- Telugu News Photo Gallery Business photos Top 5 cars in india under rs 7 lakh having 6 airbags details in telugu
Top 5 Cars: భద్రతకే జై కొడుతున్న కారు లవర్స్.. సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్‌తో వచ్చే టాప్-5 కార్లు ఇవే..!
ఇటీవల కాలంలో దేశంలో కార్లను వినియోగించే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు బడ్జెట్‌లో వచ్చే కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కార్ల కొనుగోలు వారు అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. కార్లలో వచ్చే టాప్ ఫీచర్లతో పాటు భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే కాపాడే ఎయిర్‌బ్యాగ్స్ ఉండే కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ కార్లల్లో టాప్-5 బడ్జెట్ కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Srinu |
Updated on: Mar 20, 2025 | 3:30 PM

మారుతి సుజుకీ స్విఫ్ట్ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌తో వస్తుంది. స్విఫ్ట్ దాని స్పోర్టీ డిజైన్, సరసమైన ధర వల్ల మధ్య తరగతి ప్రజలకు గొప్ప ఎంపికగా ఉంటుంది. ఈ కారు ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, సీఎన్‌జీ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు బేస్ మోడల్ రూ. 6.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారులో కూడా సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. భద్రత పరంగా హ్యూందాయ్ ఎక్స్‌టర్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ప్రామాణికంగా అమర్చి ఉన్నాయి. ఎక్స్‌టర్ కారు రూ. 6.20 లక్షల నుంచి (ఎక్స్- షోరూమ్) ప్రారంభమవుతుంది.

మారుతి సుజుకి ఆల్టో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌తో వచ్చే కూడిన బడ్జెట్- స్నేహపూర్వక కారు. ఈ కారు 1.0 లీటర్ కే10సీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ కారులో సీఎన్‌జీ ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ. 4.23 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ కారుకు సంబందించిన అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌తో వస్తాయి. గ్రాండ్ ఐ 10 నియోస్ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ ఐ10 నియోస్ కూడా ప్రస్తుుతం కొనుగోళ్లల్లో తన మార్క్ చూపుతుంది. ఈ కారు ధర రూ. 5.98 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.

నిస్సాన్ మాగ్నెట్ కారు అత్యంత సరసమైన సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ కారులో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. మాగ్నైట్‌కు సంబంధించిన దిగువ వేరియంట్లు 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తే తర్వాత వేరియంట్లు 1-లీటర్ టర్బో పెట్రోల్ ద్వారా శక్తిని పొందుతాయి. ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ. 6.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభం అవుతుంది.





























