Business Ideas: ఊర్లో ఉంటూ నెలకు రూ.30 వేలు సంపాదించుకోవచ్చు! మహిళల కోసం ప్రత్యేకమైన బిజినెస్ ఐడియా
గ్రామీణ మహిళలకు ఇంటి నుండి నెలకు రూ.25-30 వేలు సంపాదించే అద్భుతమైన వ్యాపార ఆలోచన ఇది. కేవలం రూ.10 వేల పెట్టుబడితో హోల్‌సేల్‌గా చీరలు, పిల్లల దుస్తులు తెచ్చి మీ ఇంటి నుంచే అమ్మవచ్చు. పల్లెటూరి వారికి నగరాలకు వెళ్లే శ్రమ లేకుండా, ఆకర్షణీయమైన డిజైన్లతో మంచి లాభాలు పొందవచ్చు.

ఇంట్లో ఉండే మహిళలకు కుటుంబం కోసమో, వారి కోసమో ఎంతో కొంత సంపాదించుకోవాలని ఉంటుంది. సిటీలో ఉంటే ఏదైనా పార్ట్‌టైమ్ జాబ్ చేసుకోవచ్చు. మరి పల్లెటూర్లో ఉండే మహిళలు ఎలా సంపాదించుకోవాలి. కూలీ పనులకు వెళ్లలేని వారు, ఇంటి పట్టునే ఉంటూ నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదించుకోవాలని అనుకునేవాళ్లకు అనువైన ఒక బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ప్రస్తుత కాలంలో కొత్త దుస్తులు కొనడం ఎక్కువైంది. గతంలో ఎప్పుడో పండక్కో పబ్బానికో కొనేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పెద్దగా అవసరం లేకపోయినా, నచ్చితే కొనేస్తున్నారు. బట్టలు కొనేందుకు పెద్దగా సందర్భం చూడటం లేదు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ముందు ఉన్నారు. ఇక చిన్న పిల్లల విషయంలో అయితే తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తున్నారు. ప్రజల్లో వచ్చిన మార్పునే మీరు వ్యాపారంగా మార్చుకోవచ్చు. అది ఎలాగంటే.. ఒక పెద్ద హోల్‌సేల్ షాపు నుంచి తక్కువ ధరకు చీరలు, చిన్న పిల్లల దుస్తులు తీసుకొచ్చి ఇంట్లోనే అమ్మడం ప్రారంభించాలి.
పెళ్లి, పండగల షాపింగ్‌కు అయితే ఊర్ల నుంచి జనం సిటీకి వెళ్తారు కానీ, చిన్న చిన్న అవసరాలకు, ఒక చీర కోసమో, ఒక డ్రెస్ కోసమో అయితే వెళ్లరు. పైగా సిటీలోని షాపుల్లో ఉండే ధరల కంటే కాస్త ఎక్కువగా ఉన్నా, లేదా అదే ధరకు ఇచ్చినా కూడా ఇరుగుపోరు వారు కూడా కొనేస్తారు. పైగా మీరు తెచ్చే డిజైన్లు ఆకర్షణీయంగా ఉంటే చాలు మంచి బిజినెస్ అవుతుంది. పైగా ఊర్లలో ఈ బిజినెస్ చేస్తూ క్రెడిట్‌పై కూడా బట్టలు అమ్మొచ్చు. నెట్ క్యాష్ అయితే తక్కువ ధర, అప్పుగా తీసుకుంటే కాస్త ఎక్కువ ధర కూడా తీసుకోవచ్చు. పైగా దీనికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. కేవలం రూ.10 వేలతో కొంత సరుకు తెచ్చి, వాటిని అమ్మి.. అలా అలా సరుకు పెంచుకోవచ్చు. పైగా ఇంట్లోనే ఉంటూ ఎవరైనా వస్తే వారికి డిజైన్లు చూపిస్తూ వ్యాపారం పెంచుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




