ICICI Interest Rates: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు షాక్.. డిపాజిట్లపై తగ్గిన వడ్డీ రెట్లు!

భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ(ICICI) బ్యాంక్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. డిపాజిట్ల పై వడ్డీ రేట్లను తగ్గించింది.

ICICI Interest Rates: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు షాక్.. డిపాజిట్లపై తగ్గిన వడ్డీ రెట్లు!
Icici Bank Interest Rates
Follow us
KVD Varma

|

Updated on: Nov 30, 2021 | 8:56 PM

ICICI Interest Rates: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ(ICICI) బ్యాంక్ డొమెస్టిక్, నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (NRO), నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ అకౌంట్ (NRE) డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, 2 కోట్ల రూపాయల కంటే తక్కువ దేశీయ డిపాజిట్లపై సర్దుబాటు చేసిన వడ్డీ రేట్లు నవంబర్ 16, 2021 నుండి అమలులోకి వచ్చాయి. అయితే, NRO, NRE డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లు నవంబర్ 29, 2021 నుంచి అమలులోకి తీసుకువచ్చారు.

ICICI బ్యాంక్ FD రేట్లు

16 నవంబర్ 2021 నుండి అమలులోకి వచ్చేలా, ఐసీఐసీఐ(ICIC బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే రూ.2 కోట్ల కంటే తక్కువ దేశీయ టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఇప్పుడు రెట్లు తగ్గించిన తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై క్రింది వడ్డీ రేట్లను పొందుతారు.

డిపాజిట్ సమయం రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వడ్డీ రేట్లు రూ. డిపాజిట్లకు వడ్డీ రేట్లు 2 కోట్లు   నించి  రూ. 5 కోట్లు వరకు 
7 రోజుల నుండి 14 రోజుల వరకు 2.50% 2.75%
15 రోజుల నుండి 29 రోజుల వరకు 2.50% 2.75%
30 రోజుల నుండి 45 రోజుల వరకు 3.00% 3.00%
46 రోజుల నుండి 60 రోజుల వరకు 3.00% 3.00%
61 రోజుల నుండి 90 రోజుల వరకు 3.00% 3.15%
91 రోజుల నుండి 120 రోజులు 3.50% 3.15%
121 రోజుల నుండి 150 రోజులు 3.50% 3.15%
151 రోజుల నుండి 184 రోజులు 3.50% 3.15%
185 రోజుల నుండి 210 రోజులు 4.40% 3.65%
211 రోజుల నుండి 270 రోజులు 4.40% 3.65%
271 రోజుల నుండి 289 రోజులు 4.40% 3.90%
290 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ 4.40% 3.90%
1 సంవత్సరం నుండి 389 రోజులు 4.90% 4.05%
390 రోజుల నుండి <15 నెలల వరకు 4.90% 4.05%
15 నెలల నుండి <18 నెలల వరకు 4.90% 4.15%
18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు 5.00% 4.25%
2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు 5.15% 4.50%
3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు 5.35% 4.70%
5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాల వరకు 5.50% 4.70%
5 సంవత్సరాలు (80C FD) 5.35% NA
మూలం: బ్యాంక్ వెబ్‌సైట్. నవంబర్ 16, 2021 నుండి నవంబర్ 29, 2021 నుండి

ఇవి కూడా చదవండి: మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..