AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Debit Card: మీరు డెబిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

గత కొన్నేళ్లుగా డెబిట్ కార్డు మోసాలు పెరుగుతున్నాయి. ఫిజికల్ బ్యాంకింగ్ ప్రపంచానికి దూరమై డిజిటల్ బ్యాంకింగ్ వైపు మళ్లుతున్న కొద్దీ సైబర్ క్రైమ్ పెరుగుతోంది.

Debit Card: మీరు డెబిట్ కార్డు ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..
Debit Card
Srinivas Chekkilla
|

Updated on: Dec 25, 2021 | 3:45 PM

Share

గత కొన్నేళ్లుగా డెబిట్ కార్డు మోసాలు పెరుగుతున్నాయి. ఫిజికల్ బ్యాంకింగ్ ప్రపంచానికి దూరమై డిజిటల్ బ్యాంకింగ్ వైపు మళ్లుతున్న కొద్దీ సైబర్ క్రైమ్ పెరుగుతోంది. ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు, డెబిట్ కార్డ్‌లను యుటిలిటీ బిల్లులు చెల్లించడం, POS లావాదేవీలు ఎక్కువగా చేస్తున్నారు.

డెబిట్ కార్డు మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుంద్దాం. డెబిట్ కార్డులను నగదు వలె సురక్షితంగా ఉంచాలని బ్యాంక్ బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి అన్నారు. డెబిట్ కార్డ్ పాస్‌వర్డ్, CVV రాసిపెట్టుకుని ఎప్పుడూ ఉంచుకోవద్దన్నారు. పాస్‎వర్డ్ ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పారు.

బ్రాండెడ్, విశ్వసనీయ వ్యాపారులు ఉన్న ప్రదేశాలలో మాత్రమే డెబిట్ కార్డ్‌ని ఉపయోగించండి. మీ కార్డ్‌లో ఏదైనా లావాదేవీ జరిగినట్లయితే, నిశితంగా గమనించండి.

మీరు మీ డెబిట్ కార్డ్‌తో ATM లావాదేవీలు చేస్తే, అపరిచితుల సహాయం ఎప్పుడూ తీసుకోకండి. అలాగే, లావాదేవీ పూర్తయిన తర్వాత, ATM మెషీన్ ప్రక్రియ ముగిసే వరకు వేచి ఉండండి. ఒకే కార్డు లేదా బ్యాంకు ఖాతాలో మొత్తం డబ్బును ఎప్పుడూ ఉంచవద్దని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.

జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదైనా మోసం జరిగినట్లయితే, ముందుగా దాని గురించి బ్యాంకుకు తెలియజేయండి. కార్డును బ్లాక్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయండి. అటువంటి సందర్భాలలో, నేరుగా సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. అది మీ తప్పు కాకపోతే, ఏదైనా మోసం జరిగితే.. మీరు బ్యాంకు నుంచి డబ్బును తిరిగి పొందుతారు.

Read Also.. Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..!