India Post – HDFC: పోస్టాఫీస్‌ కస్టమర్లకు అద్భుత అవకాశం.. ఇకపై గృహ రుణాలు కూడా అందిస్తోంది.. పూర్తివివరాలివే..

పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు మరిన్ని సేవలకు కేంద్రంగా మారబోతోంది. పోస్ట్ ఆఫీస్ అంటేత్తరాలు బట్వాడా చేస్తుదని అనుకునే స్థాయి నుంచి పొదుపు పథకాలకు..

India Post - HDFC: పోస్టాఫీస్‌ కస్టమర్లకు అద్భుత అవకాశం.. ఇకపై గృహ రుణాలు కూడా అందిస్తోంది.. పూర్తివివరాలివే..
India Post
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 26, 2021 | 4:23 PM

India Post – HDFC Home Loan: పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు మరిన్ని సేవలకు కేంద్రంగా మారబోతోంది. పోస్ట్ ఆఫీస్ అంటేత్తరాలు బట్వాడా చేస్తుదని అనుకునే స్థాయి నుంచి పొదుపు పథకాలకు అడ్రస్‌గా మారింది. మధ్య తరగతి ప్రజలను తాము సంపాదించిన దాంట్లో అంతో ఇంతో పొదుపుచేసి భవిష్యత్తుకోసం దాచుకుంటుంటారు. అందుకోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలపై మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. అధిక ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు పోస్టాఫీసు అందిస్తున్న చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం మార్గంగా భావిస్తుంటారు. అయితే ఇప్పుడు మరో అద్భుతమైన అవకాశాన్ని అందించేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఓ కమర్షల్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకుంది.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)తో HDFC లిమిటెడ్ IPPB సుమారు 47 మిలియన్ల వినియోగదారులకు గృహ రుణాలను అందించడానికి వ్యూహాత్మక కూటమిని ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు హెచ్‌డిఎఫ్‌సి హోమ్ లోన్ ఉత్పత్తులను అందించడానికి ఇండియా పోస్ట్ తన దేశవ్యాప్తంగా 650 బ్రాంచ్‌లతోపాటు 1,36,000 పైగా బ్యాంకింగ్ యాక్సెస్ పాయింట్ల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోనుందని కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం IPPB, HDFC మధ్య అవగాహన ఒప్పందం (MOU) చేసుకున్నాయి.

ఈ భాగస్వామ్యం హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ ఉత్పత్తులను కస్టమర్‌లకు ముఖ్యంగా అన్‌బ్యాంకింగ్  తక్కువ సేవలందించే ప్రాంతాలకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకుందని ఐపీపీబీ తెలిపింది. వీరిలో చాలా మంది ఫైనాన్స్‌కు తక్కువ లేదా యాక్సెస్ లేకుండా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చని పేర్కొంది.

1.90 లక్షల బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడర్ల నుండి హోమ్ లోన్ ఆఫర్లు

బ్యాంకింగ్ సర్వీస్ ప్రొవైడర్లు- పోస్ట్‌మెన్ , గ్రామీణ డాక్ సేవకుల ద్వారా గృహ రుణాలను అందజేస్తుందని IPPB  తెలిపింది. ఒప్పందం ప్రకారం అన్ని గృహ రుణాల కోసం క్రెడిట్, సాంకేతిక, చట్టపరమైన మూల్యాంకనం, ప్రాసెసింగ్, పంపిణీని HDFC లిమిటెడ్ నిర్వహిస్తుంది. అయితే IPPB రుణాన్ని అందించడంలో వారదులగా పని చేస్తారని వెల్లడించింది.

హెచ్‌డిఎఫ్‌సి మేనేజింగ్ డైరెక్టర్ రేణు సూద్ కర్నాడ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దార్శనికతకు అనుగుణంగా తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో ఇళ్లు అందించే దిశగా తాము ముందుకు సాగుతున్నామని అన్నారు.

ప్రారంభం నుండి, IPPB వినూత్నమైన.. విశిష్టమైన బ్యాంకింగ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. వివిధ విభాగాలలో తన వినియోగదారులకు సేవలను అందిస్తోంది. వీటిలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం, వర్చువల్ డెబిట్ కార్డ్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సర్వీస్ Dak Pay UPI యాప్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: Dramatic Video: ఎవరో వస్తారని.. ఎదో చేస్తారని ఎదురుచూడలేదు.. ప్రాణాలు పణంగా పెట్టి..