AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Tips: ముందు జాగ్రత్తతో ముప్పు నుంచి రక్షణ.. వర్షాకాలంలో ద్విచక్రవాహనదారులు ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

ఇటీవల కాలంలో ప్రతి ఇంటికి ఓ ద్విచక్రవాహనం ఉండడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా ప్రజారవాణా సౌకర్యాలు తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న పనికి బయటకు వెళ్లాలన్నా బైక్‌ లేదా స్కూటర్‌ అవసరం అవుతుంది. అయితే వీటి వాడకం ఎలా ఉన్నా నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులుపడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే వర్షాకాలంలో బైక్‌ లేదా స్కూటర్‌ నిర్వహణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? తెలుసుకుందాం.

Bike Tips: ముందు జాగ్రత్తతో ముప్పు నుంచి రక్షణ.. వర్షాకాలంలో ద్విచక్రవాహనదారులు ఈ చిట్కాలు పాటించాల్సిందే..!
Monsoon
Nikhil
|

Updated on: May 28, 2025 | 3:37 PM

Share

వర్షంలో రైడింగ్ చేయడం చాలా మందికి థ్రిలింగ్‌గా ఉంటుంది. అయితే రెగ్యులర్‌గా బైక్‌ నడిపేవారు వర్షంలో రైడింగ్‌ అంటే ఆందోళకు గురవుతూ ఉంటారు. వర్షాకాలంలో రోడ్లు తడిచి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా బండి తోలకపోతే జారిపడే ప్రమాదం ఉంటుంది. వర్షంలో రైడింగ్‌ అనేది చాలా మంది రైడర్లకు ఒక పీడకల.ఈ నేపథ్యంలో వర్షాకాలం దగ్గర పడుతున్నందున వర్షాలకు మీ మోటార్ సైకిల్‌ పాడవకుండా సిద్ధంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో? ఓసారి తెలుసుకుందాం.

టైర్ల తనిఖీ 

వర్షకాలానికి ముందు మన వాహన టైర్లను తనిఖీ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టైర్లు అరిగిపోయి ఉంటే మాత్రం వెంటనే కొత్త టైర్లను వేసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో రోడ్లపై మంచి గ్రిప్‌తో కూడిన రైడింగ్‌ చేయాలంటే టైర్లు ఫిట్‌గా ఉండాలి. అలాగే బైక్‌ టైర్స్‌కు పడిని ప్యాచ్‌లు లీకవుతుందో? లేదో? తనిఖీ చేయాలి. 

బైక్‌ చైన్‌

వర్షాకాలంలో మోటార్ సైకిళ్లువాటి ఓపెన్ మెకానిజం కారణంగా చాలా నీరు చిమ్మడం, బురద వంటివి చైన్ లూబ్‌ లేకుండా  చేస్తాయి. దీని వల్ల చైన్ తుప్పు పట్టే అవకాశం ఉంది. అలాగే సాధారణం కంటే ఎక్కువ అరిగిపోయే అవకాశం కూడా ఉంది. అందువల్ల సమయానుగుణంగా చైన్‌ తనిఖీ చేయడంతో పాటు వారానికి ఒకసారి శుభ్రం చేసి ఆయిలింగ్‌ చేసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

బ్రేక్ల పనితీరు

సురక్షితమైన డ్రైవింగ్ విషయానికి వ స్తే మీ బైక్ బ్రేక్లు చాలా ముఖ్యమైన భాగాల్లో ఒకటిగా ఉంటుంది. ఏ పరిస్థితిలోనైనా రైడరుకు బైక్‌పై పూర్తి నియంత్రణను ఇస్తాయి. వర్షాల సమయంలో బ్రేకింగ్ సామర్థ్యం తగ్గుతుంది. అలాగే తడిగా ఉన్న రోడ్డుపై బ్రేక్‌లు సరిగ్గా పడకపోతే స్కిడ్‌ అయి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సమర్థవంతమైన బ్రేకింగ్‌ కావాలంటే బ్రేక్ ప్యాడ్లు, డిస్క్‌లు, డ్రమ్ బ్రేక్‌లు, బ్రేకింగ్ సిస్టమ్‌లోని ఇతర భాగాలకు నష్టం వాటిల్లిందేమో? అని తనిఖీ చేయాలి. ఏదైనా అసాధారణమైన లేదా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే దాన్ని పరిష్కరించాలి.

లైట్ల తనిఖీ

వర్షం రోడ్డుపై దృష్టిని పరిమితం చేస్తుంది. అందువల్ల వర్షం సమయంలో హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, డీఆర్‌ఎల్‌, టర్న్ ఇండికేటర్లు రైడర్లకు, ఇతర రోడ్డు వినియోగదారులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వర్షాకాలం ముందు హెడ్ల్యాంప్, టెయిల్ లైట్, ఇండికేటర్లు, హజార్డ్ లాంప్‌లు సరిగ్గా ఉన్నాయో? లేదో? తనిఖీ చేయాలి.