Gold Price: 45 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతున్న బంగారం ధర.. ఇంకా ఎంత పెరుగుతుంది?

Gold Price: బంగారం ధర రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొన్నేళ్ల కిందట ఉన్న ధరతో పోల్చుకుంటే ప్రస్తుతం అప్పటి రికార్డులను బద్దలు కొడుతోంది. ప్రస్తుతం బంగారం సామాన్యుడు కొనే పరిస్థితి లేదు..

Gold Price: 45 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతున్న బంగారం ధర.. ఇంకా ఎంత పెరుగుతుంది?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 02, 2024 | 1:05 PM

బంగారం ధర కొత్త గరిష్టాన్ని సృష్టించింది. ఈ ఏడాది బంగారం ధర 34 శాతం పెరిగింది. 1995 తర్వాత బంగారం ధర అత్యధికంగా పెరిగింది. ఈ ఏడాది 41 సార్లు బంగారం ఆల్ టైమ్ హైకి చేరుకుంది. అంతకుముందు 2011లో స్వర్ణం 34 సార్లు ఆల్ టైమ్ హైకి చేరింది. చరిత్రలో తొలిసారిగా ఔన్సు బంగారం ధర 2,800 డాలర్లు దాటింది. బంగారం 1970 నుండి అత్యుత్తమ స్థాయికి చేరుకుంది. అలాగే, బంగారం ధర 1979 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది. 45 ఏళ్ల క్రితం ఉన్న బంగారం ధరతో పోలిస్తే 120 శాతం పెరిగింది.

బంగారం ధరలు ఎందుకు పెరిగాయి?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనిశ్చితి నెలకొంది. పశ్చిమాసియాలో కూడా సంక్షోభం నెలకొంది. ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు బంగారం ధరలను పెంచాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో ఎన్నికల తర్వాత బంగారం ధర ఎలా మారుతుంది? దీనిపై స్పష్టత రానుంది. అలాగే ఇండియాలో దీపావళి, పెళ్లిళ్ల కారణంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇది ధరల పెరుగుదలకు దారితీసింది. భారతీయులకు ప్రాచీన కాలం నుంచి బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. దీంతో పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారానికి డిమాండ్‌ పెరుగుతోంది.

బంగారం ధర ఎంత దూరం వెళ్తుంది?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యకాలంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.81,000 వరకు ఉండబోతోంది. మున్ముందు రోజుల్లో రూ. 86,000 వరకు ఉండవచ్చు. Comexలో బంగారం మధ్య కాలానికి $2,830, దీర్ఘకాలంలో $3,000కి చేరుకుంటుందని చెబుతున్నారు నిపణులు. ప్రస్తుత కాలంలో బంగారం అత్యుత్తమ పనితీరు కనబర్చే ఆస్తిగా మారింది. ఈ ఏడాది కామెక్స్, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

ఇది కూడా చదవండి: Tech Tips: మీ వాహనంలో పెట్రోల్‌ వేయిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

డిసెంబర్ డెలివరీ కోసం బంగారం గురువారం SCXలో రూ. 13 స్వల్ప లాభంతో రూ.78443.00 వద్ద ముగిసింది. దీపావళికి ఒకరోజు ముందు ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో బంగారం ధర వెయ్యి రూపాయలు పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా రూ.82,000 స్థాయికి చేరుకుంది. ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ.1,000 పెరిగి రూ.82,400కి చేరుకుంది.

ఇది కూడా చదవండి: BSNL: కేవలం రూ.1,198 రీఛార్జ్‌తో ఏడాది వ్యాలిడిటీ.. అద్భుతమైన బీఎస్ఎన్‌ఎల్‌ ప్లాన్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.