AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు ఒక కిలో మీటర్ నడిచేందుకు ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది..?

భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కోసం ఏటా వేల కోట్ల రూపాయలను విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేస్తున్నాయి. రైళ్లు నడవడానికి, ఏసీ, లైట్లు వంటి సౌకర్యాలకు రోజుకు సుమారు రూ.30 కోట్లు ఖర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Indian Railways: రైలు ఒక కిలో మీటర్ నడిచేందుకు ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది..?
Krishna S
|

Updated on: Nov 23, 2025 | 9:41 AM

Share

రైల్వే.. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ. రోజు లక్షలాది మంది ప్రయాణికులను రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తాయి. రైళ్లలో నిత్యం ఫుల్ రద్దీ ఉంటుంది.. దేశంలో ఎక్కడికైనా కనెక్టివిటీ, తక్కువ ధరలు ఉండడమే రద్దీకి దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ రైల్వే… ప్రతి ఏటా విద్యుత్ బిల్లుల రూపంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. రైళ్లు నడవడానికి, ప్రయాణికులకు ఏసీ, లైట్లు, ఫ్యాన్లు, ఛార్జింగ్ పాయింట్స్ వంటి సౌకర్యాలు అందించడానికి ఎంత విద్యుత్ వినియోగిస్తారు..? వాటి ఖర్చు ఎంత అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రైల్వే వార్షిక విద్యుత్ బిల్లు ఎంత?

భారతీయ రైల్వేల మొత్తం విద్యుత్ ఖర్చులను విశ్లేషిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇండియన్ రైల్వే వార్షిక విద్యుత్ బిల్లు సుమారు రూ.10 – 12వేలకోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ భారీ బిల్లును రోజువారీగా విభజిస్తే, రైల్వే ప్రతిరోజు సుమారు రూ.30 కోట్ల కరెంటు బిల్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక రైలుకు, ఒక కిలోమీటర్‌కు వినియోగం

రైలు నడపడానికి, ప్రయాణంలో సౌకర్యాలు కల్పించడానికి విద్యుత్ వినియోగం ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది.

యూనిట్‌ ధర: భారతీయ రైల్వేలు ప్రస్తుతం యూనిట్‌కి ఏడు రూపాయలు చొప్పున చెల్లించి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి.

కిలోమీటర్‌కు వినియోగం: ప్రస్తుతం నడుస్తున్న ఎలక్ట్రిక్ రైళ్లకు కేవలం నడవడానికి మాత్రమే ఒక కిలోమీటర్‌కు సగటున 20 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. రైలులో ఇతర వినియోగాన్ని కూడా కలిపితే ఇది ఇంకా పెరుగుతుంది.

ఏసీ బోగీల్లో ఖర్చు: రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ప్రతి గంటకు సగటున 210 యూనిట్లు విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఈ లెక్కన, కేవలం 12 గంటలపాటు ఒక ఏసీ బోగీని నడిపితే సుమారు రూ.17,640 కరెంటు బిల్లు అవుతుంది

బిల్లు దేనిపై ఆధారపడుతుంది..?

ఒక రైలుకు ఒక రోజు కరెంటు బిల్లు ఎంత అవుతుంది అనేది కచ్చితంగా చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది:

రైలు రకం: రైలు ఎక్స్‌ప్రెస్సా, ప్యాసింజర్ రైలా, లేదా సరుకు రవాణా రైలా అనేదానిపై.

ప్రయాణ దూరం: రైలు నడిచే మొత్తం దూరం.

సౌకర్యాలు: ఏసీ బోగీలు, ప్యాంట్రీ ఉన్నాయా లేదా అనేదానిపై.

విద్యుత్ చార్జీలు: కొనుగోలు చేసిన విద్యుత్ యూనిట్ల సంఖ్య, వివిధ చార్జీలు.

రైల్వే స్టేషన్లలో, రైళ్లు నిలిపి ఉన్నప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన వ్యవస్థల కోసం నిరంతరం విద్యుత్తును ఉపయోగిస్తారు. మొత్తం మీద దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన రైల్వే.. విద్యుత్ వినియోగంలో కూడా అతిపెద్ద వినియోగదారుల్లో ఒకటిగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి