AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారెవ్వా.. ఇంట్లో కూర్చొనే నెలకు రూ. 17,500 సంపాదన.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఇంట్లో కూర్చొని కూడా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. రూ.లక్ష రూపాయల పెట్టుబడి మీకు ప్రతి నెలా 17,500 రూపాయల వరకు ఆదాయాన్ని ఇస్తుంది. ఏకంగా 30 సంవత్సరాలు మీరు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ గొప్ప పెట్టుబడి మార్గం యొక్క పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

వారెవ్వా.. ఇంట్లో కూర్చొనే నెలకు రూ. 17,500 సంపాదన.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Turn Rs 1 Lakh Into Rs 63 Lakhs
Krishna S
|

Updated on: Sep 01, 2025 | 9:19 PM

Share

చాలామంది ప్రజలు తక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అనుకుంటారు. కానీ ఆర్థిక నిపుణులు ఈ ఆలోచనను పూర్తిగా మార్చేస్తున్నారు. కేవలం రూ.1 లక్ష ఏకమొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే అది దీర్ఘకాలంలో కోట్లాది రూపాయల సంపదగా మారడమే కాకుండా ప్రతి నెలా ఒక స్థిరమైన ఆదాయాన్ని కూడా అందిస్తుందని చెబుతున్నారు.

రూ.లక్ష పెట్టుబడితో రూ.17,500 నెలవారీ ఆదాయం..?

మీరు ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో రూ.1 లక్షను ఒకేసారి పెట్టుబడి పెట్టి దానిపై సగటున 12శాతం వార్షిక రాబడిని పొందుతారని అనుకుందాం. 30 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం సుమారుగా రూ.30 లక్షల వరకు పెరుగుతుంది. పన్నులు పోగా మీకు దాదాపు రూ.26.5 లక్షలు మిగులుతాయి. ఈ మొత్తాన్ని సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా హైబ్రిడ్ లేదా డెట్ ఫండ్స్‌కు బదిలీ చేస్తారు. ఈ ఫండ్స్ సాధారణంగా సురక్షితమైనవి. దాదాపు 7శాతం రాబడిని అందిస్తాయి. ఈ ప్లాన్ ద్వారా మీరు మీ మొత్తం నుంచి 30 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.17,500 విత్ డ్రా చేసుకోవచ్చు. మొత్తంగా మీరు రూ.లక్ష పెట్టుబడి నుండి సుమారుగా రూ.63 లక్షలు పొందుతారు. ఈ విధానం చిన్న మొత్తాలను కూడా దీర్ఘకాలంలో ఎంత శక్తివంతంగా మార్చగలదో స్పష్టంగా తెలియజేస్తుంది.

పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం..?

పెట్టుబడి పెట్టడానికి ఎప్పుడూ ఒక నిర్దిష్ట సమయం అంటూ ఉండదు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో, ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లో మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెడితే, మీ డబ్బు అంత వేగంగా పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం కాంపౌండింగ్ సూత్రం. దీని ప్రకారం మీరు మీ పెట్టుబడిపై వచ్చే రాబడికి కూడా ఆదాయాన్ని పొందుతారు. దీనివల్ల మీ సంపద గణనీయంగా పెరుగుతుంది.

SIP vs. లంప్సమ్: తేడా ఏమిటీ?

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి రెండు సాధారణ మార్గాలు ఉన్నాయి.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్: దీనిలో మీరు ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెడతారు. ఇది క్రమశిక్షణతో కూడిన పెట్టుబడికి సహాయపడుతుంది. మార్కెట్ ఒడిదుడుకులను సమతుల్యం చేస్తుంది.

లంప్సమ్ ఇన్వెస్ట్‌మెంట్: దీనిలో మీరు ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెడతారు. మార్కెట్ తక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి లాభదాయకంగా ఉంటుంది.

ఈ పద్ధతితో ఆర్థిక భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా, ఒక చిన్న పెట్టుబడితో కూడా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..