AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: రూ.750 టికెట్‌ రూ.380కే.. వందే భారత్ రైల్లో బంపర్ ఆఫర్.. కట్ చేస్తే

Vande Bharat: వందే భారత్ రైల్లో బంపర్ ఆఫర్.. సగం ధరకే సీట్ల కేటాయిస్తున్న టీటీఈపై వేటు పడింది. అక్కడ ప్రయాణికులు టీటీఈ చేసిన తతంగాన్ని రైలులో ఉన్న ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంకే ముందు అధికారులు చర్యలు చేపట్టారు..

Vande Bharat: రూ.750 టికెట్‌ రూ.380కే.. వందే భారత్ రైల్లో బంపర్ ఆఫర్.. కట్ చేస్తే
Vande Bharat Tte
Subhash Goud
|

Updated on: May 13, 2026 | 6:26 PM

Share

Vande Bharat: భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రైలుగా పేరుగాంచిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు భోజనం బాగోలేదని, మరికొన్నిసార్లు సేవలపై ఫిర్యాదులతో చర్చల్లో ఉండే ఈ రైలు, తాజాగా ఒక టిటిఈ (TTE) చేసిన పనికి వార్తల్లోకెక్కింది. ప్రయాణికుల నుండి సగం ధరకే డబ్బులు తీసుకుని సీట్లు కేటాయిస్తున్న టిటిఈని రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్‌ ధర.. రూ.55 వేలు పెరిగిన వెండి.. ప్రస్తుతం ఎంతంటే..!

అసలేం జరిగింది?

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ (గతంలో ట్విట్టర్)లో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పాట్నా నుండి లక్నో (గోమతీనగర్) వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 22345) లో ఒక టిటిఈ ప్రయాణికులతో బేరమాడుతున్నట్లు కనిపిస్తుంది. ముగ్గురు ప్రయాణికులు వారణాసి వరకు వెళ్లాలని కోరగా, అధికారిక టికెట్ ధర సుమారు రూ. 750 ఉండగా, సదరు టిటిఈ మాత్రం ఒక్కొక్కరికి రూ. 380 ఇస్తే సీటు అడ్జస్ట్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు.

సోషల్ మీడియాలో వైరల్.. రైల్వే శాఖ స్పందన

ఈ వ్యవహారాన్ని ఒక ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “వందే భారత్ టికెట్ రూ. 750 అయితే, టిటిఈ గారు రూ. 380 కే మేనేజ్ చేస్తున్నారు” అంటూ వ్యంగ్యంగా రాశారు. ఈ వీడియో రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే చర్యలు చేపట్టారు. తూర్పు మధ్య రైల్వేలోని దానాపూర్ డివిజన్ డీఆర్ఎం స్పందిస్తూ.. ఆ ఉద్యోగిపై తీవ్ర చర్యలు తీసుకున్నామని, తక్షణమే విధుల్లో నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ప్రభుత్వ దోపిడీ నుండి టిటిఈ మనల్ని కాపాడాలని చూస్తుంటే, ప్రజలు మాత్రం ఆయనకే పంగనామాలు పెడుతున్నారు” అంటూ కొందరు జోకులు పేలుస్తుంటే, మరికొందరు ఇలాంటి అవినీతి వల్ల రైల్వే శాఖకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక యూజర్ స్పందిస్తూ.. గతంలో తన వద్ద కూడా ఇలాగే అదనపు డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు చేశారు.

ఇది కూడా చదవండి: Success Story: ఇంటర్‌ ఫెయిల్.. 2 లక్షల ఉద్యోగానికి రాజీనామా.. నేడు 250 కోట్ల వ్యాపారానికి బాస్..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us