ప్రజలకు కేంద్రం బిగ్ అలర్ట్.. డిసెంబర్ 31వరకే మీకు డెడ్‌లైన్.. చేయకపోతే సమస్యలే..
మీరు ఇంకా ఆధార్ కార్డుతో పాన్‌ను లింక్ చేయలేదా..? డిసెంబర్ 31 వరకే మీకు గడువు ఉంది. ఒకవేళ చేయకపోతే పాన్ కార్డు రద్దు అయ్యే అవకాశముంది. అంతేకాకుండా బ్యాక్ సేవలు, జీతం పొందటం విషయంలో మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది.

Link Aadhaar with PAN :పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవడాన్ని కేంద్రం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తూ ఉంది. లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు నుంచి సేవలు పొందలేరని, రద్దు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. పాన్-ఆధార్ లింక్ చేసుకోవడానికి గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కేంద్రం ఎప్పటికప్పుడు గడువు పొడిగిస్తూనే ఉంది. అయినా ఇంకా కొంతమంది లింక్ చేసుకోలేదని ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో మిగతావారు కూడా ఈ పనిని పూర్తి చేయాలని, లేకపోతే కొత్త సంవత్సరం నుంచి కఠినంగా వ్యవహరిస్తామని కేంద్రం చెబుతోంది. జనవరి 1లోపు చేసుకోకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటోంది.
కొత్త సంవత్సరంలోపు ఆధార్-పాన్ లింక్ చేసుకోకపోతే జీతం, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, లోన్ ప్రాసెసింగ్, బ్యాంకింగ్, పెట్టుబడి వంటి ఆర్ధిక లావాదేవీలు మీకు నిలిచిపోవచ్చు. దీంతో ఇంకా చేసుకోనివారి ఉంటే వెంటనే జాగ్రత్త పడటం మంచిది. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్ సైట్ లేదా సమీపంలోని పాన్ సెంటర్‌కు వెళ్లి లింక్ చేసుకోండి. ఒకవేళ ఇంతకముందే మీరు ఈ పని పూర్తి చేస్తే మళ్లీ చెక్ చేసుకోవడం మంచిది. లేకపోతే కొత్త సంవత్సరం నుంచి ఆర్ధిక లావాదేవీల విషయంలో సమస్యలు రావొచ్చు.
ఎస్‌ఎంఎస్ ద్వారా ఎలా చేసుకోవాలి..?
UIDPAN <మీ ఆధాన్ నెంబర్ ><పాన్ కార్డు నెంబర్> టైప్ చేసి 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపండం ద్వారా చేసుకోవచ్చు
వెబ్‌సైట్ ద్వారా..
-ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ పిల్లింగ్ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/లోకి వెళ్లండి
-లింక్ ఆధార్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-మీ ఫాన్, ఆధార్ నెంబర్లను ఎంటర్ చేయండి
-ఆ తర్వాత క్రింద వ్యాలిడేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
-లింక్ అయిన తర్వాత మీ మొబైల్‌కు మెస్సేజ్ వస్తుంది.




