AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: నెలకి రూ. 10 వేల పొదుపుతో కోటీశ్వరులు కావచ్చా?.. ఇన్వెస్టర్లకు ఆదిత్య బిర్లా గుడ్ న్యూస్

పెట్టుబడి అంటేనే చాలా మందికి ఒక పెద్ద సవాల్‌గా అనిపిస్తుంది, ముఖ్యంగా తక్కువ మొత్తాలతో భారీ సంపదను సృష్టించడం అసాధ్యం అనుకుంటారు. అయితే, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ అందించిన ఒక ఆసక్తికరమైన అధ్యయనం ఈ ఆలోచనను పూర్తిగా మార్చేస్తోంది. దశాబ్దాలుగా ఆర్థిక రంగంలో సుస్థిరమైన స్థానాన్ని కలిగి ఉన్న ఈ సంస్థ, తమ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ ద్వారా కేవలం నెలకు రూ. 10,000 పెట్టుబడితో 25 సంవత్సరాల్లో రూ. 1.6 కోట్లకు పైగా సంపదను ఎలా సృష్టించవచ్చో వెల్లడించింది. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకొని స్థిరమైన రాబడులను అందించే ఈ ఫండ్ ప్రత్యేకతలు, పనితీరు అది పెట్టుబడిదారులకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Mutual Funds: నెలకి రూ. 10 వేల పొదుపుతో కోటీశ్వరులు కావచ్చా?.. ఇన్వెస్టర్లకు ఆదిత్య బిర్లా గుడ్ న్యూస్
Adithya Birla Mutual Fund Investment
Bhavani
|

Updated on: May 28, 2025 | 12:00 PM

Share

కేవలం నెలకు పది వేల రూపాయల పెట్టుబడితో ఏకంగా కోటిన్నరకు పైగా సంపదను సృష్టించడం సాధ్యమేనా? ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ విషయంలో ఇది నిజమైంది. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ సంస్థ, పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడులను అందించడంలో తన నిబద్ధతను చాటుకుంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ సన్ లైఫ్ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇంక్ వంటి దిగ్గజ సంస్థల మద్దతుతో, భారతీయ ట్రస్టుల చట్టం 1882 ప్రకారం రిజిస్టర్ అయి, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్స్‌కు పెట్టుబడి సలహాదారుగా పనిచేస్తోంది.

నెలవారీ పొదుపుతో భారీ లాభం

ఇటీవల నిర్వహించిన ‘వెల్త్ క్రియేషన్ స్టడీ’ ప్రకారం, వారి బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఎంత పటిష్టంగా ఉందో వెల్లడైంది. ఈ ఫండ్‌లో నెలవారీ రూ. 10,000 సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా 25 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా రూ. 1.6 కోట్లకు పైగా రాబడి లభించింది. ఈ కాలంలో ఈ ఫండ్ 11.7% సంచిత వార్షిక వృద్ధి రేటు సాధించిందని అధ్యయనం స్పష్టం చేసింది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడుల విలువను ప్రస్పుటం చేస్తుంది.

మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య స్థిరమైన పనితీరు

ఈ ఫండ్, ఈక్విటీ మార్కెట్లలోని అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, తక్కువ అస్థిరతతో రాబడులను కోరుకునే పెట్టుబడిదారులకు అనుకూలంగా రూపొందించబడింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పెట్టుబడుల మధ్య నిధులను డైనమిక్‌గా సర్దుబాటు చేసే ప్రత్యేక నమూనాతో ఇది పనిచేస్తుంది. దీని డైనమిక్ అసెట్ అలోకేషన్ మోడల్ మార్కెట్ విలువలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను తగ్గించి, పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోను రక్షిస్తుంది.

చారిత్రాత్మక డేటాను పరిశీలిస్తే, మార్కెట్ పతనాలను సమర్థవంతంగా ఎదుర్కొని, ఇతర మార్కెట్ల కంటే వేగంగా పుంజుకోవడం ఈ ఫండ్ ప్రత్యేకత. నష్టాల నుంచి పెట్టుబడిదారులకు స్థిరమైన రక్షణ కల్పించడం ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. 2015 తర్వాత, సగటున 52% నికర ఈక్విటీ ఎక్స్‌పోజర్ ఉన్నప్పటికీ, నిఫ్టీ రిటర్న్స్‌లో 80% వరకు రాబడిని అందించడంలో ఈ ఫండ్ సక్సెస్ అయింది.

25 ఏళ్ల మైలురాయి..

ఫండ్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ABSLAMC MD & CEO, ఎ. బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ, “మా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ 25 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడం అనేది కేవలం పనితీరుకు సంబంధించిన మైలురాయి మాత్రమే కాదు, ఇది మా పెట్టుబడిదారుల అపారమైన విశ్వాసానికి, మా బృందం నిబద్ధతకు నిదర్శనం” అని అన్నారు. మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా, పెట్టుబడిదారులకు తక్కువ అస్థిరతతో సహేతుకమైన రాబడులను అందించడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ ఫండ్, నాణ్యమైన పోర్ట్‌ఫోలియో నిర్వహణకు కట్టుబడి, వివిధ రంగాలు మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్‌లలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెడుతుంది. పెట్టుబడిదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ABSLAMC నిరంతరం కృషి చేస్తోంది. మార్కెట్ ట్రెండ్‌లు ఎలా ఉన్నా (బుల్ మార్కెట్ అయినా, బేర్ మార్కెట్ అయినా) తమపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క పెట్టుబడిదారునికి, భాగస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం, హరీష్ కృష్ణన్, లవ్లీష్ సోలంకి, మోహిత్ శర్మ ఈ ఫండ్‌ను సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. 2025 ఏప్రిల్ 30 నాటికి, ఈ ఫండ్ నిర్వహణలో రూ. 7,500 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.