LIC Jeevan anand policy: రోజుకు రూ.45 పొదుపు చేస్తే రూ.25 లక్షలు మీవే..ఈ ఎల్ఐసీ పాలసీతో ఎంతో ప్రయోజనం

జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి, భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా జీవించడానికి ప్రణాళిక అనేది చాలా అవసరం. వచ్చిన ఆదాయంలో అవసరాలకు పోను మిగిలిన దాన్ని పొదుపు చేసుకోవడం దానిలో ప్రధాన అంశం. ఈ పొదుపును పెట్టుబడిగా మార్చుకుంటే దీర్ఘకాలంలో రాబడిని పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. వయసులో ఉండగా ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటూ వచ్చిన జీతంతో హాయిగా గడిపేయవచ్చు.

LIC Jeevan anand policy: రోజుకు రూ.45 పొదుపు చేస్తే రూ.25 లక్షలు మీవే..ఈ ఎల్ఐసీ పాలసీతో ఎంతో ప్రయోజనం
Lic
Follow us

|

Updated on: Nov 02, 2024 | 8:10 PM

రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి ఏమిటి, ఖర్చులకు సరిపడే డబ్బులు ఎలా వస్తాయనే ఆందోళన అందరికీ ఉంటుంది. అయితే ప్రణాళికా బద్దంగా జీవనం సాగిస్తే మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఎల్ఐసీలోని జీవన్ ఆనంద్ పాలసీలో ప్రతి రోజూ రూ.45 పొదుపు చేస్తే 35 ఏళ్ల తర్వాత రూ.25 లక్షలు పొందే అవకాశం ఉంది. అంటే చిన్న పొదుపుతో జీవితానికి భరోసా లభిస్తుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో జీవన్ ఆనంద్ పాలసీ అనేక ప్రయోజనాలను అందిస్తోంది.

లైఫ్ ఎండో మెంట్ ప్లాన్. అంటే ప్రీమియం గడువు ముగిసిన తర్వాత కూడా బీమా కవరేజీ కొనసాగుతుంది. దీని ప్రీమియం చాలా తక్కువ. సామాన్యుల సైతం చాలా సులువుగా చెల్లించే అవకాశం ఉంది. రోజుకు కేవలం రూ.45 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. 35 ఏళ్ల తర్వాత 25 లక్షల రూపాయలు పొందే అవకాశం కలుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఈ సొమ్ము మనకు ఆర్థిక భద్రత కల్పిస్తుంది. నిశ్చింతగా జీవించే వీలుంటుంది. జీవన్ ఆనంద్ పాలసీలో బోనస్, డెత్ బెనిఫిట్స్ తో పాటు యాక్సిడెంట్ డెత్, డిసేబిలిటీ రైడర్ కూడా ఉంది. పాలసీ ప్రీమియాన్ని చాలా సులువుగా చెల్లించవచ్చు. అలాగే రెండేళ్ల తర్వాత సరెండర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దురదష్టవశాత్తూ పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందుతుంది. ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యానికి గురైతే విడతల వారీగా బీమా మొత్తాన్ని పంపిణీ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

జీవన్ ఆనంద్ పాలసీ ప్రయోజనాలు

  • జీవన్ ఆనంద్ పాలసీతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అదనపు బోనస్ లతో హామీ ఇచ్చిన మొత్తాన్ని అందజేస్తుంది.
  • పాలసీ కాలమంతా యాక్టివ్ గా ఉండేలా చూసుకోవడం వల్ల మెచ్యూరిటీ ప్రయోజనాలన్నీ అందుతాయి.
  • పాలసీదారులు మరణించిన సమయంలో నామినీకి బీమా మొత్తం చెల్లిస్తారు.
  • జీవిత కాలానికి రక్షణ లభిస్తుంది. బీమా చేయబడిన వ్యక్తికి జీవిత కాలం ఆర్థిక భధ్రత అందిస్తుంది.
  • ఎంచుకున్న టర్మ్ పిరియడ్ ముగింపులో ఒకేసారి మొత్తాన్ని అందిస్తుంది.
  • పాలసీ తీసుకుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్టంగా 50 ఏళ్ల లోపు ఉండాలి.
  • ప్రతి నెలా రూ.1,358 ప్రీమియం చెల్లించడం (రోజుకు రూ.45) ద్వారా 35 ఏళ్లలో రూ.25 లక్షలకు పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమాయకంగా కాళ్లు మొక్కి.. పద్దతిగా మర్డర్ చేసిండు.! వీడియో వైరల్..
అమాయకంగా కాళ్లు మొక్కి.. పద్దతిగా మర్డర్ చేసిండు.! వీడియో వైరల్..
హర హర అంటే.. బుడ బుడ నీరు బయటకొస్తుంది.! వీడియో వైరల్..
హర హర అంటే.. బుడ బుడ నీరు బయటకొస్తుంది.! వీడియో వైరల్..
కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుందా.? వీడియో..
కెనడా నిర్ణయం భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపనుందా.? వీడియో..
అక్కడికి రాగానే వాహనాలు గాల్లోకి ఎగురుతాయి.. ఎలా.? వీడియో వైరల్..
అక్కడికి రాగానే వాహనాలు గాల్లోకి ఎగురుతాయి.. ఎలా.? వీడియో వైరల్..
కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..
కేవలం రూ.3 వేలకే విమాన ప్రయాణం.! కొత్తగా 2 విమాన సర్వీసులు..
బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.!
బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది.!
ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు
ఈ గింజల్ని రోజూ గంజిలో కాసింత కలుపుకుని తాగితే చాలు.! సర్వరోగాలకు
ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?
ఉపవాసంలో ఈ పండ్లను అస్సలు తినకూడదు.! అత్తిపండ్లు నాన్ వెజ్ ఆ.?
మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..
మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..
డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!
డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!