AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda Activa : వారెవ్వా యాక్టివా.. స్మార్ట్ ఫీచర్లతో కొత్త మోడల్ అదిరిపోయిందిగా.. మార్కెట్‪లోకి ఎప్పటి నుంచి అంటే..

దేశంలో అత్యధిక టూవీలర్ల అమ్మకాలు చేసిన సంస్థగా హోండా నిలిచింది. ఇప్పుడు మరో కొత్త అప్ డేట్ ను సంస్థ ప్రకటించింది. హోండా యాక్టివా 125 హెచ్ స్మార్ట్(Honda Active 125 H-Smart) పేరిట దీనిని తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఓ టీజర్ ను విడుదల చేసింది.

Honda Activa : వారెవ్వా యాక్టివా.. స్మార్ట్ ఫీచర్లతో కొత్త మోడల్ అదిరిపోయిందిగా.. మార్కెట్‪లోకి ఎప్పటి నుంచి అంటే..
Activa 125 H Smart
Madhu
|

Updated on: Mar 26, 2023 | 11:27 AM

Share

మన ఇండియన్ మార్కెట్లో స్కూటర్ల శ్రేణిలో హోండా యాక్టివా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. కొన్నేళ్లుగా అత్యధిక శాతం వాటాను ఈ యాక్టివానే కలిగి ఉంది. దీనికి పోటీగా చాలా కంపెనీలు తమ తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టినా యాక్టివా ముందు నిలబడలేకపోతున్నాయి. మరో వైపు యాక్టివా తన మోడళ్లను అప్ గ్రేడ్ చేసుకుంటూ పోతోంది. ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన 6జీ మోడల్ స్కూటర్ లో రిమోట్ కీ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దీంతో దేశంలో అత్యధిక టూవీలర్ల అమ్మకాలు చేసిన సంస్థగా హోండా నిలిచింది. ఇప్పుడు మరో కొత్త అప్ డేట్ ను సంస్థ ప్రకటించింది. హోండా యాక్టివా 125 హెచ్ స్మార్ట్(Honda Active 125 H-Smart) పేరిట దీనిని తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఓ టీజర్ ను విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ ప్రకటించలేదు. ఫీచర్లు, డిజైన్ వంటి వివరాలను గోప్యంగా ఉంచింది. అయితే కంపెనీ విడుదల చేసిన కొన్ని చిత్రాలను బట్టి వచ్చే మోడల్ లో కూడా పెద్ద ఎత్తున డిజైన్ లోగానీ, ఫీచర్లలో గానీ మార్పులు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

6జీకి దగ్గరగానే..

హోండా యాక్టివా 125హెచ్ స్మార్ట్ స్కూటర్ కూడా ఇటీవల విడుదలైన 6జీ స్కూటర్ కు దగ్గరగానే ఉంటే అవకాశం ఉంది. కొత్త బైక్ లో కూడా ఎలక్ట్రానిక్ కీ, పుష్ బటన్ స్టార్ట్ వంటి ఫీచర్స్ తో పాటు పార్క్ చేసిన బైక్ ని కనుగొనేందుకు వీలుగా సిగ్నల్ ఇండికేటర్స్ ఫ్లాష్ అయ్యేలా కొత్త ఫీచర్ తీసుకొచ్చారు.

ధర ఎంత ఉండొచ్చు..

ఇవి కూడా చదవండి

ఇక ధర విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న ధరకు దాదాపు రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకూ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ మూడు రకాల వేరియేషన్లలో యాక్టివాను అందుబాటులో ఉంచుతోంది. యాక్టివా 125 డ్రమ్ మోడల్ రూ. 77,743 నుంచి ఉంది. అలాగే యాక్టివా 125 డ్రమ్ అల్లాయ్ రూ. 81,411 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే యాక్టివా 125 డిస్క్ బ్రేక్ 81,611 నుంచి 84,916 వరకూ ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..