AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Alert: ముగియనున్న గడువు.. ITR-U అంటే ఏమిటి? దీని ప్రయోజనం ఏమిటి?

2021 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2021-22) అప్‌డేట్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR-U) ఫైల్ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2024. అప్‌డేట్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ కింద గతంలో దాఖలు చేసిన రిటర్న్‌లోని లోపాలను సరిదిద్దవచ్చు. సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(8A) ప్రకారం..

Income Tax Alert: ముగియనున్న గడువు.. ITR-U అంటే ఏమిటి? దీని ప్రయోజనం ఏమిటి?
Income Tax
Subhash Goud
|

Updated on: Mar 22, 2024 | 11:15 AM

Share

2021 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2021-22) అప్‌డేట్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR-U) ఫైల్ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2024. అప్‌డేట్ చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ కింద గతంలో దాఖలు చేసిన రిటర్న్‌లోని లోపాలను సరిదిద్దవచ్చు. సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(8A) ప్రకారం.. మీ ITRని సవరించడానికి మీకు అనుమతి ఉంది. మీరు లోపాలను సరిదిద్దకుంటే, పన్ను అధికార యంత్రాంగం దాని గురించి తెలుసుకుంటే మీరు బకాయి ఉన్న పన్నులో 200% వరకు జరిమానా విధించబడవచ్చు.

ఢిల్లీకి చెందిన సీఏ సంస్థ వ్యవస్థాపకుడు రవి రంజన్ మాట్లాడుతూ.. 2017-18 అసెస్‌మెంట్ సంవత్సరం నుండి కొత్త సెక్షన్ 270A అమలు అవుతోందని, దాని ప్రకారం ఒక వ్యక్తి తన ఆదాయాన్ని దాచినట్లయితే అతనిపై 50% లేదా 200% పెనాల్టీ విధించవచ్చని చెప్పారు. అయితే సెక్షన్ 271 ప్రకారం, 2016-17 అసెస్‌మెంట్ సంవత్సరం వరకు బకాయి ఉన్న పన్నుపై 300% వరకు పెనాల్టీ విధించవచ్చు.

అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు ఎంత?

ఇవి కూడా చదవండి

సంబంధిత ఆస్తి సంవత్సరం ముగిసిన తర్వాత పన్ను చెల్లింపుదారులు సవరించిన రిటర్న్‌ను ఫైల్ చేయడానికి 24 నెలల సమయం ఉంటుంది. అయితే దీని కోసం ఇతర మార్గదర్శకాలను కూడా రూపొందించారు. ఒకవేళ పన్ను చెల్లింపుదారు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గడువును కోల్పోయినట్లయితే, అతను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి మార్చి 31 వరకు వేచి ఉండాలి.

ITR-Uని ఎవరు ఫైల్ చేయాలి?

సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరానికి రిటర్న్‌ను దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్ పత్రాన్ని అప్‌డేట్ చేసిన రిటర్న్‌తో పాటు ఫైల్ చేయవచ్చు.

ITR-U ఫైల్ చేయడానికి అదనపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందా?

అదనపు పన్ను చెల్లించకుండా ITR-U ఫైల్ చేయలేరు. అయితే ఇందులో కూడా చాలా షరతులు వర్తిస్తాయి. అదనపు పన్ను మొత్తం పన్నులో 50% ఉంటుంది. అలాగే అదనంగా సవరించిన రిటర్న్ దాఖలుకు సంబంధించిన వడ్డీని కూడా చెల్లించాలి. అయితే, అప్‌డేట్ చేసిన ITR-U, సవరించిన రిటర్న్ లేదా ఆలస్యమైన రిటర్న్ గడువు తేదీ తర్వాత దాఖలు చేసి సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన తర్వాత ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం తర్వాత దాఖలు చేసినట్లయితే, మొత్తం పన్ను, వడ్డీలో 25% అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ITR-U అంటే ఏమిటి?

ITR-Uని అప్‌డేట్‌ చేసిన ఐటీఆర్‌ అని కూడా పిలుస్తారు. దీని కింద ఎవరైనా తన ఐటీఆర్‌ని సవరించవచ్చు. సెక్షన్ 139(8A) కింద ఐటీ చట్టంలో కొత్త నిబంధన జోడించారు. ఫారమ్ ITR-U అనేది ఈ సెక్షన్ కింద ఒక ఫారమ్. ఇది పన్ను చెల్లింపుదారు తన ఆదాయపు పన్ను రిటర్న్‌ను సవరించడానికి అవకాశాన్ని ఇస్తుంది .

ITR-U వల్ల ప్రయోజనం ఏమిటి?

దీని కింద పన్ను చెల్లింపుదారులకు భారీ సౌకర్యాలు కల్పించారు. ఈ ఫారమ్‌తో, ఏదైనా పన్ను చెల్లింపుదారుడు అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన 2 సంవత్సరాలలోపు రిటర్న్‌ను అప్‌డేట్ చేయవచ్చు. అంటే, మీ పాత ఐటీఆర్‌లో ఏదైనా పొరపాటు ఉంటే లేదా మీరు ఇంతకు ముందు మిస్ అయిన ఏదైనా ఆర్థిక సమాచారాన్ని ఇవ్వాలనుకుంటే, దాన్ని పూరించడం ద్వారా దాన్ని సరిదిద్దవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు