FDs interest rates: ఎఫ్ డీలపై ఎక్కువ వడ్డీ కావాలా..? ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిందే..!

సురక్షితమైన పెట్టుబడి మార్గాలలో ఫిక్స్ డ్ డిపాజిట్లు (ఎఫ్ డీలు) ముందంజలో ఉన్నాయి. వివిధ బ్యాంకులు అందించే ఎఫ్ డీలకు ప్రజల ఆదరణ చాాలా ఎక్కువగా ఉంటుంది. నిర్ణీత కాలానికి వడ్డీ తో సహా అసలు తీసుకునే అవకాశం ఉంది. అయితే అన్ని బ్యాంకుల్లోని ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఒకేలా ఉండవు. అలాగే సాధారణ ఖాతాదారులకు, సీనియర్ సిటిజన్లకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు మారుతూ ఉంటుంది

FDs interest rates: ఎఫ్ డీలపై ఎక్కువ వడ్డీ కావాలా..? ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సిందే..!
Money
Follow us
Srinu

|

Updated on: Nov 02, 2024 | 7:50 PM

సరైన ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఖాతాదారులను ఆకర్షించడానికి బ్యాంకులు వివిధ ఎఫ్ డీలను అమలు చేస్తున్నాయి. వాటిలో డిపాజిట్ చేసే ముందు వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేట్లు, కాల వ్యవధిని పూర్తిగా తెలుసుకోవాలి. నమ్మకమైన, సురక్షితమైన చోట డబ్బులను పెట్టుబడి పెట్టాలి. ఫిక్స్ డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడి మార్గాలుగా నిలుస్తాయి. స్థిరమైన రాబడిని అందిస్తాయి. కాలక్రమీణా మీ పొదుపును పెంచడానికి సాయపడతాయి. ఎఫ్ డీలలో పెట్టుబడి పెట్టే ముందు బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేట్లను బాగా గమనించాలి. ఎక్కువ వడ్డీ ఉన్న చోట డిపాజిట్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీరేట్ల వివరాలు తెలుసుకుందాం. మూడేళ్ల కాలపరిమితికి రూ.3 లక్షలను డిపాజిట్ చేస్తే బ్యాంకులు అందించే వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి.

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో సాధారణ పౌరులకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ అందిస్తున్నారు. దీనిలోని ఫిక్స్ డ్ పథకంలో రూ.3 లక్షలు డిపాజిట్ చేస్తే మూడేళ్ల తర్వాత సాధారణ పౌరులకు రూ.66,718, సీనియర్ సిటిజన్లకు రూ.72,164 వడ్డీ అందజేస్తున్నారు.

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఫిక్స్ డి డిపాజిట్ పథకాలపై ఆకర్షణీయమైన వడ్డీరేట్లు అందిస్తున్నారు. సాధారణ ఖాతాదారులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేట్లు అమలు చేస్తున్నారు. మూడేళ్ల కాలపరిమితికి రూ.3 లక్షలు డిపాజిస్తే సాధారణ ఖాతాదారులకు రూ.69,432, సీనియర్ సిటిజన్లకు రూ.74,915 వడ్డీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఐసీఐసీఐ బ్యాంకు

ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన ఐసీఐసీఐలో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు అమలవుతున్నాయి. వీటిలో సాధారణ ఖాతాదారులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేట్లు అమలు చేస్తున్నారు. ఈ బ్యాంకులో రూ.3 లక్షలు ఎఫ్ డీ చేస్తే మూడేళ్ల తర్వాత సాధారణ ఖాతాదారులు రూ.69.432, సీనియర్ సిటిజన్లు రూ.74,915 వడ్డీని పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి