AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto News: ఆటో పరిశ్రమకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా భారత్‌..!

Auto News: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం ఆటో విడిభాగాల దిగుమతి సుంకం ప్రణాళిక ప్రభావాన్ని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ అంశంపై గత వారం న్యూఢిల్లీలో రెండు దేశాల అధికారులు సమావేశమయ్యారు. అక్కడ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి..

Auto News: ఆటో పరిశ్రమకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా భారత్‌..!
Subhash Goud
|

Updated on: Apr 01, 2025 | 9:33 PM

Share

భారతదేశం – అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకోవచ్చు. అమెరికన్ ఆటో విడిభాగాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం గురించి భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం వీటిపై 10 శాతం నుండి 15 శాతం వరకు కస్టమ్స్ సుంకం విధిస్తున్నారు. దీని సగటు రేటు 11 శాతం. అమెరికా ఆటో విడిభాగాల ధర ఎక్కువగా ఉండటం వల్ల వాటిపై సుంకాలను తొలగించినప్పటికీ, భారత మార్కెట్లో దేశీయ పరిశ్రమకు ఎటువంటి హాని జరగదని ప్రభుత్వం విశ్వసిస్తోంది.

వాణిజ్య ఒప్పందంపై చర్చలు:

ఇటీవల భారతదేశం – అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) గురించి చర్చ జరిగింది. దీనిలో ఆటోమొబైల్స్ కంటే ఆటో విడిభాగాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక, ప్రభుత్వం అధికారులు తెలిపిన ప్రకారం.. భారతదేశం అమెరికా నుండి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోని ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే విషయాన్ని కూడా పరిశీలిస్తోంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈ అడుగు వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Underwater Train: నీటి అడుగున రైలు మార్గం.. ముంబై టూ దుబాయ్‌.. కేవలం రెండు గంటల్లోనే..!

ఇవి కూడా చదవండి

భారతదేశం ప్రతి సంవత్సరం దాదాపు 7 బిలియన్ డాలర్ల విలువైన ఆటో విడిభాగాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది. ఇది మొత్తం ఎగుమతుల్లో మూడో వంతు. అదే సమయంలో భారతదేశం అమెరికా నుండి $1.5 బిలియన్ల విలువైన ఆటో విడిభాగాలను దిగుమతి చేసుకుంటుంది. ఇటువంటి పరిస్థితిలో భారతదేశం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే, అది వాణిజ్య సంబంధాలను మరింత సమతుల్యం చేయగలదు.

అమెరికా టారిఫ్ ప్లాన్.. భారత్‌ వ్యూహం:

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం ఆటో విడిభాగాల దిగుమతి సుంకం ప్రణాళిక ప్రభావాన్ని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ అంశంపై గత వారం న్యూఢిల్లీలో రెండు దేశాల అధికారులు సమావేశమయ్యారు. అక్కడ వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మరింత వ్యూహంపై అంగీకారం కుదిరింది. దీని కింద రాబోయే వారాల్లో ఒక రౌండ్ వర్చువల్ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదటి దశను 2025 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

భారతీయ ఆటో విడిభాగాల పరిశ్రమ ప్రస్తుత స్థితి

భారత ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీదారుల సంఘం (ACMA) ప్రకారం.. భారతదేశ ఆటో కాంపోనెంట్ పరిశ్రమ 2023-24 నాటికి 9.8 శాతం వృద్ధి చెంది $74.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో దేశీయ సరఫరా $62.4 బిలియన్లు కాగా, ఎలక్ట్రిక్ వాహన (EV) రంగం 6 శాతం వాటాను అందించింది. అమెరికన్ ఆటో విడిభాగాలపై సుంకం తొలగించినప్పటికీ, భారత పరిశ్రమ ఇప్పటికీ పోటీలో బలంగా ఉంటుందని నిపుణులు విశ్వసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Ratan Tata: జంతువులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా.. ఆయన సంపదలో ఎక్కువ భాగం విరాళాలే..

ఇది కూడా చదవండి: Medicine Price Hike: యాంటీబయాటిక్స్ నుండి డయాబెటిస్ మాత్రల వరకు.. 900 కంటే ఎక్కువ మందుల ధరలు పెంపు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి