Health Insurance: దీపావళి కానుకగా మోడీ కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షల ఉచిత బీమా

Health Insurance: ఈ వయసు దాటిన వారికి ఆస్పత్రులు నగదు రహిత చికిత్స అందించాలని కేంద్రం సూచిస్తోంది. ఆస్పత్రిలో చికిత్స అందించే విషయంలో గానీ, ఇతర విషయాల్లోగానీ ఫిర్యాదులు ఉంటే.. వెబ్‌సైట్‌, యాప్‌లో గానీ లేదా నేషనల్‌ కాల్‌ సెంటర్‌ 14555ను సంప్రదించవచ్చు. గంటల వ్యవధిలోనే మీ సమస్యను పరిష్కారం లభిస్తుంది..

Health Insurance: దీపావళి కానుకగా మోడీ కీలక ప్రకటన.. వారికి రూ.5 లక్షల ఉచిత బీమా
Follow us
Subhash Goud

|

Updated on: Nov 02, 2024 | 1:55 PM

ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (AB- PMJAY) అందుబాటులోకి వచ్చింది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని పథకాన్ని లాంఛనంగా విస్తరించారు. ఈ పథకం కింద 70 ఏళ్లు దాటిన వృద్ధులకు వారి ఆర్థిక స్థితిగతులతో ఎలాంటి సంబంధం లేకుండా రూ.5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తుంది. ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎలాంటి పత్రాలు కావాలో చూద్దాం.

ఇప్పుడు 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరూ ఈ పథకం ప్రయోజనం పొందుతారు. వీరందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. ఐదు లక్షల వరకు బీమా పథకం ప్రయోజనం ప్రతి సంవత్సరం అందుబాటులో ఉంటుంది.

ప్లాన్ ఏమిటి?

ఇవి కూడా చదవండి

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) పథకం 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్‌ల కోసం. దానికి ఎలాంటి ఆదాయం అవసరం లేదు. ఏదైనా ఆదాయ వర్గానికి చెందిన వ్యక్తి ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే ఇప్పటికే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలు, కుటుంబంలోని వృద్ధులకు ఏడాదికి రూ.5 లక్షల వరకు ప్రత్యేక చికిత్సను అందజేస్తారు. దేశంలోని దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు చెందిన 6 కోట్ల మందికి పైగా వృద్ధులకు ఇది లబ్ది చేకూరుస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకం తక్కువ ఆదాయ వర్గ కుటుంబాలకు మాత్రమే వర్తిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్ల కోసం ప్రారంభించిన ఈ పథకానికి ఎటువంటి ఆదాయ పరిమితి ఉండదు.

ఈ పథకం ప్రయోజనాలు:

ఆయుష్మాన్ యోజన అమలు చేయని కుటుంబాలకు అక్టోబర్ 29 నుంచి ప్రత్యేక కార్డు లభిస్తుంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రతినిధి పద్ధతిలో కొంతమంది సీనియర్‌ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్‌ కార్డులను అందజేశారు. BIS పోర్టల్ https://bis.pmjay.gov.in/ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా ఆయుష్మాన్ కార్డ్ పొందవచ్చు. దాని కోసం, వృద్ధులు తమ ఆధార్ కార్డు, కేవైసీని కూడా అప్‌డేట్ చేయాలి. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉన్న సీనియర్‌లు ప్రైవేట్, ఆయుష్మాన్ భారత్ యోజన బీమాను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందులో చేరాలంటే ఆధార్‌తోపాటు మొబైల్ నంబర్‌, ఇతర వివరాలు అవసరం.

ఆస్పత్రుల జాబితా తెలుసుకోవడం ఎలా?

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద సుమారు 30 వేల ఆస్పత్రులు దేశవ్యాప్తంగా నమోదై ఉన్నాయి. ఇందులో కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు కూడా ఉన్నాయి. ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రుల జాబితా dashboard.pmjay.gov.in వెబ్‌సైట్‌లో లభిస్తుంది.

2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!