E-Bike: ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకొంటున్నారా? గేర్లున్నా ఈ బైక్‌పై రూ. 50,000 వరకూ ఆఫర్.. రెండు రోజులే అవకాశం
దేశంలోనే మొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ మేటర్ ఏరా. దీనిని అహ్మదాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ మ్యాటర్ ఆవిష్కరించింది. ఇది మంచి స్పోర్టీ లుక్ లో ఆకట్టుకుంటుంది. ఈ బైక్ కొనుగోలుపై మేటర్ కంపెనీ అదిరే ఆఫర్ ప్రకటించింది.
దేశంలోనే మొదటి గేర్డ్ ఎలక్ట్రిక్ బైక్ మేటర్ ఏరా. దీనిని అహ్మదాబాద్ కు చెందిన స్టార్టప్ కంపెనీ మ్యాటర్ ఆవిష్కరించింది. ఇది మంచి స్పోర్టీ లుక్ లో ఆకట్టుకుంటుంది. ఈ బైక్ కొనుగోలుపై మేటర్ కంపెనీ అదిరే ఆఫర్ ప్రకటించింది. జూన్ ఐదో తేదీన పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఆ ఆఫర్ ఎంటంటే బైక్ కొనుగోలుపై రూ. 50,000 వరకూ వివిధ ప్రయోజనాలు అందిస్తోంది. దీనిలో రూ. 30,000 బైక్ ధరపై డిస్కౌంట్‌కాగా మరో రూ. 20,000 మ్యాటర్ కేర్ ప్యాకేజీ కింద ఇస్తారు. ఈ నేపథ్యంలో అసలు ఈ బైక్ ఏంటి? బైక్ ఫీచర్స్ ఎలా ఉంటాయి? రేంజ్ వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
పెరిగిన ధర..
ఈ మ్యాటర్ ఏరా బైక్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. మ్యాటర్ ఏరా 5000, 5000 ప్లస్. రెండింటికీ రూ. 30,000 చొప్పున ధర పెంచింది. ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సిడీలకు సంబంధించిన చేపట్టిన సవరణల కారణంగా ఈ ధర పెంపు చోటుచేసుకుంది. దీంతో జూన్ ఆరో తేదీ నుంచి మ్యాటర్ ఏరా 5000 ధర రూ. 1,73,999కాగా మ్యాటర్ ఏరా ప్లస్ ధర రూ. 1,83,999గా ఉంది. అయితే జూన్ 5 వరకూ పాత ధరలే అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ సమయంలో కేవలం రూ. 999 చెల్లించి బైక్ బుక్ చేసుకోవచ్చని మ్యాటర్ కంపెనీ ప్రకటించింది. కంపెనీ అధికారిక వెబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్, ఓటో క్యాపిటల్‌లో దీనిని బుక్ చేసుకొనే అవకాశం కల్పించినట్లు కంపెనీ పేర్కొంది. డెలివరీలు సెప్టెంబర్ నుంచి మొదలవుతాయి.
బైక్ పూర్తి వివరాలు ఇవి..
ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 4 స్పీడ్ హైపర్ షిఫ్ట్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇది 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6 సెకన్లలోనే అందుకుంటుంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చేస్తే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ 125 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇంకా ఈ బైక్ రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువే. కిలోమీటర్‌కు 25 పైసలు ఖర్చు అవుతుంది. ఇంకా ఈ బైక్‌లో 7 ఇంచుల టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..