AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్‌ ధర.. రూ.55 వేలు పెరిగిన వెండి.. ప్రస్తుతం ఎంతంటే..!

Silver Price: ముఖ్యంగా ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఇరాన్ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ప్రత్యక్ష ఘర్షణలు, హార్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు రవాణాకు ఆటంకాలు తీవ్రమవుతున్నాయని మార్కెట్‌ నిపుణులు..

Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్‌ ధర.. రూ.55 వేలు పెరిగిన వెండి.. ప్రస్తుతం ఎంతంటే..!
Silver Rates
Subhash Goud
|

Updated on: May 13, 2026 | 2:37 PM

Share

Silver Price: వరుసగా రెండు రోజుల కిందట బంగారం కొనవద్దని ప్రధాని మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు MCXలో బంగారం ధరలు 12,000లకుపైగా పెరగ్గా, వెండి ధర నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే ఒక్క రోజే 20,000లకుపైగా ఎగబాకింది. మే 13, 2026 నాటి వెండి ధర కిలోగ్రాముకు 3 లక్షల రూపాయలు దాటింది.

ఇది కూడా చదవండి: School Holidays: అక్కడ జూన్‌ 30 వరకు పాఠశాలలకు సెలవులు.. జూలై 1న ఓపెన్‌..!

ఈ ఉదయం మార్కెట్ తెరుచుకున్న వెంటనే, బంగారం, వెండి అనే రెండు లోహాల ధరలు భారీగా పెరిగాయి. అయితే వెండి విషయానికొస్తే కేవలం వారం రోజుల్లో 55 వేల రూపాయలకు వరకు పెరిగింది. ఇదే నెల 5వ తేదీన కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద ఉండగా, ప్రస్తుతం అంటే మే 13వ తేదీన కిలో వెండి ధర రూ.3,10,000 వరకు చేరింది. అంటే కేవలం వారం రోజుల్లోనే భారీగా ఎగబాకిందనే చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర మాత్రం రికార్డు స్థాయిలో ఉంది. ఇక్కడ ఏకంగా రూ.3,30,000 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి ధర రూ.3,100 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఇరాన్ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ప్రత్యక్ష ఘర్షణలు, హార్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు రవాణాకు ఆటంకాలు తీవ్రమవుతున్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం నుంచే జరుగుతుంది. అందుకే ప్రస్తుతం ఏర్పడిన ఉద్రిక్తతలు ముడి చమురు ధరలను ఒక్కసారిగా పెంచేశాయి.

ఇది కూడా చదవండి: Indian Railways: చేతిలో కన్ఫర్మ్ రైలు టికెట్ ఉన్నా.. రూ.2560 జరిమానా.. ప్రయాణికులు చేసే ఈ చిన్న పొరపాటే కారణం..!

ఇది కూడా చదవండి: Fuel Saving Tips: వార్నీ.. ఇన్నాళ్లు ఈ విషయం తెలియకపాయే.. ఆ టైమ్‌లో పెట్రోల్‌ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us