Jio IPO 2026: అబ్బబ్బ.. 27 కోట్ల కొత్త షేర్లు.. ఇన్వెస్టర్స్‌కి పండగే.. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓ..
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలవనున్న జియో ఐపీఓకు కీలక ముందడుగు పడింది. జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు ఆమోదంతో ముసాయిదా పత్రాలు సెబీకి సమర్పించారు.. సుమారు రూ.25 వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా 27 కోట్ల కొత్త షేర్లను ఇన్వెస్టర్లకు జారీ చేయనున్నట్లు వెల్లడైంది. ముఖేష్ అంబానీ ఐపీఓను రిలయన్స్‌కు కీలక మైలురాయిగా అభివర్ణించారు.

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓలలో రిలయన్స్ జియో ఐపీఓ ఒకటిగా నిలుస్తోంది. ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించడం ద్వారా జియో హిస్టరీ క్రియేట్ చేస్తోంది. జియో ఐపీవో కోసం ఇన్వెస్టర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ మెగా ఇష్యూకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు అధికారికంగా ఆమోదించింది. ఆ తర్వాత.. ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించిన కొద్దిసేపట్లోనే ఈ ప్రక్రియ జరిగిపోయింది. అంతకుముందు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి ముకేశ్ అంబానీ ప్రసంగించారు. జియో ఐపీఓపై కీలక ప్రకటన చేశారు. ఇది తనతో పాటు రిలయన్స్ కుటుంబానికి, కోట్లాది మంది వాటాదారులకు భావోద్వేగభరిత క్షణం అన్నారు. జియో ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను బోర్డు ఆమోదించి.. సెబీకి సమర్పించినట్టు తెలిపారు.
ఈ ఏడాది రిలయన్స్‌కు జియో ఐపీఓ అత్యంత ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు ముఖేశ్ అంబానీ. ఇది తమ వాటాదారులకు గణనీయమైన విలువను అందించడంతో పాటు కొత్త పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. ఈ ఐపీఓ ద్వారా సుమారు 25వేల కోట్ల పైచిలుకు నిధులు సేకరించాలని రిలయన్స్ జియో భావిస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో 27 కోట్ల కొత్త షేర్లను ఇన్వెస్టర్లకు జారీ చేయనుంది. ఇక.. డ్రాఫ్ట్ పేపర్లు దాఖలు చేసే నాటికి.. ప్రమోటర్ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో 66.43 శాతం వాటా ఉంది.
ఇదిలావుంటే.. గతేడాది నిర్వహించిన రిలయన్స్ ఏజీఎం సందర్భంగా జియో ఐపీఓ గురించి ముకేశ్ అంబానీ ప్రకటన చేశారు. 2026కు తొలి అర్ధభాగంలోనే జియో ఐపీఓ ఉంటుందని చెప్పినప్పటికీ.. వివిధ పరిణామాలు, కారణాలతో ఐపీఓ ప్రక్రియ ఆలస్యమైంది.
జియో I.P.Oపై రిలయన్స్ కీలక ప్రకటన చేసింది. మెగా I.P.Oకు సంబంధించి డ్రాఫ్ట్ పేపర్లను సెబీకి సమర్పించినట్టు వెల్లడించింది. ఈ ప్రకటనతో 27 కోట్ల కొత్త షేర్లు.. ఇన్వెస్టర్లకు చేరబోతుండటం సరికొత్త చరిత్రగా మారుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
