Cyber Fraud: ‘సున్నా’ ఎంత పని చేసింది భయ్యా! ఏకంగా రూ. 9లక్షలు ఖతం..

తాము సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులమంటూ ఉద్యోగులను, వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇదే తరహాలో ఇటీవల ముంబైలో ఓ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ 59 ఏళ్ల రైల్వే అధికారి కేవలం తన ఫోన్లో ‘సున్నా’ నొక్కడం ద్వారా ఏకంగా రూ. 9లక్షలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అదెలా సాధ్యమైంది? సైబర్ నేరగాళ్లు చేసిన మోసం ఏంటి? తెలుసుకుందాం రండి..

Cyber Fraud: ‘సున్నా’ ఎంత పని చేసింది భయ్యా! ఏకంగా రూ. 9లక్షలు ఖతం..
Cyber Crime
Follow us

|

Updated on: Sep 25, 2024 | 12:59 PM

సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎప్పటికప్పుడు నేరగాళ్లు కొత్త మార్గాలను వెతుక్కుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఎంతలా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఏదో మార్గంలో.. ఎవరో ఒకరు వారి బారి పడి పెద్ద మొత్తాల్లో నష్టపోతున్నారు. కేవలం లింక్ పంపించడం.. మెసేజ్ లు, ఈమెయిల్స్ ద్వారా జరుగుతున్న సైబర్ నేరాలు ఇప్పుడు మరో రూపంలో వేగంగా విస్తరిస్తున్నాయి. తాము సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులమంటూ ఉద్యోగులను, వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఇదే తరహాలో ఇటీవల ముంబైలో ఓ కేసు వెలుగులోకి వచ్చింది. ఓ 59 ఏళ్ల రైల్వే అధికారి కేవలం తన ఫోన్లో ‘సున్నా’ నొక్కడం ద్వారా ఏకంగా రూ. 9లక్షలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అదెలా సాధ్యమైంది? సైబర్ నేరగాళ్లు చేసిన మోసం ఏంటి? అలాంటి వాటి నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి? తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ఇది మోసం..

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్(సీఎస్ఎంటీ) ప్రిన్సిల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్(కన్స్‌స్ట్రక్షన్)గా పనిచేస్తున్న వ్యక్తికి తన వాడుతున్న ఫోన్లో సెప్టెంబర్ 16న ఓ వాయిస్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో వినియోగదారు వెంటనే ‘జీరో’ నొక్కాలని లేని పక్షంలో మొబైల్ నంబర్ బ్లాక్ అవుతుందని ఉంది. దీంతో కంగారు పడిన ఆ అధికారి వెంటనే జీరో నొక్కేశారు. అలా జీరో నొక్కారో లేదో వెంటనే వీడియో కాల్ కనెక్ట్ అయ్యింది. ఆ కాల్లో అవతలి వ్యక్తి తనను తాను ఓ సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత రైల్వే అధికారిపై ఓ మనీ ల్యాండరింగ్ కేసు నమోదైందని చెప్పారు. ఓ నకలీ జడ్జి ద్వారా వివరాలు చెప్పించారు. తాము చెప్పిన బ్యాంక్ ఖాతాకు రూ. 9లక్షలు వెంటనే ట్రాన్స్ ఫర్ చేయాలని లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో కంగారు పడిన సదరు రైల్వే అధికారి, అది నిజమేనని భావించి రూ. 9లక్షలు తన ఖాతా నుంచి ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ తర్వాత వెంటనే కాల్ డిస్ కనెక్ట్ అవ్వడం కనీసం డబ్బులు చెల్లించినట్లు ఎలాంటి రసీదు కూడా లేకపోవడంతో అనుమానం కలిగిన ఆ అధికారి మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తస్మాత్ జాగ్రత్త..

అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక ప్రతి విషయాన్ని సులభతరం చేస్తోంది. అదే సమయంలో నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు చాలా సులభంగా మోసాలకు పాల్పడుతున్నారు. వీరి బారిన పడకుండా ఉండాలంటే ప్రజలు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పదమైన మెసేజ్ లు, కాల్స్ వచ్చినప్పుడు తెలివిగా వ్యవహరించాలి. మెసేజ్ లు అయితే వాటిని అలాగే వదిలేయాలి. ఫోన్లు వస్తే ఎవరు? ఏమిటి? అన్న విషయాలు కచ్చితంగా తెలుసుకోకుండా మీకు సంబంధించిన వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. అవతలి వారు తాము అధికారులము అని చెప్పినా మీరు క్రాస్ చెక్ చేసుకోకుండా, నిర్ధారించుకోకుండా ఎలాంటి వివరాలు వెల్లడించకూడదు. అలాంటి కాల్స్ తరచూ వస్తూ ఉంటే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..