AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monthly Income Scheme: ఈ పథకంలో డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.9250.. అద్భుతమైన స్కీమ్‌

ఈ చిన్న పొదుపు పథకం 7.4 శాతం వార్షిక వడ్డీని ఇస్తోంది. అందులో జమ చేసిన డబ్బుపై వార్షిక వడ్డీని 12 భాగాలుగా విభజించి, అది ప్రతి నెలా మీ ఖాతాలోకి వస్తుంది. మీరు నెలవారీ డబ్బును విత్‌డ్రా చేయకపోతే అది మీ పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలోనే ఉంటుంది..

Monthly Income Scheme: ఈ పథకంలో డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.9250.. అద్భుతమైన స్కీమ్‌
Cash Deposit
Subhash Goud
|

Updated on: Nov 02, 2024 | 3:33 PM

Share

నెలనెల రాబడి పొందేందుకు పోస్టాఫీసుల్లో అనేక స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. ఇది ఎవరికైనా సాధారణ ఆదాయ వనరుగా మారవచ్చు.

వడ్డీ రేటు సంవత్సరానికి 7.4%

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ ఖాతాపై ప్రస్తుత వడ్డీ రేటు సంవత్సరానికి 7.4%. ఇప్పుడు ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతా ద్వారా గరిష్టంగా రూ.15 లక్షలు ఇందులో జమ చేయవచ్చు. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ ఖాతా అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం. ఇందులో ఎలాంటి రిస్క్‌ ఉండదు. ఇది హామీతో కూడిన రాబడిని ఇస్తుంది. పోస్టాఫీసు పథకం అయితే అందులో 100% భద్రత గ్యారంటీ. ఒకే ఖాతా కాకుండా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

ఇది కూడా చదవండి: Tech Tips: మీ వాహనంలో పెట్రోల్‌ వేయిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

ఎవరు ఖాతాను తెరవవచ్చు

  • పెద్దల పేరిట ఒకే ఖాతా
  • జాయింట్ ఖాతా (గరిష్టంగా 3 పెద్దలు కలిసి) (జాయింట్ A లేదా జాయింట్ B)
  • మైనర్ సంరక్షకుడు అతని/ఆమె పేరు మీద ఖాతాను తెరవవచ్చు
  • మైనర్‌కు 10 ఏళ్లు ఉంటే, అతని/ఆమె పేరు మీద ఖాతాను తెరవవచ్చు

స్కీమ్‌ డిపాజిట్ నియమాలు:

  • ఈ ఖాతాను తెరవడానికి కనీసం రూ. 1000 పెట్టుబడి అవసరం. ఆ తర్వాత రూ.1000 గుణిజాల్లో డిపాజిట్లు చేయవచ్చు.
  • ఒకే ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు. ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షలు జమ చేయవచ్చు.
  • ఉమ్మడి ఖాతాలో ప్రతి హోల్డర్‌కు పెట్టుబడిలో సమాన వాటా ఉంటుంది.

ఈ పథకంలో వడ్డీ ఎలా జోడిస్తారు?

ఈ చిన్న పొదుపు పథకం 7.4 శాతం వార్షిక వడ్డీని ఇస్తోంది. అందులో జమ చేసిన డబ్బుపై వార్షిక వడ్డీని 12 భాగాలుగా విభజించి, అది ప్రతి నెలా మీ ఖాతాలోకి వస్తుంది. మీరు నెలవారీ డబ్బును విత్‌డ్రా చేయకపోతే అది మీ పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలోనే ఉంటుంది. అలాగే ఈ డబ్బును ప్రిన్సిపల్‌తో పాటు జోడించడం ద్వారా మీకు మరింత వడ్డీ లభిస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ 5 సంవత్సరాలు, కానీ 5 సంవత్సరాల తర్వాత కొత్త వడ్డీ రేటు ప్రకారం పొడిగించవచ్చు.

ప్రతి నెలా ఎంత డబ్బు వస్తుంది?

  • వడ్డీ రేటు: సంవత్సరానికి 7.4 శాతం
  • ఉమ్మడి ఖాతా నుండి గరిష్ట పెట్టుబడి: రూ. 15 లక్షలు
  • వార్షిక వడ్డీ: రూ. 1,11,000
  • నెలవారీ వడ్డీ: రూ. 9250

మీకు ఒకే ఖాతా ఉంటే..

  • వడ్డీ రేటు: సంవత్సరానికి 7.4%
  • గరిష్ట పెట్టుబడి: రూ. 9 లక్షలు
  • వార్షిక వడ్డీ: రూ. 66,600
  • నెలవారీ వడ్డీ: రూ. 5550

మీరు మెచ్యూరిటీ తర్వాత కూడా ఈ పథకాన్ని పొడిగించవచ్చు.

నెలవారీ ఆదాయ పథకం మెచ్యూరిటీ 5 సంవత్సరాలు. కానీ 5 సంవత్సరాల తర్వాత కొత్త వడ్డీ రేటు ప్రకారం పొడిగించవచ్చు. ఈ పథకం కింద మీరు బ్యాంక్ ఎఫ్‌డీ కంటే మెరుగైన రాబడిని పొందుతున్నారు. మీరు 5 సంవత్సరాల తర్వాత స్కీమ్‌లో కొనసాగకూడదనుకుంటే, మీరు డిపాజిట్ చేసిన మొత్తం తిరిగి పొందవచ్చు.

స్కీమ్‌ ముందస్తు మూసివేతపై..

  • డిపాజిట్ తేదీ నుండి 1 సంవత్సరం గడువు ముగిసేలోపు ఎటువంటి డిపాజిట్ మొత్తాన్ని విత్‌డ్రా చేయలేరు.
  • 1 సంవత్సరం తర్వాత, ఖాతా తెరిచిన తేదీ నుండి 3 సంవత్సరాలలోపు పథకం మూసివేస్తే ప్రధాన మొత్తంలో 2% కట్ చేసి మిగిలిన మొత్తం చెల్లిస్తారు.
  • 3 సంవత్సరాల తర్వాత, ఖాతా తెరిచిన తేదీ నుండి 5 సంవత్సరాలలోపు పథకం మూసివేస్తే ప్రధాన మొత్తంలో 1% తీసివేసి మిగిలిన మొత్తాన్ని అందజేస్తారు.
  • సంబంధిత పోస్టాఫీసులో పాస్‌బుక్‌తో పాటు నిర్ణీత దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడం ద్వారా ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చు.

ఇది కూడా చదవండి: BSNL: కేవలం రూ.1,198 రీఛార్జ్‌తో ఏడాది వ్యాలిడిటీ.. అద్భుతమైన బీఎస్ఎన్‌ఎల్‌ ప్లాన్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి