AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: ఇంటర్‌ ఫెయిల్.. 2 లక్షల ఉద్యోగానికి రాజీనామా.. నేడు 250 కోట్ల వ్యాపారానికి బాస్..!

Success Story: 2023లో 'అజ్మేరా ట్రెండ్స్' పేరుతో ఫ్రాంచైజీ మోడల్‌ను కూడా ప్రారంభించారు. ఒకప్పుడు స్కూలు చదువు మధ్యలోనే ఆపేసిన అజయ్, నేడు ఫోర్బ్స్ (Forbes) వంటి అంతర్జాతీయ మ్యాగజైన్లలో చోటు సంపాదించుకున్నారు. డిగ్రీల కంటే పట్టుదలే ముఖ్యమని ఆయన నిరూపించారు..

Success Story: ఇంటర్‌ ఫెయిల్.. 2 లక్షల ఉద్యోగానికి రాజీనామా.. నేడు 250 కోట్ల వ్యాపారానికి బాస్..!
Success Story
Subhash Goud
|

Updated on: May 13, 2026 | 4:15 PM

Share

Success Story:  సుమారు 15 ఏళ్ల క్రితం నెలకి 2 లక్షల రూపాయల జీతం అంటే అది ఒక కల. అంత పెద్ద మొత్తాన్ని వదులుకోవడానికి ఎవరూ సాహసించరు. కానీ సూరత్‌లోని ఒక కార్యాలయంలో కూర్చున్న అజయ్ అజ్మేరా ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ఒకవైపు భద్రత ఉన్న భారీ జీతం, మరోవైపు రిస్క్ ఉన్న వ్యాపారం. కానీ, తన కల కోసం ఆ పక్కా ఉద్యోగాన్ని కాలదన్నారు. చేతిలో పెద్దగా పెట్టుబడి లేదు. కానీ 11వ తరగతి ఫెయిల్ అయ్యాక రోడ్ల మీద, బట్టల దుకాణాల్లో పనిచేస్తూ సంపాదించిన అనుభవం మాత్రం ఉంది. ఆ అనుభవమే నేడు ఆయనను 250 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి రాజును చేసింది.

గ్రామం నుండి సూరత్ వరకు..

అజయ్ ప్రయాణం 1973లో రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో మొదలైంది. ఇంటి ఆర్థిక పరిస్థితుల వల్ల 11వ తరగతితోనే చదువు ఆగిపోయింది. పని వెతుక్కుంటూ 1992లో దేశ వస్త్ర రాజధాని సూరత్‌కు చేరుకున్నారు. అక్కడ ఎవరి పరిచయం లేకపోయినా, నెలకు కేవలం 1200 రూపాయల జీతంతో బట్టల దుకాణంలో పనికి చేరారు. బట్టలు మోయడం, సరుకును సర్దడం వంటి కింది స్థాయి పనుల నుండి వ్యాపార మెళకువలను నేర్చుకున్నారు. సుమారు 20 ఏళ్ల కఠిన శ్రమ తర్వాత అదే రంగంలో నెలకు 2 లక్షల జీతం పొందే స్థాయికి ఎదిగారు. తర్వాత ఈ ఉద్యోగాన్ని వదలుకుని మరింత ముందుకు సాగాలనుకున్నాడు.

చిన్న వ్యాపారుల బాధను గుర్తించి..

పెద్ద పెద్ద హోల్‌సేల్ వ్యాపారుల మధ్య చిన్న వ్యాపారులు, ముఖ్యంగా ఇంట్లో ఉండి పని చేయాలనుకునే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అజయ్ గమనించారు. దళారుల వల్ల చిన్న వ్యాపారులకు లాభాలు మిగలడం లేదని గ్రహించిన ఆయన, 2011లో ‘అజ్మేరా ఫ్యాషన్’ (Ajmera Fashion) సంస్థను స్థాపించారు. కేవలం 25,000 రూపాయల పెట్టుబడితో ఎవరైనా సొంతంగా బట్టల వ్యాపారం ప్రారంభించేలా ఒక కొత్త మోడల్‌ను రూపొందించారు.

టెక్నాలజీతో ముందడుగు

ఏ దళారీ లేకుండా నేరుగా రిటైలర్లకు బట్టలు అందించిన మొదటి తయారీదారుగా ఆయన నిలిచారు. 2013లోనే యూట్యూబ్ ద్వారా వ్యాపార మెళకువలను నేర్పిస్తూ వేలాది మంది మహిళలు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించారు.

ప్రపంచవ్యాప్త గుర్తింపు

నేడు అజ్మేరా ఫ్యాషన్ నెలకు దాదాపు 10 లక్షల దుస్తులను తయారు చేస్తోంది. దేశవ్యాప్తంగా 50,000 మందికి పైగా వ్యాపారులు వీరితో కలిసి పనిచేస్తున్నారు. వీరి బ్రాండ్ కేవలం భారత్‌లోనే కాకుండా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, యూఏఈ సహా 30కి పైగా దేశాలకు ఎగుమతి అవుతోంది.

2023లో ‘అజ్మేరా ట్రెండ్స్’ పేరుతో ఫ్రాంచైజీ మోడల్‌ను కూడా ప్రారంభించారు. ఒకప్పుడు స్కూలు చదువు మధ్యలోనే ఆపేసిన అజయ్, నేడు ఫోర్బ్స్ (Forbes) వంటి అంతర్జాతీయ మ్యాగజైన్లలో చోటు సంపాదించుకున్నారు. డిగ్రీల కంటే పట్టుదలే ముఖ్యమని ఆయన నిరూపించారు.

Follow Us