Home Loan: మీ క్రెడిట్ స్కోర్ ఇలా ఉందా.. హోమ్ లోన్ కోసం బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు ఇవే..
క్రెడిట్ స్కోర్ ఒక వ్యక్తి ఆర్థిక చరిత్ర గురించి చెబుతుంది. క్రెడిట్ స్కోర్‌లో అన్ని గత రుణ రికార్డులు, క్రెడిట్ కార్డ్, ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలు ఉంటాయి. అయితే బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు అన్ని వివరాలను సరి చూస్తాయి. రుణం తీసుకునే వ్యక్తి ఆర్థిక వివరాలు, ఎలాంటి ఉద్యోగం చేస్తున్నాడు. వ్యాపారం ఏమైన ఉందా..? ఆస్తిపస్తులు ఎన్ని ఉన్నాయి తదితర వివరాలు చూస్తాయి..
క్రెడిట్ స్కోర్ ఆధారిత వడ్డీ రేట్లు అంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటిని కొనుగోలు చేయడానికి డబ్బు ఇచ్చే రేట్లు. రుణం తీసుకునే వ్యక్తి క్రెడిట్ స్కోర్‌ను బట్టి ఈ రేటు నిర్ణయించబడుతుంది. క్రెడిట్ స్కోర్ అనేది ఒక వ్యక్తి ఆర్థిక పరపతిని అంచనా వేయడానికి ఒక సాధనం. క్రెడిట్ బ్యూరో చేసిన లెక్కల ద్వారా ఇది నిర్ణయించబడుతుంది.
క్రెడిట్ స్కోర్ ఒక వ్యక్తి ఆర్థిక చరిత్ర గురించి చెబుతుంది. క్రెడిట్ స్కోర్‌లో అన్ని గత రుణ రికార్డులు, క్రెడిట్ కార్డ్, ఇతర ఆర్థిక లావాదేవీల వివరాలు ఉంటాయి. అయితే బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు అన్ని వివరాలను సరి చూస్తాయి. రుణం తీసుకునే వ్యక్తి ఆర్థిక వివరాలు, ఎలాంటి ఉద్యోగం చేస్తున్నాడు. వ్యాపారం ఏమైన ఉందా..? ఆస్తిపస్తులు ఎన్ని ఉన్నాయి తదితర వివరాలు చూస్తాయి. రుణం ఇచ్చే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్‌లను అనేక స్థాయిలుగా విభజిస్తాయి. ఈ వర్గీకరణలు ఆర్థిక సంస్థ నుండి ఆర్థిక సంస్థకు మారవచ్చు.
750 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే అద్భుతమైనదిగా పరిగణిస్తాయి బ్యాంకులు. అలాగే 700-749 బాగానే ఉందని, 650-699 వరకు ఉంటే పర్వాలేదని, 600-649 స్కోర్ ఉంటే మామూలుగా ఉందని, 600 కంటే తక్కువగా స్కోర్ ఉంటే మరి తక్కువ ఉందని పరిగణిస్తారు. అయితే ఇంటి నిర్మించాలన్నా.. కొనుగోలు చేయాలన్నా ఖర్చుతో కూడుకున్నది. బ్యాంకులు ఇచ్చే రుణాలలో వడ్డీ రేట్లు అందరికి ఒకేలా ఉండవు. క్రెడిట్ స్కోర్ అద్భుతంగా ఉన్నవారికి తక్కువ వడ్డీ రేట్లలో అందిస్తుంటాయి. అదే సాధారణంగా ఉంటే ఎక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తుంటాయి. అయితే రుణాలు అందించే బ్యాంకుల వడ్డీ రేట్లలో తేడాలు ఉంటాయి. ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా ఉంటుందని గుర్తించుకోండి. బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే క్రెడిట్ స్కోర్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని గుర్తించుకోండి. క్రెడిట్ స్కోర్‌ను బట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. ఇక క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూద్దాం. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ వడ్డీ రేట్ల వివరాలు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వెబ్‌సైట్ల ఆధారంగా అందించడం జరిగింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
- 700 లోపు క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 8.55 – 9.75 శాతం
- 700 -750 లోపు క్రెడిట్ స్కోర్: 8.50 – 8.80 శాతం
- 750-800 లోపు స్కోర్: 8.40 -8.70 శాతం
- 800పై స్కోర్ : 8.40 -8.70 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంకు:
- 700 లోపు క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 10 – 10.10 శాతం
- 700 -750 లోపు క్రెడిట్ స్కోర్: 9.9 – 10 శాతం
- 750-800 లోపు స్కోర్: 8.55 -8.65 శాతం
- 800పై స్కోర్ : 8.50 -8.55 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా:
- 700 లోపు క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 8.90 – 10.75 శాతం
- 700 -750 లోపు క్రెడిట్ స్కోర్: 8.70 – 9 శాతం
- 750-800 లోపు స్కోర్: 8.60 -8.70 శాతం
- 800పై స్కోర్ : 8.30 -8.40 శాతం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర:
- 700 లోపు క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 8.40 – 10.90 శాతం
- 700 -750 లోపు క్రెడిట్ స్కోర్: 8.80 – 9.50 శాతం
- 750-800 లోపు స్కోర్: 8.60 -8.70 శాతం
- 800పై స్కోర్ : 8.40 -8.60 శాతం
ఎల్‌ఐసీ హౌసింగ్:
- 700 లోపు క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 9.30 – 10.50 శాతం
- 700 -750 లోపు క్రెడిట్ స్కోర్: 8.75 – 9.05 శాతం
- 750-800 లోపు స్కోర్: 8.50 -8.80 శాతం
- 800పై స్కోర్ : 8.50 -8.80 శాతం
పంజాబ్ అండ్ సింథ్ బ్యాంకు:
- 700 లోపు క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 9.35 – 10 శాతం
- 700 -750 లోపు క్రెడిట్ స్కోర్: 9. – 9.40 శాతం
- 750-800 లోపు స్కోర్: 8.50 -9.05 శాతం
- 800పై స్కోర్ : 8.50 – 8.55 శాతం
యూకో బ్యాంకు:
- 700 లోపు క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 9.45 – 10.30 శాతం
- 700 -750 లోపు క్రెడిట్ స్కోర్: 8.85 – 9.05 శాతం
- 750-800 లోపు స్కోర్: 8.65 -8.85 శాతం
- 800పై స్కోర్ : 8.45 -8.65 శాతం
యూనిన్ బ్యాంకు:
- 700 లోపు క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 9.45 – 10.80 శాతం
- 700 -750 లోపు క్రెడిట్ స్కోర్: 9.15 – 9.25 శాతం
- 750-800 లోపు స్కోర్: 8.40 -8.55 శాతం
- 800పై స్కోర్ : 8.40 -8.55 శాతం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి