EV Battery Life: బ్యాటరీ చుట్టూ తిరుగుతున్న ఈవీ రంగం.. ఈవీ స్కూటర్స్‌లో బ్యాటరీ ఎన్ని రోజులు వస్తుందంటే?
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతుంది. వాటి పరిధి ఎక్కువ, నిర్వహణ ఖర్చు తక్కువ కాబట్టి ప్రజలు వీటి వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ లైఫ్ గురించి బ్యాటరీ మధ్యలో విఫలమవుతుందా? లేదా ఎన్ని సంవత్సరాలు మన్నుతుంది? అనే దాని గురించి కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఎంతకాలం ఉంటుంది? దానిని ఎప్పుడు మార్చాలి? అనే విషయం గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

సాధారణంగా ఈవీ స్కూటర్స్‌లో లిథియం-అయాన్ బ్యాటరీలను ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువగా 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటాయి. అయితే, బ్యాటరీ జీవితం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలను ఛార్జింగ్ సైకిల్స్ ఆధారంగా కొలుస్తారు. మంచి నాణ్యత ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీ 800 నుండి 1,500 ఛార్జింగ్ సైకిల్స్ వరకు ఉంటుంది. ఒక వ్యక్తి రోజూ 30-40 కి.మీ. స్కూటర్ నడిపి బ్యాటరీని సరిగ్గా ఛార్జ్ చేస్తే, అది దాదాపు 4-5 సంవత్సరాలు పనిచేస్తుంది.
బ్యాటరీ జీవితకాలాన్ని ప్రభావితం చేసే అంశాలు
- పదే పదే పూర్తిగా ఛార్జ్ చేయడం, బ్యాటరీని సున్నా శాతానికి డిశ్చార్జ్ చేయడం వల్ల దాని జీవితకాలం తగ్గుతుంది. ఛార్జ్‌ను 20 శాతం నుంచి 80 శాతం మధ్య ఉంచడం ఎల్లప్పుడూ మంచిది.
- అలాేగ అధిక వేడి లేదా చలి బ్యాటరీ పనితీరును ప్రభావితం చేస్తుంది.
- స్కూటర్‌పై అధిక లోడ్ పెట్టడం వల్ల బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది.
- తరచుగా వేగంగా స్కూటర్ నడపడం, ఆకస్మిక బ్రేకింగ్ బ్యాటరీపై అదనపు భారాన్ని మోపుతాయి.
బ్యాటరీ మార్పు
ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ వేగంగా డిశ్చార్జ్ కావడం ప్రారంభం కావడంతో ఛార్జ్ కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటే, లేదా దాని పనితీరు తగ్గితే, అది బ్యాటరీని మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి. చాలా కంపెనీలు బ్యాటరీపై 3-5 సంవత్సరాల వారంటీని అందిస్తాయి. కాబట్టి వారంటీ గడువు ముగిసిన తర్వాత బ్యాటరీని తనిఖీ చేయడం ముఖ్యం.