Lassiwala: ఈ లస్సీకి భారీ డిమాండ్.. 9 గంటల్లోనే వెయ్యి లీటర్లు విక్రయం.. క్యూ కడుతున్న జనాలు, విదేశీయులు
సమ్మర్ సీజన్ వచ్చేసింది. చాలా మంది చల్లదనం కోసం వివిధ రకాల పానీయాలు సేవిస్తుంటారు. అలాగే లస్సీని కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. భారతదేశంలో ప్రజలు ఆహారం మరియు పానీయాల కోసం అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటారు. కొందరు పరాటాలు తినేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్తే మరికొందరు టీ తాగేందుకు ఇంటి నుంచి దూరంగా వెళ్తుంటారు. ఈ రోజుల్లో
సమ్మర్ సీజన్ వచ్చేసింది. చాలా మంది చల్లదనం కోసం వివిధ రకాల పానీయాలు సేవిస్తుంటారు. అలాగే లస్సీని కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. భారతదేశంలో ప్రజలు ఆహారం మరియు పానీయాల కోసం అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంటారు. కొందరు పరాటాలు తినేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్తే మరికొందరు టీ తాగేందుకు ఇంటి నుంచి దూరంగా వెళ్తుంటారు. ఈ రోజుల్లో పింక్ సిటీ జైపూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ లస్సీ విక్రేతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ లస్సీ వ్యాపారి వద్దకు విదేశాల నుంచి ప్రజలు లస్సీ తాగేందుకు వస్తుంటారని చెబుతున్నారు. ఈ లస్సీ అమ్మేవారి దుకాణం తొమ్మిది గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. దీని తర్వాత అతని దుకాణంలో లస్సీ అయిపోతుంటుంది. అతడిని ఆదర్శంగా తీసుకుని చాలా మంది లస్సీ దుకాణాలు తెరిచారు. కానీ వారితో ఎవరూ పోటీ పడలేకపోయారు. ఇతర షాపుల లస్సీలపై జనాలు లేక వెలవెలబోతుంటాయి. ఈ దుకాణం యజమాను షట్టర్‌లు మూసివేసి ఇంటికి వెళ్తారు.
ప్రతిరోజూ వెయ్యి లీటర్ల లస్సీ అమ్మకం:
జైపూర్‌లో ఉన్న ఈ షాప్ పేరు లస్సీవాలా. దుకాణం షట్టర్ తెరవగానే ఇక్కడ జనం గుమిగూడుతుంటారు. ఈ షాపులో తొమ్మిది గంటల్లో వెయ్యి లీటర్ల లస్సీ విక్రయిస్తారు. సినీ నటులు సైతం జైపూర్‌కి వచ్చినప్పుడల్లా లస్సీ తాగేందుకు కచ్చితంగా ఈ షాప్‌కే వస్తుంటారు. దీని కారణంగా ఈ ప్రాంత ప్రజలు సినిమా నటులు కనిపిస్తారేమోననే ఆశతో ఇక్కడకు వస్తారు. లస్సీవాలాకు చాలా మంది విదేశీ కస్టమర్లు కూడా ఉన్నారు. వారు విదేశాల నుండి జైపూర్ వచ్చినప్పుడల్లా లస్సీ తాగడానికి ఇక్కడికి వస్తారు.
View this post on Instagram
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి