AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: ఒడిదుడుకులతో గృహ నిర్మాణ రంగం.. నిర్మలమ్మ పద్దుపైనే ఆశలన్నీ..!

మరికొన్ని రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను  ప్రవేశపెట్టునున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో గృహ నిర్మాణ రంగం ఒడిదుడుకులతో సతమతమవుతుంది. ఈ సమయంలో ఈ బడ్జెట్‌లో కీలకమైన సవాళ్లను పరిష్కరించి, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించే సంస్కరణలను తీసుకురావాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గృహ కొనుగోలుదారులకు పన్ను ప్రయోజనాలను పెంచడంతో పాటు ముఖ్యంగా సెక్షన్ 80 సీ, సెక్షన్ 24(బి) విషయాల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Budget 2024: ఒడిదుడుకులతో గృహ నిర్మాణ రంగం.. నిర్మలమ్మ పద్దుపైనే ఆశలన్నీ..!
Budget 2024
Nikhil
|

Updated on: Jul 03, 2024 | 7:00 PM

Share

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్‌డీఏ సర్కార్ కొలువుదీరింది. మరికొన్ని రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను  ప్రవేశపెట్టునున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో గృహ నిర్మాణ రంగం ఒడిదుడుకులతో సతమతమవుతుంది. ఈ సమయంలో ఈ బడ్జెట్‌లో కీలకమైన సవాళ్లను పరిష్కరించి, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించే సంస్కరణలను తీసుకురావాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గృహ కొనుగోలుదారులకు పన్ను ప్రయోజనాలను పెంచడంతో పాటు ముఖ్యంగా సెక్షన్ 80 సీ, సెక్షన్ 24(బి) విషయాల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా గృహ రుణ వడ్డీపై మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం గాడిలో పడుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగ వృద్ధికి నిపుణులు సూచనలను ఓ సారి తెలుసుకుందాం. 

సింగిల్ విండో క్లియరెన్స్

అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లకు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా ఉండడంతో పాటు ఖర్చులు తగ్గుతాయని చెబుతున్నారు. ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేయడంతో పాటు ఈ రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతుంది.

గృహాల కోసం ప్రోత్సాహకాలు

సరసమైన గృహాలపై నిరంతర దృష్టి కీలకం. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకింద ప్రయోజనాలను పొడిగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సరసమైన గృహ ప్రాజెక్టులలో నిమగ్నమై ఉన్న డెవలపర్‌లకు అదనపు ప్రోత్సాహకాలను అందించాలని చెబుతున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో పరిమితిని రూ. 45 లక్షల నుంచి రూ. 1 కోటికి పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. ఇది హౌసింగ్ గ్యాప్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇళ్లను అందిస్తుందని వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

లిక్విడిటీ సమస్యలను పరిష్కారం

రియల్ ఎస్టేట్ రంగం లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది. డెవలపర్‌లకు ప్రత్యేకించి చిన్న, మధ్య తరహా సంస్థలకు ఫైనాన్సింగ్‌కు సులభంగా యాక్సెస్‌ని అందించే చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు. బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల ద్వారా నిధుల ప్రవాహాన్ని పెంపొందించాలని వివరిస్తున్నారు. నిలిచిపోయిన రియల్టీ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే విషయంలో కీలక చర్యలు తీసుకోవాలని కోరుతున్నాు. 

భూసేకరణలో సంస్కరణలు

భూసేకరణ ప్రక్రియలను సరళీకృతం చేయడం, దానికి సంబంధించిన ఖర్చులను తగ్గించడం రియల్ ఎస్టేట్ అభివృద్ధిని పెంచడంలో కీలకంగా ఉంటుంది. పారదర్శకమైన, న్యాయమైన భూసేకరణ విధానాలు మరింత మంది డెవలపర్‌లను కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రోత్సహిస్తాయి.

అద్దె గృహాలపై దృష్టి

పట్టణ జనాభా, వలస కార్మికులను తీర్చడానికి అద్దె గృహాలను ప్రోత్సహించే విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రెంటల్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లను నిర్మించడానికి డెవలపర్‌లకు ప్రోత్సాహకాలు విభిన్న జనాభా యొక్క గృహ అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి.

డిజిటల్ పరివర్తన

సాంకేతిక పురోగతి, డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించడం మరింత పారదర్శకత, సామర్థ్యానికి దారి తీస్తుంది. ప్రోప్‌టెక్ సొల్యూషన్స్‌ను అనుసరించడానికి ప్రోత్సాహకాలు రంగాన్ని మరింత ఆధునికీకరిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి