AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఎప్పటికీ డిమాండ్‌ తగ్గని వ్యాపారం.. లక్షల్లో ఆదాయం వచ్చే మార్గం

మంచి బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉన్నారా.? తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం కోసం చూస్తున్నారా.? మీరు సంపాదించడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నారా.? అయితే మీకోసమే ఈ బెస్ట్ బిజినెస్ ప్లాన్. ఇంతకీ ఏంటీ బిజినెస్.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Business Idea: ఎప్పటికీ డిమాండ్‌ తగ్గని వ్యాపారం.. లక్షల్లో ఆదాయం వచ్చే మార్గం
Business Idea
Narender Vaitla
|

Updated on: Nov 02, 2024 | 7:37 PM

Share

వ్యాపారం.. చాలా మందికి ఇదొక డ్రీమ్‌. మనసుకు నచ్చని ఉద్యోగం చేస్తున్నా, ఆర్థిక అవసరాల కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు మంచి బిజినెస్‌ ప్రారంభించి. బిజినెస్‌ మ్యాన్‌ అనే పేరు తెచ్చుకోవాలని ఆశపడుతుంటారు. అయితే సరైన సమాచారం లేకో, అవగాహన లేకో చాలా మంది ఆ ఆలోచనను విరమించుకుంటారు.

అయితే మార్కెట్‌ అవసరాలను తెలుసుకొని వ్యాపారాలకు ప్రారంభిస్తే భారీగా ఆదాయం ఆర్జించడమే కాకుండా, సమాజంలో మంచి గుర్తింపును సైతం సొంతం చేసుకోవచ్చు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. బిల్డింగ్స్‌ నిర్మాణం చేపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో టైల్స్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడుతుంది. ఈ టైల్స్‌ బిజినెస్‌ను ప్రారంభించడం ద్వారా భారీగా ఆదాయాలు ఆర్జించవచ్చు. అయితే టైల్స్‌ తయారీకి ఎంత పెట్టుబడి కావాలి.? లాభాలు ఎలా ఉంటాయంటే..

టైల్స్‌ బిజినెస్‌ను మొదట్లో తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. టైల్స్‌ తయారీ యూనిట్‌ను ప్రారంభించాలంటే కనీసం 250 నుంచి 300 గజాల స్థలం అవసరపడుతుంది. అలాగే కరెంట్‌, నీరు సదుపాయం ఉండాలి. అవసరమైన లెసెన్స్‌లు తీసుకోవాలి. ఇక టైల్స్‌ తయారీకి కొన్ని రకాల మిషినరీలు అవసరపడతాయి. వీటిలో ఒకటి కాంక్రీట్ మిక్సింగ్ మిషన్‌. టైల్‌ తయారీకి అవసరమైన మిశ్రమాన్ని వీటితో తయారు చేస్తారు. వీటి ధర లక్ష రూపాయల ప్రారంభ ధర నుంచి అందుబాటులో ఉంటాయి.

అలాగే కలర్‌ మిషన్‌ అవసరపడుతుంది. వీటితో పాటు టైల్స్‌ తయారీకి మౌల్డ్స్‌ అవసరపడతాయి. టైల్‌ ఆకారం ఈ మౌల్డ్స్‌పైనే ఆధారపడి ఉంటాయి. వీటి ద్వారా రూ. 100 నుంచి ప్రారంభమవుతాయి. టైల్స్‌ తయారీకి ఇసుక, స్టోన్‌డస్ట్‌, కంకర అవసరపడుతుంది. టైల్స్‌ తయారీకి ఇదే రా మెటీరియల్‌. కలర్‌ పౌడర్‌ కూడా ఇందుకు అవసరమవుతుంది. తయారీ విషయానికొస్తే.. ముందుగా రా మెటీరియల్‌తో కాంక్రీట్‌ను తయారు చేస్తారు. ఆ తర్వాత మిక్సర్‌ను కలర్‌ మిక్సర్‌ వేస్తారు. ఆ తర్వాత టైల్ మౌల్డ్స్‌ ద్వారా టైల్స్‌ను తయారు చేస్తారు. ఒక్కో టైల్ తయారీకి సుమారు రూ. 10 ఖర్చవుతుంది. మార్కెట్లో ప్రస్తుతం ఒక్కో టైల్‌ రూ. 25 ఉంటుంది. హోల్‌సోల్‌లో మనం తక్కువలో తక్కువ రూ. 15 నుంచి రూ. 20 వరకు సేల్ చేసుకోవచ్చు. దీంతో ప్రతీ నెల భారీగా ఆదాయం పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..