AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver GST: వెండిపై జీఎస్టీ బాదుడు.. అసలు ఎంత చెల్లించాలో తెలుసా?

భారతీయ సంప్రదాయాలలో బంగారంతో వెండి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పండుగల సమయంలో ప్రజలు తమ పూజ గదిలో వెండితో తయారు చేసిన వస్తువులను ఉంచేందుకు ఇష్టపడతారు. అలాగే చాలా మంది వెండితో తయారు చేసిన వస్తువులను బహుమతిగా ఇస్తారు. దేశంలో వెండి సాంస్కృతిక, భావోద్వేగ విలువలను కలిగి ఉన్నందున భారతదేశంలో వెండి కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన పన్ను నియమాలు తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Silver GST: వెండిపై జీఎస్టీ బాదుడు.. అసలు ఎంత చెల్లించాలో తెలుసా?
Silver
Nikhil
|

Updated on: Jun 22, 2025 | 1:06 PM

Share

వెండి ఆభరణాలు తయారీ, అమ్మకం రెండింటిలోనూ వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం వెండి విలువపై 3 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. అలాగే ఆభరణాల తయారీ ఛార్జీలు అదనంగా 18 శాతం జీఎస్టీను విధిస్తారు. అయితే విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి జీఎస్టీ కౌన్సిల్ బంగారం, వెండి, ప్లాటినం ఎగుమతులపై జీఎస్టీను మాఫీ చేసింది. వెండిని దీర్ఘకాలిక పెట్టుబడికి ఆచరణాత్మకమైన, సరసమైన ఎంపికగా చూస్తారు. దీని విలువ కాలక్రమేణా పెరుగుతుంది. మీరు మీ డబ్బును వెండిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే కొన్ని ప్రత్యేక పథకాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణుల సూచిస్తున్నారు. 

వెండి ఆభరణాలు

వెండి ఆభరణాలను కొనడం కేవలం స్టైల్ కోసం మాత్రమే కాదు. ఇది మీకు భౌతిక ఆస్తిని కూడా కలిగి ఉండడానికి అనుమతిస్తుంది. నాణ్యత బాగుందని నిర్ధారించుకోవడం ఉత్తమం. అయితే వెండిని కొనుగోలు చేసేటప్పుడు 925 స్టాంప్ కోసం చూడాలని, ఈ స్టాంప్ ఉంటే స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. దీనిని స్టెర్లింగ్ వెండి అని కూడా పిలుస్తారు.

వెండి నాణేలు లేదా కడ్డీలు 

మీరు సరళమైన పెట్టుబడి మార్గాన్ని కోరుకుంటే వెండి నాణేలు, కడ్డీలు మంచి ఎంపిక. అవి బ్యాంకులు, అధీకృత విక్రేతల వద్ద అందుబాటులో ఉన్నాయి. వాటికి ఆభరణాల వంటి తయారీ ఛార్జీలు ఉండవు. 

ఇవి కూడా చదవండి

ఈ-సిల్వర్

వెండిలో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక డిజిటల్ మార్గం. మీరు దానిని భౌతికంగా నిల్వ చేయడం లేదా తయారీ ఛార్జీలు చెల్లించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అనుకూలమైన, ఆధునిక పెట్టుబడి ఎంపిక.

సిల్వర్ ఈటీఎఫ్‌లు

సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) కూడా ఒక ప్రసిద్ధ ఎంపిక. ఈ ఫండ్‌లు తమ డబ్బులో ఎక్కువ భాగాన్ని కనీసం 95 శాతం భౌతిక వెండి లేదా సంబంధిత సాధనాలలో పెట్టుబడి పెడతాయి. ఈ ఈటీఎఫ్‌ల విలువ వెండి మార్కెట్ ధరతో మారుతుంది. ఇది స్టాక్ మార్కెట్ ద్వారా సులభంగా కొనుగోలు లేదా అమ్మకాన్ని అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..