Gold Sales: బంగారం, వెండి విక్రయాల్లో మోసాలకు చెక్.. ప్రభుత్వ నుంచే డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు.. వివరాలు ఇవి
బంగారంపై పెట్టిన పెట్టుబడికి స్థిరంగా ఆదాయం వస్తుందన్న నమ్మకం మార్కెట్ వర్గాల్లో ఏర్పడింది. గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టే బదులు సురక్షితమైన బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేందుకు అందరూ మొగ్గుచూపుతున్నారు.
మన దేశంలో బంగారానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఏ శుభకార్యమైన మొదట కొనుగోలు చేసే బంగారాన్నే. ఇక అక్షయ తృతీయ వంటి రోజుల్లో అయితే కనీసం ఒక గ్రామైన బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తారు. అలాగే బంగారాన్ని చాలా మంది పెట్టుబడి మార్గంగా కూడా చూస్తున్నారు. బంగారంపై పెట్టిన పెట్టుబడికి స్థిరంగా ఆదాయం వస్తుందన్న నమ్మకం మార్కెట్ వర్గాల్లో ఏర్పడింది. అందుకే బంగారం లేదా వెండి నాణేలను కొనుగోలు చేయడానికి పెట్టుబడి దారులు ఆసక్తి కనబరుస్తున్నారు. గత కొన్నేళ్లుగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టే బదులు సురక్షితమైన బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేందుకు అందరూ మొగ్గుచూపుతున్నారు.
ప్రస్తుతం దేశంలో బంగారం, వెండిని కొనుగోలు చేయడానికి అనేక రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కొందరు నేరుగా బంగారు దుకాణాలకు వెళ్ళి వారికి నచ్చిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఉండగా, మరికొందరు ఆన్ లైన్ ద్వారా వారికి నచ్చిన ఆభరణాలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని బంగారు దుకాణదారులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హాల్ మార్క్ ఉన్న ఆభరణాలను లేదా కాయిన్స్ ను విక్రయిస్తూ ఉండగా, మరికొందరు మాత్రం బీఐఎస్ హాల్ మార్క్ లేని బంగారు ఆభరణాలను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. దీనిని అరికట్టడానికి, అలాగే బంగారం, వెండి కొనుగోలును సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం ఒక ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వమే బంగారం, వెండిని విక్రయిస్తోంది. నేరుగా ప్రజలే ఇప్పుడు బంగారం వెండిని కొనుగోలుచయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
మింట్ ద్వారా విక్రయాలు..
ప్రజలే నేరుగా బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇండియన్ గవర్నమెంట్ మింట్ ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ప్రజలు వారి స్తోమతకు తగ్గట్టుగా 2.5 గ్రాములు, 5 గ్రాములు, 8 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు వంటి డినామినేషన్లలో బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయవచ్చు.
ఐదు నగరాల్లో అవుట్ లెట్లు..
భారతదేశంలోని ఐదు నగరాల్లో ఉన్న మింట్ సేల్స్ అవుట్ లెట్ లను సందర్శించడం ద్వారా బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయవచ్చు. ఈ ఐదు నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, నోయిడా, కోల్ కత్తా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ నగరాలకు చెందిన వారు కాకపోతే, అప్పుడు ఆన్ లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ మింట్ కి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, అక్కడ నుంచి మీకు నచ్చిన డినామినేషన్లలో బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయవచ్చు.
India Government Mint Wishes you a very happy Akshaya Tritya. On this auspicious day of Akshaya Tritiya, don’t forget to purchase some gold and pray to Lord Vishnu.
Buy now- https://t.co/DcRBC0Ukya#akshayatritiya #BuyGold #auspacious pic.twitter.com/V0HJYLKHLm
— India Government Mint (@SPMCILINDIA) April 22, 2023
99.9శాతం స్వచ్ఛతతో..
కొనుగోలుదారులు తమ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ లేదా నగదు వంటి వివిధ రకాల చెల్లింపు ఆప్షన్ లను ఉపయోగించి బంగారం, వెండి నాణేలను కొనుగోలు చేయవచ్చునని ఇండియన్ గవర్నమెంట్ మింట్ తెలిపింది. ఇండియన్ గవర్నమెంట్ మింట్ లో ముద్రించి విక్రయించే నాణేలు బీఐఎస్ హాల్ మార్క్ ను కలిగి ఉంటాయని, ఈ నాణేలు 24 క్యారెట్ల బంగారం, 99.9 శాతం స్వచ్ఛంగా ఉంటాయని భారత ప్రభుత్వ మింట్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..