Maruti Suzuki: మారుతీ సుజుకీ కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 62,000 వరకూ తగ్గింపు.. కారు కొనాలంటే ఇదే మంచి సమయం..

మారుతి సుజుకీ కార్లకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికీ ఈ కంపెనీ కార్లే మన దేశంలో ఎక్కువ అమ్ముడవుతుంటాయి. అటువంటి డిమాండ్ ఉన్న కార్లు ఇప్పుడు డిస్కౌంట్ ధరపై లభిస్తున్నాయి. మారుతి సుజుకీ అరెనా డీలర్ పలు ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తోంది. దాదాపు అన్ని రకాల మోడళ్లపై ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకూ ఈ ఆఫర్లు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Maruti Suzuki: మారుతీ సుజుకీ కార్లపై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 62,000 వరకూ తగ్గింపు.. కారు కొనాలంటే ఇదే మంచి సమయం..
Maruti Suzuki
Follow us
Madhu

|

Updated on: Sep 10, 2023 | 3:12 PM

మారుతి సుజుకీ కార్లకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికీ ఈ కంపెనీ కార్లే మన దేశంలో ఎక్కువ అమ్ముడవుతుంటాయి. అటువంటి డిమాండ్ ఉన్న కార్లు ఇప్పుడు డిస్కౌంట్ ధరపై లభిస్తున్నాయి. మారుతి సుజుకీ అరెనా డీలర్ పలు ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తోంది. దాదాపు అన్ని రకాల మోడళ్లపై ఈ సెప్టెంబర్ నెలాఖరు వరకూ ఈ ఆఫర్లు కొనసాగుతాయి. అంతేకాక పలు ఎక్స్ చేంజ్ ఆఫర్లు, బోనస్, క్యాష్ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. పెట్రోల్, సీఎన్జీ, మోడళ్లలోని ఆల్టో కే10, ఆల్టో 800, సెలెరో, ఎస్ ప్రెస్సో, వ్యాగన్ ఆర్, డిజైర్, స్విఫ్ట్ వంటి కార్లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

మారుతి సుజుకీ ఎస్-ప్రెస్సో.. ఈ మోడల్ కు చెందిన పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లపై దాదాపు రూ. 62,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. అలాగే ఆటోమేటిక్ గేర్ బాక్స్ వేరియంట్ పై రూ. 37,000 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది.

మారుతీ సుజుకీ సెలెరియో.. ఈ కొత్త కారు67బీహెచ్ పీ, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. మాన్యువల్ గేర్ బాక్స్ కారుపై కూడా రూ. 62,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. ఏఎంటీ వేరియంట్ పై రూ. 47,000 వరకూ డిస్కౌంట్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకీ ఆల్టో కే10.. ఈ కారు 67బీహెచ్ పీ, 89ఎన్ఎం, ఒక లీటర్, త్రీ సిలిండర్ కే10సీ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. మాన్యువల్ గేర్ బాక్స వేరియంట్ పై రూ.58,000 వరకూ తగ్గింపు ఉంటుంది. అలాగే ఆటోమేటిక్ గేర్ బాక్స్ వేరియంట్స్ పై రూ. 33,000 వరకూ తగ్గింపు లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ అయితే రూ. 53,000 వరకూ డిస్కౌంట్ ఉంటుంది.

మారుతి సుజుకీ స్విఫ్ట్.. ఈ మోడల్ కారుల్లో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై రూ. 57,000 వరకూ ఉంటుంది. అలాగే ఎల్ఎక్స్ఐ మాన్యువల్, పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్లపై రూ. 52,000 వరకూ తగ్గింపు ఉంటుంది. ఇక సీఎన్జీ వేరియంట్ రూ. 22,000 వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. 90హెచ్ పీ, 1.2 లీటర్ డ్యూయల్ జెట్ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్.. ఈ కారుపై మొత్తంగా రూ. 52,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. ఈ కారు 68హెచ్ పీ, 1.0 లీటర్, 83హెచ్ పీ, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో ఉంటాయి. పెట్రోల్ ఏఎంటీ మోడళ్లపై రూ. 27,000 వరకూ ప్రయోజనాలు చేకూరుతాయి. సీఎన్జీ వేరియంట్లపై రూ. 52,000 వరకూ డిస్కౌంట్ ఉంటుంది.

మారుతి సుజుకీ ఆల్టో 800.. ఈ కారు ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది. అయితే అమ్ముడుపోకుండా ఉండిపోయిన యూనిట్ల విక్రయించడానికి ఆఫర్ అందిస్తోంది. మొత్తం మీద రూ. 15,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. ఈకారు 800సీసీ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కారు ఉంటుంది.

మారుతి సుజుకీ డిజైర్.. ఈ కారుపై రూ. 17,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. అదే సీఎన్జీ వేరియంట్లపై రూ. 7,000 వరకూ డిస్కౌంట్ ఉంటుంది. ఈ కారులో 90హెచ్ పీ, 1.2 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..