Mukesh Ambani: అంబానీ ఇంట్లో పని మనిషి నెల జీతం ఎంతో తెల్సా.. అస్సలు ఊహించలేరు
ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరి ఇప్పుడు కూడా ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలు ఇలా..

ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరి ఇప్పుడు కూడా ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంబానీ ఇంట్లో పని మనిషికి నెల జీతం ఎంత.? వారికి లభించే అలవెన్సుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగ్లా యాంటిలియా. 27 అంతస్తులతో ఉన్న ఈ ఇంటి నిర్మాణం 2010లో పూర్తయింది. ఇది భారీ భూకంపాలను సైతం తట్టుకోగలదు. సరే.! ఇంతకీ అసలు అంబానీ ఇంట్లో ఎంతమంది పనివాళ్లు పని చేస్తున్నారంటే.. అంబానీ ఇంట్లో వంట చేయాలంటే గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా చేసి ఉండాలి. అంతేకాకుండా, వారికి అనేక రకాల ఇంటర్వ్యూలు, పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటి పనికోసం నియమించుకుంటారు. అంబానీ ఇంట్లో దాదాపు 600 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఒక వంట మనిషి నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తుంది.
ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేసే సిబ్బందికి రాజభోగాలు లభిస్తాయని చెప్పొచ్చు. సిబ్బంది కోసం ప్రైవేట్ రూమ్, హై-శాలరీ, భారీ అలవెన్స్‌లు లభిస్తాయి. యాంటిలియాలో చెత్త ఊడ్చేవారు, ఫ్లోర్ స్వీపర్లు నెలకు రూ.2 లక్షల వరకు సంపాదిస్తారు. జీతంతో పాటు విద్యా, వైద్య అలవెన్స్‌లు కూడా ఉంటాయి.




