AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jewellery: బంగారు అభరణాలు ఒరిజినలా? నకిలీవా ? మీ ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి!

ఈ మధ్య కాలంలో అసలు కంటే నకిలీ వ్యాపారం మరింతగా పెరిగిపోతోంది. ఎలాంటి అనుమానం రాకుండానే నకిలీ వస్తువులను ఒరిజినల్‌గా తయారు చేసి అమాయకులను నిలువునా మోసగిస్తున్న సంఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోల్‌గోల్డ్‌ కూడా అచ్చం అసలు బంగారం లాగానే ఉంటున్నాయి. ఇక్కడ జరిగిన ఓ మోసం

Jewellery: బంగారు అభరణాలు ఒరిజినలా? నకిలీవా ? మీ ఇంట్లోనే ఇలా సులభంగా గుర్తించండి!
Jewellery
Subhash Goud
|

Updated on: Jun 12, 2024 | 7:19 PM

Share

ఈ మధ్య కాలంలో అసలు కంటే నకిలీ వ్యాపారం మరింతగా పెరిగిపోతోంది. ఎలాంటి అనుమానం రాకుండానే నకిలీ వస్తువులను ఒరిజినల్‌గా తయారు చేసి అమాయకులను నిలువునా మోసగిస్తున్న సంఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోల్‌గోల్డ్‌ కూడా అచ్చం అసలు బంగారం లాగానే ఉంటున్నాయి. ఇక్కడ జరిగిన ఓ మోసం గురించి తెలిస్తే బిత్తరపోతారు. రాజస్థాన్ లోని జైపూర్‌లో మోసం ఓ కేసు వెలుగు చూసింది. నగరంలోని ఓ స్వర్ణకారుడు రూ.300 విలువైన ఆభరణాలను అమెరికా మహిళకు రూ.6 కోట్లకు విక్రయించాడు.

సదరు మహిళ తన దేశంలో ఒక ప్రదర్శనలో ఈ ఆభరణాలను ప్రజలకు చూపించినప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. యుఎస్ ఎంబసీ జోక్యంతో ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించబడింది. విచారణలో వాటి అసలు ధర రూ.300 అని తేలింది. తీరా ఆ మహిళ తాను దారుణంగా పోసపోయానని తెలుసుకుందాం. ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి. అందుకే  ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. బంగారం, నగలు కొనుగోలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే నిలువునా మోసపోయే ప్రమాదం ఉంది. మరి నకిలీ బంగారం, అభరణాలను ఎలా గుర్తించాలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంట్లోనే ఉండి కూడా మీ నగలు ఒరిజినలా, అవి నకిలీవా? అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచోచ్చు.

ఇంట్లోనే కూర్చుని నకిలీ అభరణాలను గుర్తించండి

మీరు కూడా బంగారం కొనుగోలు చేయబోతున్నట్లయితే, అసలు, నకిలీ బంగారాన్ని ఎలా గుర్తించాలో మీరు తెలుసుకోవాలి. కల్తీ, నకిలీ బంగారాన్ని కూడా మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఆభరణాలపై హాల్‌మార్క్ మార్క్ ఉంది. ఇది స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు చాలా మంది ఆభరణాలపై నకిలీ హాల్‌మార్క్ వేస్తున్నారు. అమెరికా మహిళ విషయంలోనూ అదే జరిగింది. అందువల్ల బంగారాన్ని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, ఇంట్లో ఉంచిన బంగారం స్వచ్ఛతను కూడా మీరు సులభంగా తెలుసుకోవచ్చు. బంగారం స్వచ్ఛతను తనిఖీ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే మీరు ఇంట్లో కూర్చొని సులువుగా ప్రయత్నించే పద్ధతులను తెలుసుకుందాం.

బంగారంపై కొన్ని చుక్కల వెనిగర్ వేసి కొన్ని నిమిషాల తర్వాత జాగ్రత్తగా చూడండి. బంగారం రంగులో మార్పు రాకపోతే అది స్వచ్ఛమైన బంగారం అని అర్థం. నకిలీ బంగారం వెనిగర్‌తో కలిసిన వెంటనే నల్లగా మారుతుంది. అయస్కాంతాలను ఉపయోగించి నిజమైన, నకిలీ బంగారాన్ని కూడా గుర్తించవచ్చు. బంగారం అయస్కాంతాలకు అంటుకోదు. మీ బంగారం అయస్కాంతానికి అంటుకుంటే అది నకిలీదని అర్థం చేసుకోండి. మీరు ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బంగారాన్ని జోడించి కూడా ప్రయత్నించవచ్చు. బంగారం త్వరగా మునిగితే అది నిజమే కావచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి