ITR Rules : డిసెంబర్ 31లోగా ఈ పని పూర్తి చేసుకోండి.. లేకపోతే భారీ జరిమానా.. నిబంధనలు తెలుసుకోండి
ఆదాయపు పన్ను విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నోటీసులతో పాటు భారీ జరిమానా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను..
ఆదాయపు పన్ను విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నోటీసులతో పాటు భారీ జరిమానా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను పన్ను శాఖ నియమ నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు కూడా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే ఈ సమాచారం మీ కోసమే. మీ ఆదాయం 2.5 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే మీరు తప్పనిసరిగా ఆదాయపు పన్ను చెల్లించాలి. 5 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న పౌరులు ఐటీఆర్ ఫైల్ చేయడం తప్పనిసరి. ఈ ఏడాది జూలై 30 లోగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉండేది దానిని పొడిగించారు. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఈ గడువులోపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందుకునే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2022.
30 జూలై 2022 వరకు ITR ఫైల్ చేయలేని పన్ను చెల్లింపుదారులు, ఆగస్ట్ 1 నుండి డిసెంబర్ 31 వరకు జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ వారికి అవకాశం కల్పించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139 (5) ప్రకారం.. పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ అప్‌డేట్, ఆలస్యమైన ఐటీఆర్ ఫైల్ చేసే సౌలభ్యం ఇచ్చింది. ఈ గడువులోపు అప్‌డేట్ చేయబడిన ఐటీఆర్‌ని ఫైల్ చేయలేని పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను నోటీసులను ఎదుర్కొవచ్చు. లేదా భారీ జరిమానాలు కూడా చెల్లించవలసి ఉంటుంది.
పెనాల్టీ నియమాలు:
ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234F కింద సూచించిన జరిమానా పన్ను చెల్లింపుదారుల నుండి ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేయబడుతుంది. ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేసిన చిన్న పన్ను చెల్లింపుదారులు అంటే 2.5 లక్షల నుంచి 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి రూ.1,000 జరిమానా, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు రూ.5 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ ఈనెలాఖరులోగా ఫైల్ చేయకపోతే భారీ జరిమానాతో పాటు ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకుంటారు.
జరిమానా చెల్లింపు విధానం:
మీరు ఆలస్యమైన ఐటీఆర్ దాఖలు చేసేముందు ఆలస్యమైన ఫైలింగ్ రుసుమును చెల్లించాలి. ఆలస్యమైన ఐటీఆర్‌ని దాఖలు చేసినందుకు ఆలస్య రుసుము/పెనాల్టీ చలాన్ నంబర్ 280ని ఉపయోగించి చెల్లంచాలి. పన్ను చెల్లింపుదారు ఆలస్యమైన పెనాల్టీని ఎన్‌ఎస్‌డీఎల్ వెబ్‌సైట్‌లో లేదా బ్యాంక్ ద్వారా చెల్లించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి