NPS Pension Plan: బెస్ట్ పెన్షన్ స్కీమ్ ఇదే.. ఇలా చేస్తే నెలకు రూ. 5లక్షల వరకూ పెన్షన్..
ఎన్‌పీఎస్ అనేది ప్రభుత్వ మద్దతు కలిగిన పదవీ విరమణ పొదుపు పథకం . ఇది పన్ను ప్రయోజనాలను అందిస్తూనే.. పదవీ విరమణ కార్పస్‌ను నిర్మించుకునే అవకాశాన్ని మీకు అందిస్తుంది. దీని ముఖ్య ఫీచర్లలో ఒకటి పథకం సౌలభ్యం. ఇది పెట్టుబడిదారులకు రిస్క్ లేకుండా ఈక్విటీ, డెట్ పెట్టుబడుల కలయికను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందుతున్న పెన్షన్ పథకాలలో నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) ఒకటి. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల పదవీవిరమణ పథకంగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. వృద్ధాప్యంలో పదవీవిరమణ తర్వాత జీవితానికి భరోసా ఇచ్చేలా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. స్థిరమైన పొదుపులతో పెన్షన్ ని కూడా అందిస్తుంది. ఈ క్రమంలో మీరు 40 ఏళ్ల వయస్సు దాటిన వ్యక్తి అయితే.. దీనిలో ఎంత పెట్టుబడి పెడితే.. ఎంత పెన్షన్ వస్తుంది. పొదుపు ఎంత అవుతుంది? అనే అంశాలపై క్లారిటీ ఉండకపోవచ్చు. అలాంటి వారి కోసమే ఈ కథనం. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా 40 ఏళ్ల వ్యక్తి.. పదవీవిరమణ తర్వాత రూ. 5 లక్షల కంటే ఎక్కువ నెలవారీ పెన్షన్‌ను పొందాలంటే ఏం ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎన్‌పీఎస్‌ని ఇలా పని చేస్తుంది..
ఎన్‌పీఎస్ అనేది ప్రభుత్వ మద్దతు కలిగిన పదవీ విరమణ పొదుపు పథకం . ఇది పన్ను ప్రయోజనాలను అందిస్తూనే.. పదవీ విరమణ కార్పస్‌ను నిర్మించుకునే అవకాశాన్ని మీకు అందిస్తుంది. దీని ముఖ్య ఫీచర్లలో ఒకటి పథకం సౌలభ్యం. ఇది పెట్టుబడిదారులకు రిస్క్ లేకుండా ఈక్విటీ, డెట్ పెట్టుబడుల కలయికను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. గరిష్టంగా ఎలాంటి పరిమితీ లేకుండా పెట్టుబడికి అనుమతిస్తుంది. అలాగే అతి తక్కువ ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలను కలిగి ఉంటుంది. వాస్తవానికి ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మేలు జరుగుతుంది. అధిక కార్పస్ దీనిలో పోగవుతుంది. పెన్షన్ ఎక్కువ వస్తుంది. ఉదాహరణకు, నెలవారీ కంట్రిబ్యూషన్ ఒకే విధంగా ఉన్నప్పటికీ, 40 ఏళ్ల వయస్సు నుంచి ప్రారంభమయ్యే వారితో పోలిస్తే 30 ఏళ్ల వయస్సు నుంచి ప్రారంభమయ్యే వ్యక్తికి చివరిలోపెద్ద కార్పస్ ఉంటుంది.
40 ఏళ్ల వ్యక్తికి, ఐదు లక్షల పెన్షన్..
ఎన్పీఎస్ కాలిక్యులేటర్ ప్రకారం, మీరు 40 సంవత్సరాల వయస్సులో ప్రతి నెలా రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టడం ప్రారంభించి, మీకు 65 ఏళ్లు వచ్చే వరకు కొనసాగిస్తే, మీ పెట్టుబడిపై 12% వార్షిక రాబడిని అంచనా వేస్తే, మీరు గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు. పదవీ విరమణ సమయంలో, మీరు 6% రేటుతో యాన్యుటీని కొనుగోలు చేయడానికి మీ సేకరించిన కార్పస్‌లో 55% కేటాయిస్తే, మీరు రూ. 5 లక్షల కంటే ఎక్కువ నెలవారీ పెన్షన్ పొందవచ్చు. అయితే ఈ పెట్టుబడులకు గ్యారంటీ రిటర్న్స ఉండవని గమనించాలి. మార్కెట్ పరిస్థితులను బట్టి మారవచ్చు. ఎన్పీఎస్‌పై రాబడి ఈక్విటీ, కార్పొరేట్ డెట్, ప్రభుత్వ బాండ్లలో అంతర్లీన పెట్టుబడుల పనితీరుకు లోబడి ఉంటుందని అర్థం చేసుకోవడం చాలా అవసరం .
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..