటర్ల ఇంధనం అవసరని చెబుతాడు. దీని ప్రకారం ఏ రైలు ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: UPI Rule Change: యూపీఐ లావాదేవీల్లో నేటి నుండి పెద్ద మార్పు.. రూ.10 లక్షల వరకు లావాదేవీలు!

ఇవి కూడా చదవండి

రైలు మైలేజీని అనేక అంశాలు నిర్ధారిస్తాయి. ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ ఇలా కేటగిరీని బట్టి ట్రైన్‌ మైలేజీ మారుతుంది. అలాగే బోగీల సంఖ్య, ఇంధన సామర్థ్యాన్ని బట్టి డీజిల్‌ ఖర్చవుతుంది. గూడ్స్‌ రైలు అయితే అది మోసే బరువు సైతం మైలేజీని ప్రభావితం చేస్తుంది. రైలు ప్రయాణిస్తున్న ప్రాంతాన్ని బట్టి కూడా మైలేజీ మారుతుంది. ఆగాల్సిన స్టేషన్లు, దూరాన్ని సైతం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలా అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటే మైలేజీ ఒక విధంగా ఉండదు.

ఇది కూడా చదవండి: ITR Deadline Extension: ఐటీఆర్‌ గడువు సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించారా?

12 బోగీలతో కూడిన ప్యాసింజర్‌ రైలుఏ 6 నుంచి8 లీటర్ల డీజిల్‌తో ఒక కిలోమీటర్‌ దూరం వరకు వెళ్లగలదని నివేదికలు చెబుతున్నాయి. ఒక కిలోమీటర్‌ దూరాన్ని కవర్‌ చేయడానికి 24 కోచ్‌లతో కూడిన సూపర్‌ఫాస్ట్‌ రైలు సైతం 6 లీటర్ల డీజిల్‌ను వినియోగించుకుంటుంది. మరోవైపు 12 బోగీతో ఉండే ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ 4.5 లీటర్ల ఇంధనంతో 1 కిలోమీటర్‌ వరకు వెళ్లగలదు.

ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. భారతీయ రైల్వేలో ఒక లీటర్‌ డీజిల్‌తో ఒక కిలోమీటర్‌ మైలేజీ ఇచ్చే రైలు ఏదీ లేదు.

బోగీల సంఖ్య మైలేజీని ప్రభావితం చేసే అంశాల్లో అతిముఖ్యమైనది. తక్కువ కోచ్‌లు ఉంటే ఇంజిన్‌పై తక్కువ లోడ్‌ పడుతుంది. ఫలితంగా ఎక్కువ మైలేజీ ఇస్తుంది. మరోవైపు ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌లతో పోలిస్తే ప్యాసెంజర్‌ ట్రైన్లు ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేసుకుంటాయి. ఇవి తరచూ ఆగడమే అందుకు కారణం. దీని వల్ల ఎక్కువ వేగం అందుకోవడానికి అవకాశం ఉండదు.

View this post on Instagram

A post shared by Thebois03☠️ (@thebois03)

రైలు వేగంలో ఉండగాయాక్సిలరేటర్‌ను, బ్రేక్‌లను తరచూ వాడాల్సి ఉంటుంది. దీంతో ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లు ప్రతిస్టేషన్‌లో ఆగకుండా ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. అందుకే ఎక్కువ మైలేజ్‌ ఇస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి