AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకే రైట్ రైట్.. పెట్రోలు, డీజిల్ వెర్షన్లు ఇక మూలకే..!

ఆధునిక కాలంలో ద్విచక్ర వాహనం ప్రతి ఒక్కరికీ కనీస తప్పనిసరిగా మారింది. తమ అవసరాల కోసం అందరూ వినియోగించాల్సిన అవసరం ఏర్పడింది. చదువు కొంటున్న మేజర్లయిన పిల్లలు, ఉద్యోగం చేసే పురుషులు, మహిళలతో పాటు వ్యాపారం చేసుకునే వారందరూ ద్విచక్ర వాహనాలను వాడుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది.

Electric vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకే రైట్ రైట్.. పెట్రోలు, డీజిల్ వెర్షన్లు ఇక మూలకే..!
Ev
Nikhil
|

Updated on: Jun 22, 2025 | 1:30 PM

Share

ఇటీవల కాలంలో సంప్రదాయ పెట్రోలు వాహనాలతో పోల్చితే ఈవీ కొనుగోలు చేసేవారు ఇటీవల విపరీతంగా పెరిగారు. సంప్రదాయ వాహనాలతో పోల్చితే వీటికి నిర్వహణ ఖర్చు బాగా తక్కువగా ఉండమే కారణం. సీఈఈడబ్బ్యూ అనే సంస్థ ఇటీవల చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) ఇటీవల ఒక అధ్యయనం చేసింది. సంప్రదాయ వాహనాల నిర్వహణ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అవుతున్న ఖర్చును లెక్కించింది. టూ వీలర్స్ తో పాటు త్రీ వీలర్స్ నిర్వహణ ఖర్చును కూడా ఆరా తీసింది. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ వాహనాలకన్నా ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణకు అయ్యే యాజమాన్య ఖర్చు (టీఓసీ) చాలా తక్కువగా ఉంటునట్టు వెల్లడైంది.

సీఈఈడబ్బ్యూ నివేదిక ప్రకారం.. మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ప్రజలకు చాలా ప్రయోజనం కలుగుతుంది. ద్విచక్ర వాహనాల విభాగంలో పెట్రోలు నడిచే వాహనాలకు కిలోమీటర్ కు రూ.2.46 ఖర్చవుతుండగా, ఎలక్ట్రిక్ వాహనానికి కేవలం రూ.1.48 మాత్రమే అవుతోంది. ఇక త్రీ వీలర్ల విషయానికి వస్తే పెట్రోలు వాహనాలకు రూ.3.21 ఖర్చవుతుంటే, ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం రూ.1.28 ఖర్చు చేస్తే సరిపోతుంది.

మన దేశంలో ఎక్కువమంది ప్రజలు పేద, మధ్యతరగతి వారే. వీరికి అతి తక్కువ నిర్వహణ వ్యయం కలిగిన వాహనాలతో ప్రయోజనం చేకూరుతుంది. దీంతో పెట్రోలు, డీజిల్ వాహనాలకంటే ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పైగా వీటి వల్ల పర్యావరణానికి మేలు కూడా జరుగుతుంది. తగ్గుతున్న బ్యాటరీ ఖర్చులు, రాష్ట్ర ప్రోత్సాహకాలు, ఇతర రాయితీలు కూడా ఈవీల వినియోగం పెరగడానికి మరో కారణమని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర వెర్షన్లు అమ్మకాల్లో దూసుకుపోతున్నప్పటికీ, ట్రక్కులు బస్సులు తదితర భారీ వాహనాలు వెనుకబడి ఉన్నాయి. ఎందుకంటే డీజీల్, సీఎన్ జీ, ఎల్ఎన్జీ తో నడిచే భారీ వాహనాలంటే ఎలక్ట్రిక్ భారీ వాహనాలు చాాలా ఖరీదైనవి. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో కూడా తక్కువ ఖరీదుకు వాహనాలు రూపొందించేలా పరిశోధనలు జరగాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

సీఈఈడబ్ల్యూ సీనియర్ ప్రోగ్రామ్ లీడర్ డాక్టర్ హిమాని జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. మన దేశం జనాభాలో ప్రథమ స్థానంలో ఉంది, రాబోయే ఏళ్లలో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం నగరాల్లో జనాభా కిక్కిరిసిపోతున్నారు. భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలతో కాలుష్యం పెరిగిపోతుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగితే ఆ సమస్యకు పరిష్కరం లభిస్తుంది. తక్కువ ఖర్చుతో మెరుగైన రవాణా సదుపాయం దొరుకుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us