AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Food: మీరు కొనుగోలు చేసే ఆహార ఉత్పత్తి ఆరోగ్యకరమైనదని ఎలా తెలుసుకోవాలి..?

ఎప్పుడైనా మీరు ఖరీదైన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను కొనుగోలు చేసినప్పుడు, వాటిలో వాడైనా పదార్థాలను చెక్ చేయడం మర్చిపోవద్దు. చాలా వరకు ఫుడ్ ప్రోడక్ట్స్ ఆరోగ్యకరమైనవిగా చెబుతుంటారు. కానీ నిజానికి అలా ఉండవు. కొన్ని ప్రోడక్ట్స్ అధిక ఫైబర్ కలిగి ఉన్నాయని ప్రచారం చేస్తూ మనల్ని ఆకర్షిస్తాయి. ఇందులో ఒమేగా 3 ఉందని కొన్ని ప్రోడక్ట్స్ చెబుతాయి. హెల్దీ ప్రోడక్ట్స్ అని చెప్పుకునే ఇవి సాధారణ ప్రోడక్ట్స్..

Healthy Food: మీరు కొనుగోలు చేసే ఆహార ఉత్పత్తి ఆరోగ్యకరమైనదని ఎలా తెలుసుకోవాలి..?
Healthy Food
Subhash Goud
|

Updated on: Oct 06, 2023 | 2:58 PM

Share

మీరు రకరకాల బిస్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. అయితే బిస్కెట్ల తయారీలో మైదా యాడ్‌ అవుతుంటుంది. దీని వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. అయితే మీరు సూపర్‌ మార్కెట్లో గానీ, ఇతర షాపుల్లో బిస్కెట్లు లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వాటిని గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరో చెప్పినదానికంటే ఆ ప్యాకెట్‌పై వివరాలను ఒకసారి చెక్‌ చేసుకోవాలి. బిస్కెస్‌ ప్యాకెట్‌ తీసుకున్నామంటే ఆ బిస్కెట్లలో ఏయే పదార్థాలు కలిశాయో వివరాలు ఉంటాయి.

ఎప్పుడైనా మీరు ఖరీదైన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను కొనుగోలు చేసినప్పుడు, వాటిలో వాడైనా పదార్థాలను చెక్ చేయడం మర్చిపోవద్దు. చాలా వరకు ఫుడ్ ప్రోడక్ట్స్ ఆరోగ్యకరమైనవిగా చెబుతుంటారు. కానీ నిజానికి అలా ఉండవు. కొన్ని ప్రోడక్ట్స్ అధిక ఫైబర్ కలిగి ఉన్నాయని ప్రచారం చేస్తూ మనల్ని ఆకర్షిస్తాయి. ఇందులో ఒమేగా 3 ఉందని కొన్ని ప్రోడక్ట్స్ చెబుతాయి. హెల్దీ ప్రోడక్ట్స్ అని చెప్పుకునే ఇవి సాధారణ ప్రోడక్ట్స్ కంటే రెండు లేదా మూడు రెట్లు ఖరీదైనవిగా ఉటాయి. తక్కువ చక్కెర, ఉప్పు, కొవ్వు – క్యాలరీ వివరాలు రేపర్ వెనుక భాగంలో ప్రింట్ అయి ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ బజ్రా, క్వినోవా, ఓట్స్ వంటి ఫ్యాన్సీ పేర్లను ప్రింట్ చేస్తాయి కానీ ప్రోడక్ట్స్ లో ఇవి ఎంత పరిమాణంలో ఉన్నాయి అనేదానికి మనం లేబులింగ్‌పై చెక్ చేయవచ్చు.

కొన్నిసార్లు డార్క్ చాక్లెట్ గుండెకు మంచిదనే వాదనతో అమ్ముతారు. కొన్నిసార్లు సోయా మిల్క్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ప్రయోజనకరమైనదని చెబుతూ సోయా పాలను అమ్మేస్తారు. అయితే అసలు ఈ ప్రోడక్ట్స్ కి ఉన్న లక్షణాలుగా చెబుతున్న వాటితో సరితూగుతాయా? భారతదేశంలో ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల అమ్మకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అవెండస్ క్యాపిటా నివేదిక ప్రకారం, 2026 నాటికి, ఆరోగ్యకరమైన ఆహారాలపై భారతీయుల తలసరి వ్యయం రెట్టింపు అవుతుంది. 2020లో, దేశంలోని 88 బిలియన్ డాలర్ల ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ బెవరేజీ మార్కెట్‌లో హెల్త్ సెంట్రల్డ్ ఫుడ్ అండ్ బేవరేజెస్ 11 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2026 నాటికి ఇది 16 శాతానికి పెరుగుతుందని అంచనా. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం కోసం మార్కెట్ 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు. 20 శాతం CAGRతో, భారతదేశం ప్రపంచంలోనే ఆరోగ్యకరమైన ఆహారం కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ గా ఉంది.

ఇవి కూడా చదవండి

2026 నాటికి, భారతదేశంలో ఆరోగ్య స్పృహ కలిగిన వినియోగదారుల సంఖ్య 176 మిలియన్లకు పెరగవచ్చు. బిస్కెట్లు, ఫ్రూట్ స్నాక్స్, స్నాక్ బార్‌లు వంటి హెల్తీ స్నాక్స్ అని పిలవబడే వాటి అమ్మకాలు ఊపందుకోనున్నాయి. ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తుల మార్కెట్ కూడా చాలా వేగంగా పెరుగుతుందని అంచనా.

ఈ పెరుగుతున్న మార్కెట్‌తో ఆరోగ్యకరమైన ఆహారం అని పిలవబడే మార్కెటింగ్ – ప్రకటనలు కూడా పెరుగుతాయి. ఈ ఉత్పత్తుల వాస్తవికతను దాచిపెట్టి వినియోగదారులను మోసం చేసేందుకు ఈ ప్రకటనలు ఉపయోగపడుతున్నాయి. అందువల్ల, షాప్ కీపర్లు అటువంటి ఉత్పత్తులను వినియోగదారులకు సులభంగా విక్రయించగలుగుతారు

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఆహారం – పానీయాల వస్తువులను నియంత్రిస్తుంది. ఆహార భద్రతపై కూడా అధికార యంత్రాంగం దృష్టి సారిస్తోంది. అయినప్పటికీ, అటువంటి ఉత్పత్తులు నిర్లక్ష్యంగా మార్కెట్ అవుతున్నాయి. ఖరీదైన వస్తువులు చాలా ఆరోగ్యకరమైనవి అని ప్రకటించి అమ్మేస్తున్నారు. FSSAI గత ఏడాది ఈ ఉత్పత్తులు ఎంత ఆరోగ్యకరమో వినియోగదారులకు తెలియజేయడానికి రేటింగ్ తీసుకురావాలని ప్రతిపాదించింది. కంపెనీలు ఉప్పు, చక్కెర – కొవ్వు పరిమాణం ఆధారంగా 1 నుంచి 5 స్కేల్‌లో అటువంటి ఉత్పత్తులను రేట్ చేస్తాయి. మీరు ఈ రేటింగ్‌ను ఉత్పత్తి ప్యాకెట్‌లో చూస్తారు. అయితే ఈ ప్రతిపాదనపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అందువల్ల, FSSAI మరికొన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. అధికార యంత్రాంగం వీలైనంత త్వరగా ఈ రేటింగ్ విధానాన్ని అమలు చేయాలి.

మీరు ఈసారి ఏదైనా ఆరోగ్యకరమైన బిస్కెట్, బ్రెడ్ షుగర్‌లెస్ డ్రింక్ లేదా వంట కోసం నూనెను కొనుగోలు చేసినప్పుడు, దాని లేబులింగ్‌ని చెక్ చేయండి. మన బిజీ లైఫ్‌లో, మనందరికీ తక్కువ టైం దొరుకుతుంది. దీంతో మనం షాప్ కి వెల్లినవెంటనే ‘హెల్తీ’ అనే ట్యాగ్‌ని చూసి వస్తువులను కొనుగోలు చేస్తాము. కానీ మీరు ఎక్కువ చెల్లిస్తున్న వస్తువు నిజంగా అంత విలువైనదేనా? ఎందుకంటే కంపెనీలు ప్రోడక్ట్స్ విషయంలో ఒకరకంగా చెబుతాయి.. మరో రకంగా ప్రోడక్ట్ ని అందిస్తాయి. కాబట్టి లేబుల్ చదవండి, లేకుంటే మీరు ఓట్స్ పేరుతో వట్టి పిండిని తింటారు అది కూడా పిండి తినడానికి అవసరమైన దానికన్నా చాలా ఎక్కువ డబ్బులు చెల్లించి.. అంటే మీరు మీ జేబులు గుల్ల చేసుకుంటారు.. అనారోగ్యాన్ని ఎక్కువ ఖరీదుకు కొని తెచ్చుకుంటారు. అందువల్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి