LIC mutual fund: వంద రూపాయలుంటే మీరే ఇన్వెస్టర్.. కనీస సిప్ మొత్తాన్ని తగ్గించిన ఎల్ఐసీ

మ్యుచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) అనేవి దీర్థకాలంలో సంపదను పెంచుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. వీటితో కొంచెం రిస్క్ ఉన్నా, రాబడి చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలో వీటిలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంఎఫ్ లలో ఇన్వెస్ట్ చేయడానికి భారీగా పెట్టుబడి అవసరం లేదు. ఎస్ఐపీ (సిప్) అనే విధానంలో ప్రతి నెలా కనీసం రూ.500 అయినా పెట్టుబడి పెట్టవచ్చు.

LIC mutual fund: వంద రూపాయలుంటే మీరే ఇన్వెస్టర్.. కనీస సిప్ మొత్తాన్ని తగ్గించిన ఎల్ఐసీ
Lic Mutual Funds
Follow us

|

Updated on: Sep 25, 2024 | 4:45 PM

మ్యుచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) అనేవి దీర్థకాలంలో సంపదను పెంచుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. వీటితో కొంచెం రిస్క్ ఉన్నా, రాబడి చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలో వీటిలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంఎఫ్ లలో ఇన్వెస్ట్ చేయడానికి భారీగా పెట్టుబడి అవసరం లేదు. ఎస్ఐపీ (సిప్) అనే విధానంలో ప్రతి నెలా కనీసం రూ.500 అయినా పెట్టుబడి పెట్టవచ్చు. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ కు చెందిన ఎంఎఫ్ లో కూడా సిప్ చేసుకునే అవకాశం ఉంది. దీనిలో నెలకు కనీసం 300 ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఈ మొత్తాన్ని రూ.100కు తగ్గించేందుకు ఆ సంస్థ చర్యలు తీసుకుంది. దీనివల్ల పెట్టుబడి దారుల భాగస్వామ్యం పెరుగుతుందని భావిస్తున్నారు.

అక్టోబర్ నుంచి అమలు

కంపెనీ ఎండీ, సీఈవో ఆర్కే ఝూ ఇటీవల జరిగిన సమావేశంలో రూ.100 సిప్ లపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత కనీస పెట్టుబడి రూ.300 ఉందని, దాన్ని రూ.100, రూ.200గా చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. అక్టోబర్ నుంచి కొత్త విధానం అమలు చేయవచ్చని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల పెట్టుబడిదారులు భాగస్వామ్యం పెరుగుతుందన్నారు. సమాజంలో అనేక వర్గాల ప్రజలు ఇన్వెస్ట్ చేసే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. చిన్న వ్యాపారులు, కూరగాయలు అమ్ముకునేవారు, తోపుడు బళ్ల వర్తకులు కూడా పొదుపు చేయగలుగుతారన్నారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం చివరికి ఫండ్ హౌస్ నిర్వహణలోని ఆస్తులను (ఏయూఎం) రూ.35 వేల కోట్ల నుంచి రూ.65 వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరం చివరికి ఇవి సుమారు రూ.లక్ష కోట్లకు చేరుకుంటాయన్నారు.

సానుకూల స్పందన

ఎల్ ఐసీ తీసుకున్న కొత్త నిర్ణయంపై ఆర్థిక నిపుణులు సానుకూలంగా స్పందించారు. సిప్ లో తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతారన్నారు. వారికి మ్యూచువల్ ఫండ్స్ పై అవగాహన పెరగడంతో పాటు భవిష్యత్తులో సంపద పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తద్వారా ప్రజలకు మ్యూచువల్ ఫండ్ కూడా ప్రధాన పెట్టుబడి మార్గంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రజల భాగస్వామ్యం

అనేక మ్యూచువల్ ఫండ్ హౌస్ లు చిన్న నగరాలు, పట్టణాలలో తన కార్యాలయాలను తెరవడానికి చూస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడం, వారు పెట్టుబడి పెట్టేలా చూడడం దీని ప్రధాన లక్ష్యం. సిప్ లలో కనీస పెట్టుబడులు తగ్గించడం ద్వారా ఎక్కువ మంది ప్రజలు వీటిపై ఆసక్తి చూపుతారు. ఎల్ ఐ సీ మ్యూచువల్ ఫండ్ కూడా డెహ్రడూన్, జంషెడ్ పూర్, జోథ్ పూర్, దుర్గాపూర్ తదితర ప్రాంతాలలో తన పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. గతంలో త్రైమాసికి సిప్ లో పెట్టుబడికి కనీసం రూ.మూడు వేలు అవసరమయ్యేది. కొత్త విధానంలో రూ.750 సరిపోతుంది. పక్కా ప్రణాళిక తో చిన్న మొత్తాలను స్థిరంగా పెట్టుబడి పెడితే కాలక్రమేణా రాబడి పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..