AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FMCG: కమీషన్ల గొడవ… స్థంభించిన పౌడర్లు, సబ్బులు, షాంపూలు, పేస్టుల సరఫరా..

ఎఫ్‌ఎంసీజీ (Fast-moving consumer goods) ఉత్పత్తులపై మార్జిన్‌ విషయమై పంపిణీదారుల్లో అసంతృప్తి నెలకొనడంతో వాటి విక్రయాలను నిలిపివేశారు.

FMCG: కమీషన్ల గొడవ... స్థంభించిన పౌడర్లు, సబ్బులు, షాంపూలు, పేస్టుల సరఫరా..
Fmcg
Srinivas Chekkilla
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 04, 2022 | 7:37 AM

Share

ఎఫ్‌ఎంసీజీ (Fast-moving consumer goods) ఉత్పత్తులపై మార్జిన్‌ విషయమై పంపిణీదారుల్లో అసంతృప్తి నెలకొనడంతో వాటి విక్రయాలను నిలిపివేశారు. రిటైల్‌ ధరలకు, బీ2బీ కంపెనీలకు వేర్వేరు రేట్లపై నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరిస్తోంది. ఇదివరకే మహారాష్ట్ర పంపిణీదారులు కొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది మరికొన్ని రాష్ట్రాలకు పాకింది.

ఎఫ్‌ఎంసీజీ పంపిణీదారుల సెగ మరో నాలుగు రాష్ట్రాలకు పాకింది. గుజరాత్‌, ఒడిషా, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల్లో జనవరి 4వ తేదీ నుంచి సప్లయ్‌ నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల పంపిణీదారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆల్‌ఇండియా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఫెడరేషన్‌ ప్రకటన విడుదల చేసింది. హిందుస్థాన్‌ యునిలివర్‌ ఉత్పత్తులైన పౌడర్‌, సబ్బులు, హెయిర్‌ ఆయిల్‌, షాంపూ ప్రొడక్టులతో పాటు కోల్గేట్‌ సంబంధిత ఉత్పత్తులు ఈ లిస్టులో ఉన్నాయి.

జియోమార్ట్‌, మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ, ఉడాన్‌, ఎలాస్టిక్‌ రన్‌, వాల్‌మార్ట్‌ లాంటివి కంపెనీలకు ఎలాంటి పంపిణీ మార్జిన్‌ ఇస్తున్నారో.. తమకూ అదే మార్జిన్‌ ఇవ్వాలంటూ పంపిణీదారుల డిమాండ్‌ చేస్తున్నారు. రిటైల్‌ మార్జిన్‌ 8-12 శాతం ఉండగా, ఆన్‌లైన్‌ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని పంపిణీదారులు ఆరోపిస్తుండగా.. అలాంటిదేం లేదని ఆయా కంపెనీలు చెబుతున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రలో పంపిణీదారులు హిందుస్థాన్‌ యునిలివర్‌ ఉత్పత్తుల పంపిణీని నిలిపివేశారు.

ఆపై జనవరి 1వ తేదీ నుంచి కోల్గేట్‌, కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తులను ఆపేశారు. దీంతో పేస్టుల కొరత ఏర్పడొచ్చన్న కథనాల మేరకు జనాలకు ఎగబడి పేస్టులు కొంటున్నారు. ఈ సమస్యపై డిస్ట్రిబ్యూటర్లకు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల ప్రతినిధులకు మధ్య ఈ రోజు చర్చలు జరగనున్నాయి. ఆఫ్‌లైన్ డిస్ట్రిబ్యూటర్‌ల సమస్యలను పరిశీలించాల్సిందిగా సుమారు 24 ప్రధాన FMCG కంపెనీలకు ఆల్‌ ఇండియా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఫెడరేషన్‌ ఇప్పటికే లేఖ రాసింది.

భారతదేశంలో ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ వస్తువుల మార్కెట్‌ విలువ దాదాపు 7.5 లక్షల కోట్లుగా ఉంది. మనం నిత్యం ఉపయోగించే నూనెలు, సబ్బులు, పౌడర్లు వంటి రోజువారీ వినియోగ వస్తువులన్నీ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలవే. ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్ల స్ట్రైక్‌ అన్ని రాష్ట్రాలకూ విస్తరిస్తే అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవచ్చు

మన దేశంలోని ప్రధాన ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు- వాటి మార్కెట్‌ షేర్‌..

ఐటీసీ-30% హిందుస్థాన్‌ యునిలివర్(HUL)-  14% పార్లే ప్రొడక్ట్స్‌-  7% నెస్లే-  5% మారికో-5% పతంజలి ఆయుర్వేద్‌-4% అమూల్‌-  4% ఇమామి – 2% డాబర్‌-2% గోద్రేజ్‌ -2% గ్లాక్సో స్మిత్‌ (GSK)-1% కోల్గేట్‌-పామోలివ్-1% బ్రిటానియా-1%

Read Also.. LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుందనే విషయం తెలుసా..? దానిని గుర్తించడం ఎలా..? పూర్తి వివరాలు