AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అత్యధికంగా సేల్‌ అవుతున్న ఈ కారు గురించి తెలుసుకోండి!

మిడ్-రేంజ్ SUV విభాగంలో దీనికి తిరుగులేదు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా అగ్రస్థానంలో ఉండింది. క్రెటా విజయం హ్యుందాయ్ ఇండియా వృద్ధికి కీలకంగా నిలిచింది. ఇతర ప్రముఖ SUVలతో పోటీపడి అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. మరి ఆ కారు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..

కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో అత్యధికంగా సేల్‌ అవుతున్న ఈ కారు గురించి తెలుసుకోండి!
Cars
SN Pasha
|

Updated on: Jul 02, 2025 | 5:47 PM

Share

చాలా మంది కారు కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ, ఏ కారు కొనాలో అర్థం కాక తెగ సతమతమవుతుంటారు. కొంతమంది తమకు నచ్చిన మోడల్‌ కొనాలనకుంటే, కొంతమంది సేఫ్టీ ఫీచర్లు ఎక్కువ ఉన్న కారు కావాలనుకుంటారు.. అన్నింటికీ మించి ముందు తమ బడ్జెట్‌లో వచ్చే కారు చూసుకుంటారు. అయితే వీటితో పాటు అసలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లలో ఎక్కువగా అమ్ముడవుతున్న కారు ఏదో అని చాలా తక్కువ మంది మాత్రమే తెలుసుకుంటారు. ఎక్కువ మంది కొంటున్నారంటే.. అన్ని ఫీచర్లు బాగుంటేనే కదా. సో అలా ఇండియాలో అత్యధికంగా సేల్‌ అవుతున్న కారు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా హ్యుందాయ్‌ క్రెటా రికార్డు సృష్టించింది. జూన్ 2025లో 15,786 యూనిట్లతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా క్రెటా అని హ్యుందాయ్ మోటార్ ఇండియా బుధవారం ప్రకటించింది. ఈ మిడ్ రేంజ్‌ SUV మార్చి, ఏప్రిల్ నెలల్లో కూడా ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన మోడల్. గత దశాబ్దంలో బ్రాండ్ క్రెటా SUVల్లో తన ప్రత్యేకతను చాటుకుంది. అలాగే ఇండియాలో హ్యుందాయ్ వృద్ధికి క్రెటా కీ ప్లేయర్‌గా మారింది. హ్యుందాయ్ క్రెటా 2015లో మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏడాది దేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్ రేంజ్‌ SUVగా ఉంది అని హ్యుందాయ్ మోటార్ ఇండియా హోల్ టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ వెల్లడించారు.

చాలా పోటీ ఉండే మిడ్-సైజ్ SUV విభాగంలో ఆధారపడిన హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టాటా కర్వ్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, MG ఆస్టర్ వంటి వాటికి పోటీగా బలంగా నిలబడింది. ఈ విభాగాన్ని చాలా మంది ‘క్రెటా సెగ్మెంట్’ అని కూడా పిలుస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!